పెళ్లయి వారం రోజులు అవుతున్నా శౌర్య కోపం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు……….!! అతని ముందుకు వెళ్లి తిట్లు తినడం ఇష్టం లేని శాన్వి వీలైనంత వరకు శౌర్య కి డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చింది……… !! శౌర్య ఇంట్లోనే ఆఫీస్ రన్ చేస్తూ ఉండడం తో అతని దగ్గర ప్రాక్టీస్‌కి వచ్చే నలుగురు జూనియర్ బాయ్స్‌కి ………. !! అలాగే కేసులు ఇవ్వడానికి వచ్చే క్లయింట్లకు సౌర్య అడిగిన ప్రతీ సారి కాఫీ, బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉండేది శాన్వి………… !;ఇంతకుముందు ఈ పనులన్నీ సురేష్ చూసుకునేవాడు……….. !! కానీ శాన్విని ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు ఈవినింగ్ టైమ్ లో
ఇకపై నా ఆఫీస్‌కి నా వైఫ్ మాత్రమే కాఫీ తీసుకుని రావాలి………… !! తనను నా వైఫ్ అని అందరికీ నేను ప్రౌడ్‌గా పరిచయం చేయాలి అని వెటకారంగా చెప్తాడు శౌర్య……….. !! అతని మాటల్లో ఉన్న వెటకారం శాన్వికి తప్ప అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు………. !!!
అతను చెప్పినట్లే రోజూ ఈవినింగ్ కాగానే ఆఫీస్ రూమ్ నుంచి బెల్ సౌండ్ వినపడగానే శాన్వి కాఫీ ట్రే పట్టుకుని అక్కడికి వెళ్లేది………… !!