అరగంట నుండి ఒక్క చోట కూడా కుదురుగా కూర్చోకుండా ………. !! అటు ఇటు తిరుగుతూ నిమిషానికి 10 సార్లు మొబైల్ చెక్ చేసుకుంటున్న ఆకాష్ వైపు అసహనంగా చూస్తూ ……… !! ఆకాష్ ఎందుకంత కంగారుపడుతున్నావ్ ముందిలా కామ్ గా కూర్చో …………. !! ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేసి బయటకు రాగానే కాల్ చేస్తానని చెప్పాడు కదా ………. !! టెన్షన్ పడకుండా ఉండు మన ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ……… !!
లేదమ్మా నాకు ఎందుకో ఎదో జరిగింది అనిపిస్తుంది ………. !! ఆ డాక్టర్ మనకు కాల్ చేసి 45 నిమిషాలు|| దాటింది ………. !! ఒక్క ఇంజెక్షన్ చేయడానికి ఇంత టైమ్ తీసుకుంటాడా చెప్పు నాకు ఎందుకో అనుమానంగా ఉంది ………. !!