New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ నవ్వు కోసం 💞 – 2

నీ నవ్వు కోసం 💞 – 2

ఇద్దరూ కలిసి కాఫీ తాగడం, సరదాగా షాపింగ్‌కి వెళ్లడం, ఒకరికొకరు ఎదురుచూసుకోవడం రోజూ జరుగుతూనే ఉంటుంది.. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు… అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ రోజురోజుకీ మరింత పెరుగుతూ ఉంటుంది….

ఒకరోజు లక్ష్, మీనాక్షిని దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌కి రమ్మని పిలుస్తాడు. మీనాక్షి కూడా పావుగంటలో కేఫ్ దగ్గరికి వచ్చేస్తుంది… “ఎందుకు రమ్మన్నారు లక్ష్ గారు?” అని అడుగుతుంది….
“నీతో మాట్లాడాలి మీన…” అని అంటూనే తన చేతికి ఒక చిన్న రింగ్ తొడుగుతాడు లక్ష్…. “నన్ను నువ్వు ఎప్పటికీ మిస్ అవ్వకూడదు…” అని చెబుతాడు….
ఆ మాటకి మీనాక్షి చిన్నగా నవ్వుతూ, “నాకు వంటలో ఒక కాఫీ చేయడం మాత్రమే తెలుసు… ఇంకేమీ రాదు…” అని చెబుతుంది…. అది విన్న లక్ష్ నవ్వుతూ, “సరే పర్లేదులే… ఇద్దరం కలిసి వంట నేర్చుకుందాం… డైలీ కలిసి వంట చేసుకుందాం…” అని అంటాడు….
అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది…. నిశ్చితార్థం తర్వాత లక్ష్, మీనాక్షి ఇద్దరూ కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని అనుకుంటారు….
ఒకరోజు ఆఫీస్‌లో ప్రాజెక్ట్ విషయంలో పైన హెడ్ ఆఫీస్ నుంచి మేనేజర్‌కి కాల్ వస్తుంది…. ఆ కాల్ చేసినది ప్రియా… ప్రియా లక్ష్‌కి కాలేజీ ఫ్రెండ్….
లక్ష్, ప్రియా కాలేజీ రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్ కావడంతో ఆఫీస్‌లో కూడా ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు…. అది ఒకరోజు మీనాక్షి చూస్తుంది….
లక్ష్ ప్రియాతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడని చూసిన మీనాక్షి ఏమీ అనకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది…. ఆ రోజు నుంచి తనలో తానే సైలెంట్‌గా ఉండటం అలవాటైపోతుంది…. కోపం కాదు… ఏదో తెలియని బాధ, భయం….
ఒకరోజు ప్రియా లక్ష్ పక్కన నిలబడి నవ్వుతూ, “నువ్వు ఇంకా కాలేజీ రోజుల్లో ఎలా ఉన్నావో అలానే ఉన్నావు…” అని అంటుంది….
ఆ మాట విన్న మీనాక్షి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది…. అక్కడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయి టెర్రస్‌పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది….
అప్పుడే అక్కడికి లక్ష్ వచ్చి, “ఏం ఆలోచిస్తున్నావు నువ్వు?” అని అడుగుతాడు….
మీనాక్షి కొద్దిసేపు మౌనంగా ఉండి, “నువ్వు ఎక్కువగా ప్రియాతో బిజీగా ఉన్నావు… నాతో మాట్లాడడానికి కూడా టైమ్ లేదుగా…” అని నిదానంగా చెబుతుంది….
అది విన్న లక్ష్ చిన్నగా నవ్వుతూ, “అవును… నేను చాలా బిజీగా ఉన్నాను. కానీ అది పని కోసం మాత్రమే… ప్రియా నాకు కాలేజీ ఫ్రెండ్… అంతే. అంతకుమించి నాకు తనకి ఏమీ లేదు…” అని చెబుతాడు….
తర్వాత ఆమె వైపు చూస్తూ, “ఏంటి… నువ్వు దేనికైనా భయపడుతున్నావా?” అని అడుగుతాడు….
“నువ్వు తనకి దగ్గరయ్యావేమోనని భయం వేసింది…” అని మీనాక్షి కళ్లలో నీళ్లతో చెబుతుంది….
అది విన్న లక్ష్ ఆమె దగ్గరికి వెళ్లి, “నా హృదయంలో స్థానం ఎప్పటికీ నీకే… నా హృదయ రాణివి నువ్వే…” అని చెబుతాడు….
ఆ మాటలు విన్న వెంటనే మీనాక్షి నవ్వుతుంది….
“హమ్మయ్య… నవ్వావు కదా… అది చాలు నాకు…” అని లక్ష్ కూడా నవ్వుతూ ఆమెతో కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు….
అలా లక్ష్ ఇచ్చిన క్లారిటీతో మీనాక్షి ప్రశాంతంగా నిద్రపోతుంది….
నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్లిన మీనాక్షి ప్రియాను కలుస్తుంది…. అప్పుడు ప్రియా, “లక్ష్ నాకు ఫ్రెండ్ మాత్రమే… నువ్వు ఏమీ అపార్థం చేసుకోవద్దు…” అని చెబుతుంది….
అది విన్న మీనాక్షి మనసు ప్రశాంతంగా మారుతుంది…. అంతలోనే లక్ష్ అక్కడికి వచ్చి మీనాక్షి చేయి పట్టుకుంటాడు…. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు….
అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి….
కొన్ని రోజుల తర్వాత మీనాక్షి పుట్టినరోజు వస్తుంది…. అదేరోజు ఆఫీస్‌లో కొత్తగా ఫ్రెషర్స్ జాయిన్ అవ్వడంతో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి….
కానీ మీనాక్షి డోర్ తీసి లోపలికి అడుగు పెట్టగానే… అలంకరించిన హాల్ మధ్యలో లక్ష్ కనిపిస్తాడు….
మీనాక్షి వైపు చూస్తూ, “నా లైఫ్‌లో నిన్ను మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు… నువ్వు నేను వేరు కాదు… ఇద్దరం ఒకటే…” అని చెబుతూ మోకాళ్లపై కూర్చుంటాడు….
తర్వాత మీనాక్షి చేతిని పట్టుకుని మరోసారి రింగ్ తొడుగుతాడు….
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే… ఇది రెండోసారి రింగ్ తొడగడం…. మొదటిసారి తన ప్రేమను మీనాక్షికి తెలియజేస్తూ రింగ్ తొడిగిన లక్ష్… ఇప్పుడు అందరి ముందు మరోసారి రింగ్ తొడిగి, ఆమె తన జీవితంలో ఎంత ప్రత్యేకమో తెలియజేస్తాడు….
అది చూసిన మీనాక్షి కళ్లల్లో ఆనందం నిండిపోతుంది…. వెంటనే లక్ష్‌ని హగ్ చేసుకుంటుంది…. లక్ష్ కూడా ఆమెను హగ్ చేసుకుంటాడు….
వాళ్లిద్దరి ఆనందాన్ని చూసిన ఆఫీస్ స్టాఫ్ అందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు….
అలా ఆరోజు మీనాక్షి పుట్టినరోజును స్టాఫ్ అందరి మధ్య చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు…. ఇలాంటి సర్‌ప్రైజ్ లక్ష్ ఇస్తాడని మీనాక్షి అసలు ఊహించుకోదు….
నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి బంగారాలు…. 🥰🥰
ది స్టోరీని మాత్రమే స్టోరీలాగా చూడండి…. రియల్ లైఫ్‌కి సంబంధించినది కాదు…. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు.. 🥰🥰
మీ Chinni ❤️