ఈ మూడు సంవత్సరాల్లో అందరి జీవితాలు ఒకలా మారిపోయాయి. సాక్షి తన కొడుకుతో కలిసి మంగళూరులోని జీవితానికి అలవాటు పడిపోయింది. తారక్ మాత్రం విజయరథంపై దూసుకెళ్తూ బిజినెస్ ఫీల్డ్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. తను, సంతోష్‌ల జీవితం ఒకలా ఉంటే… సమంత, రఘుల జీవితం మరోలా సాగుతోంది. స్వార్థంతో నిండిపోయిన వారి మనసులకు గట్టి దెబ్బ తగిలేలా శాలిని ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా శాలిని… సాక్షికి ఎదురయ్యారు. ఇదంతా చూసి మనస్తాపానికి గురైన చంద్రప్రసాద్ యాదవ్ గారు… తన తల్లి దగ్గరకు వెళ్లిపోయారు.