నేనేమో తల కూడా పైకి ఎత్తకుండా అలాగే ఉన్నాను ఎక్కడ అంకుల్ కళ్ళల్లోకి చూస్తే నా కళ్ళల్లో కృష్ణమ్మ బయటికి వచ్చేస్తుందో అనుకుంటూ.
ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాను అలాగే నేను చిన్న చోటే ఉండిపోతే తెచ్చినట్టు బజ్జీలు చల్లారిపోతాయి అని మైండ్ చెప్పేసరికి ఐశ్వర్య కాదు ఐషు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు నా తప్పేం లేదు అని చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి తప్పించుకొని తిరగడం కంటే ఒక మాట అనిపించుకుంటే పోయేదేముందిలే అని ధైర్యం చెప్పుకుంటూ అంకుల్ నిజంగా క్షమించండి నా వల్లే ఇలా జరిగింది అని నేను అంటూ ఉంటే ఐశ్వర్యం అక్కడ మనిద్దరమే ఉన్నాము ఏం జరిగిందో ఇద్దరికీ తెలుసు ఎందుకు మొత్తం నీ మీద చేసుకుంటావు అని చెప్తూ ఏమండీ నేను ఫోన్లో చెప్పాను కదా అసలు ఈ అమ్మాయి తప్పులేదు నాకే ఆ కోనేరు బాగా నచ్చి చూసుకోకుండా ఒక మెట్టు మీద కాలు వేసి కిందకి జారాను దానిమీద పాచి ఉండటం వల్ల దానికి ఏదో మీరందరూ ఈ అమ్మాయిని అంటున్నారు అంతే తప్ప తన తప్పులేదు అని ఆంటీ చెప్పేసరికి నాకైతే,
హమ్మయ్య అన్న ఫీల్ వచ్చింది ఇంట్లో ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఆంటీ నన్ను నమ్మారు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను కానీ ఆవిడని నేను ఎందుకు తోసేస్తాను నాకు ఆవిడకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేదంటే టార్చర్ చేసే అత్తగార నాకు ఏమవుతారని ఆవిడ మీద కక్ష తీర్చుకోడానికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాను అని అనుకుంటూ,
ఉంటే నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు ఐషు అన్నారు అంకుల్ వామ్మో ఈ అంకుల్ వాయిస్ ఏంటి కమాండంగా ఉన్న కూడా నాకు స్మూత్ గా అనిపిస్తుంది అని అనుకుంటూ చిన్నప్పటినుండి గుండెనక్కలం మధ్య పెరిగిన నేను ఇలా జింగ పిల్లలాగా అమాయకంగా ఉండడం తప్పితే ఇంకేం చేస్తాను అని మనసులో అనుకుంటూ నువ్వు చేయదానికి అందరితో ఎందుకు మాటలు పడతావు ధైర్యంగా చెప్పొచ్చు కదా ఐషు అని అంకుల్ అనేసరికి చెప్పిన ఇంట్లో వాళ్ళు నమ్మరు లెండి అంది మధుర ఆంటీ.
సరే ఆంటీ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి మీరు ఫాస్ట్ గా కోరుకుంటే నాకు అదే చాలు మీకోసం తీసుకొచ్చాను తాగండి అంటూ ఆంటీకి దగ్గరగా ఇచ్చి అంకుల్ పక్కన పెట్టేస్తుంటే అప్పుడే ఆయనకి ఫోన్ వచ్చింది ఆంటీ ఇంకొక ఎక్స్ట్రా గ్లాస్ టీ కూడా మిగలడంతో నన్ను అక్కడే కూర్చొని తాగమని చెప్పింది.
ఆవిడ మాటని అలా కాదనలేక సరే ఆంటీ అని కూర్చొని టీచ్ చేస్తూ ఉంటే అంకుల్ గారికి కాల్ వచ్చింది హలో చెప్పు నాన్న సాయంత్రం నువ్వు దిగగానే నాకు కాల్ చేయి వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పేసరికి నేను ఫిక్స్ అయిపోయాను ఈసారి కన్ఫామ్ గా వచ్చేది ఆ రుద్రనే ఆంటీ అంకుల్ అర్థం చేసుకున్నారు కూతురేమో మొదటి నుండి అపార్థం చేసుకుంది ఇప్పుడు వచ్చే ఆ మహానుభావుడు ఎలాంటోడు అనుకుంటూ టీ తాగుతూ ఆంటీకి కబుర్లు చెబుతూ టైంపాస్ చేశాను నేను.
రుద్ర వస్తే మీ పాప పరిస్థితి ఏంటంటారు??