ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి? – 110
సాక్షితో హ్యాండ్‌షేక్ చేసి వెళ్లిన తన చేతిని ముద్దు పెట్టుకుని, ఆమె స్పర్శను ఆస్వాదిస్తున్న క్లయింట్ జోసెఫ్‌ని చూసిన తారక్… అతనికి బాగా కొట్టి తన రాక్షసత్వాన్ని చూపించాడు. అదే సమయంలో సాక్షిపై తనకున్న పిచ్చి ప్రేమ కూడా బయటపడింది.
“ఇదే చేతితో కదా ఆమె హ్యాండ్‌షేక్ చేసింది… అలాంటప్పుడు ఈ చెయ్యి ఉంటే ఎంత? లేకపోతే ఎంత? ఆమె ఒక్కో స్పర్శ నాకు మాత్రమే సొంతం. ఎవరైనా ఆమెను తాకడానికి ప్రయత్నిస్తే… వాళ్ల చేతులు కూడా ఇలాగే అవుతాయి.”
అంటూ జోసెఫ్ చేతిని విరిచేశాడు.
జోసెఫ్‌కి చావు ఇంటి గడప వరకు వెళ్లి వచ్చినట్టయింది. అప్పటికే సగం ప్రాణాలతో ఉన్న అతను గట్టిగా కేకలు వేస్తూ ఉండగా, తారక్ ఈ విధంగా పిచ్చిగా ప్రవర్తించడం చూసి చివరికి స్పృహ తప్పి పడిపోయాడు.
ఎవరో ఒకరు సాక్షి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విషయం చెప్పడంతో, అలసిపోయి ఉన్నా సాక్షి వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చింది.
తారక్ ఆ విధంగా రాక్షసుడిలా ప్రవర్తించడం చూసి ఆమె భయపడిపోయింది. మొదటి నుంచీ చాలా సున్నితమైన మనసున్న సాక్షి… ఇలాంటి దృశ్యం చూడటంతో భయంతో వణికిపోతూ నిలబడింది.
“మేడమ్… వెళ్లి సార్‌ని ఆపండి. లేకపోతే ఆ క్లయింట్‌ని చంపేసేలా ఉన్నారు. వెళ్లండి మేడమ్… సార్‌ని ఆపండి!”
అంటూ ఆఫీసులోని కొంతమంది ఉద్యోగులు చెప్పడంతో, సాక్షి వణుకుతూనే…
తారక్ దగ్గరకు వెళ్లిన సాక్షి అతని చెయ్యి పట్టుకుంది.