New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
డార్క్🖤రొమాన్స్ -1 – 1

డార్క్🖤రొమాన్స్ -1 – 1

అది ఒక బ్లాక్ రోజ్ ఎస్టేట్. ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామాల్లో వణుకు పుడుతుంది……..
కాలేజీ క్యాంపస్‌లోని అందమైన పాత భవనం కాదు అది. అది పదుల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక కోట వంటి ఎస్టేట్. దాని గేట్లు చాలా కాలంగా తెరుచుకోలేదు……..
ఆ ఎస్టేట్ చుట్టూ. ఎవరికీ అంతుచిక్కని, రహస్యాలతో కూడిన భయానకమైన దట్ట మైన అడవి చుట్టుముట్టి ఉంది……..
ఆ ఎస్టేట్‌లోని కోట ఎంతో ఎత్తుగా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ కోట గోడలన్నీ చాలా కాలంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పాచిపట్టిపోయి ఉన్నాయి……..
 అంతేకాకుండా, అక్కడ ఉన్న లెక్కలేనన్ని సమాధులు ఆ ప్రదేశం వెనుక ఎంతో పెద్ద,  విషాదకరమైన చరిత్ర  ఉందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి……..
అసలు ఆ అడవిలోకి వెళ్లాలంటేనే ఎవరికైనా భయంగా ఉంటుంది…….
ఒక రోజు ​ కీర్తి, ఆ భయానకమైన ఎస్టేట్‌లో 
 ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంది…….
​నిజానికి కీర్తికి ఆ ప్రదేశానికి రావాలనే ఆసక్తి   ఏమాత్రం లేదు. అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఆమెకు లోలోపల భయంగా ఉంది…..
అయినా ఆమె కాలేజీ ప్రొఫెసర్ ఆమె ని బలవంతం చేయడం వల్లే ఆమె అక్కడకు వెళ్లాల్సి వచ్చింది……. 
ఆ ప్రొఫెసర్ కీర్తితో,  నీ పెయింటింగ్స్‌లో ఎవరికీ అంతుచిక్కని ఒక బాధ, ఒక రహస్యమైన నిగూఢత కనిపిస్తున్నాయి…..
అవి ఎక్కడి నుండి వస్తున్నాయో నీకే తెలియదు కానీ, ఒక నిజమైన ఆర్టిస్ట్‌కు ఇది చాలా గొప్ప వరం,  అని చెప్పి ఆమెను ప్రోత్సహించి అక్కడికి పంపిస్తాడు…….
తన ప్రొఫెసర్, ఇది నీకొక వరం,  అని చెప్పిన ఆ ప్రత్యేకమైన  అనుభూతే, కీర్తిని నడిపించుకుంటూ సరిగ్గా ఆ భయానక ఎస్టేట్ వద్దకు చేరుకునేలా చేసింది…….
కీర్తి  అక్కడికి  వెళ్లిన తరువాత ఆ ఎస్టేట్ ప్రధాన ద్వారం దగ్గర నిలబడి ఉండేసరికి అక్కడ వీస్తున్న గాలిలో వర్షానికి తడిచిన మట్టి వాసన, ఎండిపోయి కుళ్ళిపోయు ఉన్న పూల వాసన,  కాలిపోతున్న కొవ్వొత్తుల పొగ వాసన కలిసిపోయి ఒక వింతైన,  వాసన  ఆమె ముక్కుపుటాలను తాకింది…….
ఆ ఎస్టేట్ దగ్గర ఉన్న వింతైన, భయానకమైన వాతావరణం చూసి కీర్తికి కొంచెం భయం వేసినప్పటికీ, ఆమె మనసులోని ఆర్టిస్ట్,   దాన్ని మరో కోణంలో ఆలోచించింది……
తను వేయాలనుకునే పెయింటింగ్స్‌లో ఏయే రంగులు, ఎలాంటి భావాలు ఉండాలని కోరుకుందో, సరిగ్గా అలాంటి అనుభూతినే ఆ వాసన, ఆ ప్రదేశం ఆమెకు తెలియజేస్తున్నాయి…….
ఎవరో వచ్చి ఆ ఎస్టేట్  గేటు తలుపులు తెరిచినట్టు, వాటంతట అవే మెల్లగా తెరుచుకున్నాయి……..
ఇక ఆమె ఆ ఎస్టేట్ లోపలికి అడుగు పెట్టగానే. ఎవరూ సరిగ్గా పట్టించుకోకుండా, చెట్లు చేమలు అస్తవ్యస్తంగా, గందరగోళంగా పెరిగిన ఒక తోటలా కనిపిస్తుంది…….
అక్కడ ఉన్న గులాబీ తీగలు ఎండిపోయి పెళుసుగా ఉన్నాయి. కీర్తి నడుస్తున్నప్పుడు ఆ తీగలు ఆమె కాళ్ళకు, వాటి ముళ్ళు ఆమె వేసుకున్న బూట్లకు అడ్డంకిగా చుట్టుకుపోతున్నాయి……..
ఆ గులాబీలు సాధారణ ఎరుపు రంగులో కాకుండా, రక్తం కారుతున్నట్లుగా ఎరుపెక్కి చాలా భయానకంగా కనిపిస్తున్నాయి…….
ఆ ముదురు ఎరుపు రంగు గులాబీల నుండి వెలువడుతున్న వాసన చాలా వింతగా ఉండి, మనుషులను మైమరిపించేలా  మత్తులోకి దించేలా బలమైన సువాసనను వెదజల్లుతోంది……..
కీర్తి ఆ భయానక ఎస్టేట్‌లోకి అడుగుపెట్టి ముందుకు వెళ్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న సమయంలో అలసట తో క్షణపాటు తన కళ్ళు మూసుకుంటుంది………
అలా కళ్ళు మూసుకున్న క్షణంలో, ఆమె కళ్ళ ముందు ఎవరో ఒకరి రూపురేఖలు సరిగ్గా కనిపించని,  ఒక ఆకారం, ఎంతో బాధతో కూడిన  ఒక ముఖం మెరుపులా వచ్చి వెళ్తుంది……..
ఆ ముఖం ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో కీర్తికి అసలు తెలియదు. ఆ ముఖం  ఎల్లప్పుడూ తన వెంటే ఉంటూ తనను అనుసరిస్తున్నట్లు   భ్రమ కలుగుతూ ఉంటుంది.ఆమెకి………
అయితే ముఖ్య ద్వారం దగ్గర ఉన్న ఒక భారీ తలుపుపై ఉన్న సింహం తల ఆకారంలో ఉన్న దానిని పట్టుకుని ఆమె మూడు సార్లు గట్టిగా తలుపును బాదుతుంది…….
ఆ తలుపులు కొట్టిన శబ్దం పెద్దగా వినిపించింది.ఆ చుట్టూ ఉన్న నిశ్శబ్ద వాతావరణం వల్ల, ఆ శబ్దం పెద్దగా, ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఆ ప్రాంతమంతా వినిపించింది…….
ఆ తరువాత తలుపు వాటంతట అవే మెల్లగా లోపలి వైపుకు తెరుచుకున్నాయి……
ఆమె ఆ ఎస్టేట్ లోపలికి అడుగుపెట్టగానే ఆ వాతావరణం పూర్తిగా మారిపోయి ఉంది. బయట ఎంత ఎండ ఉన్నప్పటికీ, లోపలికి మాత్రం సూర్యరశ్మి అస్సలు ప్రవేశించదు. లోపల గది అంతా దట్టమైన చీకటిగా, భరించలేనంత చల్లగా ఉంది………
చుట్టూ చీకటిగా ఉన్నప్పటికీ, గది నిండా ఎక్కడ చూసినా లెక్కలేనన్ని కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. వాటి కాంతితోనే ఆ గది అంతా ప్రకాశిస్తోంది…….
కీర్తి భయపడుతూనే గదిలోకి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఆ పెద్ద భవనంలో ఎంత నిశ్శబ్దం ఉందంటే, కేవలం ఆమె నడుస్తున్నప్పుడు వచ్చే అడుగుల చప్పుడు మాత్రమే స్పష్టంగా వినిపిస్తోంది……
@@@@@@@@@@@
కీర్తి ఎదురుచూస్తున్న ఆ రహస్య వ్యక్తి  స్పందిస్తాడు? ఆమెలోని శక్తులు ఎలా బయటపడతాయి? 
అని తెలుసుకోవాలంటే తదుపరి భాగం కోసం వేచి చూడండి….
ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఈ చీకటి ప్రపంచంలో కీర్తి ప్రయాణం మీకు ఎలా అనిపించింది? 
మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి! అలాగే ఈ కథ మీకు నచ్చితే మీ విలువైన ⭐ రేటింగ్స్ ఇచ్చి మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ప్రొఫైల్ ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. 🙏
మీ అందరి కామెంట్సే నాకు తర్వాతి ఎపిసోడ్ రాయడానికి ఎంతో శక్తినిస్తాయి. త్వరలోనే నెక్స్ట్ పార్ట్‌తో మీ ముందుకు వస్తాను… అంతవరకు బాయ్ ఫ్రెండ్స్…
మీ..భార్గవి…✍️