New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 2

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 2

నో సుమీ !! ఐ డోంట్ వాంట్ లివింగ్ విత్ యూ !! ఐ వాంట్ డివోర్స్ థర్డ్ సెట్ అంటూ వేరొక బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది. 

దీనికి పిచ్చి పట్టింది ఏ కుక్క కరిచిందో ఏమో మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి సెట్ చేయించాలి అని చిరాగ్గా అనుకుంటూ వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాడు సుమిత్ కానీ ఆ దూరం వారి మధ్య తీరని బాధగా మిగిలిపోతుందని ఆ క్షణం వారిద్దరూ ఊహించలేదు. 
ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే మరొకరు  తమ పంతం వదిలి సెట్ అవుతారు కదా అని ఆలోచిస్తూనే ఇద్దరు ఎవరికివారు దూరంగా ఉండిపోయారు అలాగే 10 రోజులు గడిచిపోయాయి చివరికి తనకి దక్కాల్సిన డివోరస్స్ దక్కడం లేదని సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేసి సుమిత్ ని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
బట్ అప్పుడూ కూడా ఒప్పుకోలేదు !! ఆరోజు రాత్రి తీవ్రంగా పరుగు పెడుతున్నాయి అతని ఆలోచనలు మిస్టేక్ ఎక్కడ జరిగింది ఏంటి అని ఆలోచిస్తున్నా అతని మైండ్ కి ఒక చిన్న ఐడియా తట్టి వెంటనే దానిని ఫాలో అవుతాడు.
వెంటనే తనకి తెలిసిన ఫ్రెండ్ ని కన్సల్ట్ చేసి మధుతో అగ్రి చేసినట్లుగా ఫామ్ మీద సైన్ చేసి ఇద్దరూ కలిసి ఆఫీస్ కి వెళ్తారు 
సుమిత్ ప్లాన్ ప్రకారం గా మళ్ళీ త్రీ మంత్స్ కలిసి ఉండటానికి ఒకే ఇంట్లోకి చేరారు… ఈ త్రీ మంత్స్ లో మిస్టేక్ ఏంటో తెలుసుకుని అది రెక్టిఫై చేయాలని సుమిత్ ఐడియా. 
గట్టిగా వినిపించిన హారన్ సౌండ్ కి గత ఆలోచనల నుంచి బయటికి వచ్చిన సుమిత్ తను ట్రాఫిక్ లో ఉన్నాడని గ్రహించి ఫోకస్ డ్రైవింగ్ మీద పెడతాడు.
ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి గానీ ఆఫీస్ ముగించి ఇంటికి స్టార్ట్ అయిన సుమిత్ వర్షం వల్ల మధ్యలో స్ట్రక్ అయి ఫుల్ గా తడిచి ఇంటికి చేరుకుంటాడు. 
సుమిత్ వచ్చేసరికి హాల్లో ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపిస్తుంది మధు… అతను ఫుల్లుగా తడిచి రావడం చూసిన పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటుంటే తీక్షణంగా ఒక్కసారి తన వైపు చూసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
కొద్దిరోజుల క్రితం వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా గడిపిన సీన్ ఒకటి కళ్ళ ముందు ఫ్లాష్ లా కనిపిస్తుంది.
ఒక వర్షం పడుతున్న రాత్రి ఇంట్లో ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ… ఒకే దుప్పటి లో కూర్చొని ఇద్దరు చాలా దగ్గరగా హగ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
” ఏవండీ నాకు ఈ లైఫ్ లో ఇంకేం వద్దు ఈ వర్షం.. ఈ కాఫీ.. మీ కౌగిలింత … ఈ జన్మకి చాలు ” అని ఎంతో ప్రేమగా అంటుంది.
ష్యూర్ డియర్ నువ్వెప్పుడూ నా కౌగిలిలో తడిచి ముద్ద అయ్యేలా నేను చూసుకుంటాగా అని అంటూ ఇంకా ఇంకా బిగి కౌగిలిలో బంధిస్తాడు. 
ఆరోజు ఆ వర్షపు చినుకులు హోరు వారికి ఎంతో ప్రశాంతత ఉల్లాసాన్ని కలిగిస్తే ఇప్పుడు ఇదే వర్షపు చినుకుల హోరు నిశాబ్దాన్ని భయంకరాన్ని కలిగిస్తుంది. 
అంత ప్రేమగా ఉన్న అమ్మాయి ఒక్క వారం రోజుల్లో ఇలా ఎలా మారిపోయింది అంతుచిక్కడం లేదు. 
ఆ రాత్రి వాళ్ళిద్దరూ తెంచుకుని వచ్చింది బంధాన్ని మాత్రమే కాదు… తమ ప్రాణాల్లోంచి సగాన్ని.
గదిలో మంచం మీద కూర్చున్నాడు… లైటు కూడా వేయలేదు. 
కిటికీలోంచి పడుతున్న వీధి దీపం వెలుతురులో, గోడ మీద వేలాడుతున్న వాళ్ళ పెళ్లి ఫోటో సగం స్పష్టంగా, సగం నీడలా కనిపిస్తోంది.
సుమిత్ చేతులు తన మొహాన్ని కప్పుకున్నాయి. ఏడవడం అతనికి అలవాటు లేదు… కానీ ఈ రోజు కళ్ళు తడిసిపోతున్నాయి.
“నేను గెలిచానా? నా భార్య గెలిచిందా ? ” అని తనని తాను ప్రశ్నించుకున్నాడు…. ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. 
ప్రతి రోజూ రాత్రి “రేపటికి ఏ కర్రీ చేయమంటావు?” అని అడిగే గొంతు ఇకపై వినిపించదనే నిజం అతన్ని ఉక్కిరిబిరి చేస్తోంది.
ఆమె బాటిల్‌ మూత తిప్పలేక తనకిచ్చే చిన్న చిన్న పనులు, తను వర్క్‌లో ఉంటే కాఫీ తెచ్చి పక్కన పెట్టే క్షణాలు… ఒకటా రెండా? ఇల్లు నిండా ఆమె జ్ఞాపకాలే. 
అతనికి గాలి ఆడనట్లు అనిపించి, చేతిలో ఉన్న వాచ్ తీసి పక్కన పెట్టాడు.
ఆ వాచ్ ఆమె తన మొదటి జీతంతో కొనిచ్చింది. దాన్ని పదే పదే రుద్దుతూ, “నిజంగానే నిన్ను కోల్పోతున్నానా మధు ??” అని మనసులోనే అరుచుకున్నాడు.
అటు పక్క గదిలో…మధు అద్దం ముందు నిలబడి ఉంది. 
కళ్ళలోంచి కన్నీళ్లు ధారగా కారుతుంటే, దాన్ని తుడవడానికి కూడా ఆమెకి చేతులు రావడం లేదు… చేతికున్న తాళి బొట్టును పట్టుకుని కిందకి కూలబడింది. 
ఇంతకు ముందు తను మాట్లాడిన మాటలు అన్నీ ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి.
“మేము కలిసి ఉండలేం” అని కోర్టులో చెప్పినప్పుడు సుమిత్ కళ్ళలోకి చూసింది. 
ఆ కళ్ళలో కోపం లేదు, కేవలం ఓటమి, వేదన మాత్రమే ఉన్నాయి. 
స్టోరీ కంటిన్యూస్…