వాష్‌రూమ్‌లోని మిర్రర్ ముందు నిలబడి టాప్ నుండి వాటర్ తీసుకుని రెండు చేతులతో ముఖంపై నీళ్లు చల్లుకుంది నిత్య……….. !! చల్లటి నీటి చుక్కలు ఆమె మొహాన్ని తాకుతున్నా గుండెల్లో రగులుతున్న మంట మాత్రం చల్లారలేదు……… !! అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చేతితో నీళ్ళు తుడిచేసుకుంటూ ఛా!! అసలు ఎవరి ఫేస్ అయితే చూడకూడదని అందరినీ అన్నిటినీ వదిలి ఈ ఊరు వచ్చానో ………. !! అదే వ్యక్తి మళ్లీ నా ముందుకు వచ్చాడు అదీ కాకుండా అతను మాట్లాడిన ప్రతి వర్డ్ లోనూ మళ్లీ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది……….. !! ఇప్పుడు నేనేం చేయాలి? గాడ్ వాట్ షుడ్ ఐ డు ఒక్కసారి అతను నా జీవితంలోకి రాగానే నా ఎంటైర్ ఫ్యామిలీ ని కోల్పోయాను………. !! నా డ్రీమ్స్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ కాలి బూడిదైపోయాయి & ఇప్పుడు మళ్లీ వచ్చాడు………… !! కానీ ఈసారి నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు ఒక్క నా కొడుకు తప్ప వాడిని కూడా నా నుంచి లాగేసుకుంటాడా………. ?? ఆ ఆలోచన రాగానే నిత్య ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగినా వెంటనే దాన్ని బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ…….. !!
లేదు ….లేదు అలా జరగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను ………. !! అసలు మిస్టేక్ చేసిన అతను అంత పెద్ద క్రైమ్ చేసి కూడా సొసైటీ లో ఒక సక్సెస్ఫుల్ బిసినెస్ మ్యాన్ లా తిరుగుతున్నప్పుడు…….. !! ఏ తప్పూ చేయని నేనెందుకు భయపడాలి? నేనెందుకు పారిపోవాలి? ఐ విల్ ఫేస్ ఇట్ …….. !! అని తనలో తానే అనుకుంటూ బయటకు వచ్చింది నిత్య………. !!