ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన సాంప్రదాయ రిచువల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయ్యాయి……. !!
ఒక్కొక్కటిగా నిశ్చితార్థపు క్రతువులన్నీ పూర్తి కాగా ఆఖరిగా వధూవరులు ఉంగరాలు మార్చుకునే ఘట్టం మొదలైంది………. !! శాన్వి అమాయకమైన చూపులతో శౌర్య వేలికి రింగ్ పెడుతూ తన చేయిని శౌర్య అరచేతిలో ఉంచింది……… !! శౌర్య కూడా శాన్వి వేలికి రింగ్ పెట్టిన మరుక్షణమే కావాలనే శాన్వి చేతిని విడిపించుకోలేనంత టైట్‌గా పట్టుకుని తన కోపాన్ని ఆ స్పర్శలోనే వ్యక్తపరిచాడు………..!! ఎంతగా అంటే ఆ పట్టులోని కోపానికి ఆమె చేతి గాజులు సవ్వడి చేసేంతగా అతని ఆక్రోశం ఆమె గుండెల్లో భయాన్ని రేపేంతగా………. !! తన చేతిని విడిపించుకోవడానికి శాన్వి ట్రై చేస్తున్న కొద్దీ శౌర్య తన పట్టు క్షణక్షణానికి మరింత పెంచుతుంటాడు…….. !!
ఆ పెయిన్ భరించలేక మొదటిసారి తల పైకి ఎత్తి అతని ఫేస్ వైపు చూసింది శాన్వి……… !! దవడ బిగించి కళ్లతోనే నిప్పులు కురిపిస్తున్నట్టుగా తననే చూస్తున్న శౌర్య ఫేస్ చూసి శాన్వి కళ్లలో కన్నీళ్లు సుడులు తిరిగాయి……….. !!
ఆమె కళ్లలో నీళ్లు చూసిన శౌర్యకు మాత్రం సైడ్ స్మైల్ ఇస్తూ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు……… !!