మగువ మనసు 🔥 – 1
భూమి….. ఏయ్ భూమి ఎక్కడ చచ్చావే……
వస్తున్న పిన్ని…..
ఏం చేస్తున్నావ్ ఇప్పటివరకు…..
అదే పిన్ని వంట గది లో ఉన్నాను…
నేను లేచిన వెంటనే నాకు టీ ఇవ్వాలి అని తెలియదా…..అని అరుస్తూ ఉంటుంది….ఆరాధ్య సవితి తల్లి దమయంతి…..
తెస్తున్న పిన్ని అని టీ పట్టుకువెళ్ళడానికి కిచెన్ లో కి వెళ్తుంది….
కిచెన్ లో ఉన్న పనిమనిషి సరస్వతి బాధగా ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి మీ అమ్మే బ్రతికి ఉంటే నిన్ను మహారాణి లా చూసుకునేవారు…..
వదిలేయ్ సరసు నాకు ఈ జీవితం అలవాటు అయిపోయింది…
మీ నాన్నగారు కూడా వాళ్ళతో కలిసి మమ్మల్ని ఏడిపించడం బాలేదు అమ్మ…..
టీ పెట్టేది ఒక్క క్షణం ఆగిపోయి సరసు వైపు చూసి విరక్తి గా నవ్వుతూ నా జీవితం అంతే అన్నా కదా సరసు…నా తండ్రి కి నేను లావుగా ఉన్నాను అని నచ్చను….నా పిన్ని కి నేను సవితి కూతుర్ని అని నచ్చను….నా చెల్లి కి నేను తన కంటే బాగా చదువుతాను అని నచ్చను….చూసావా నేను ఎవరికి నచ్చని ఒక వెస్ట్ పేపర్ నీ ….అని బాధ గా అంటుంది….
ఊరుకో భూమి తల్లి….నువ్వు ఎవరికి నచ్చకపోయినా నిన్ను కోరుకునే వాడు నీ జీవితం లోకి కచ్చితంగా వస్తాడు….
ఊరుకో సరసు నా మొహానికి పెళ్లి కూడా నా….వాడు కూడా నన్ను చూసి పారిపోతాడు ఏమో…
చూడు భూమి నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది…. అయినా ఇది తిన్న ఒళ్ళు కాదు తల్లి….అసలు నువ్వు తింటున్న తిండికి నీ ఒంటికి సంభంధమే లేదు….
నీ శరీరం అంతే….తినకపోయినా అలాగే ఉంటావు…
ఒసేయ్ ఎంత సేపు అని అరుస్తుంది దమయంతి….
వస్తున్న పిన్ని అని కంగారుగా దమయంతి దగ్గర కి వెళ్ళి టీ ఇస్తుంది….
ఎంతసేపే టీ తీసుకురావడానికి అని చెంప పై కొడుతుంది…..
పిన్ని అని కన్నీళ్ళతో పిలుస్తుంది…..
పో నీ భారీ కాయాన్ని పొద్దున్నే చూపించకుండా పో…..
తనకి ఆ మాటలన్నీ అలవాటే అన్నట్టు సరే పిన్ని అని తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోతుంది…..
అన్నట్టు బేబీ కి లేపి బెడ్ కాఫీ కలిపి ఇవ్వు….
సరే అని వస్తుంది….మల్లి కాఫీ కలిపి తన చెల్లి అయిన రీతిక రూమ్ లో కి వెళ్తుంది….
గీతిక….. గీతిక….
హేయ్ ఎందుకు మార్నింగ్ మార్నింగ్ నే వెధవ మొహం వేసుకుని వస్తావు…..పో ఇక్కడ నుండి….
అది కాదు కాఫీ ఇవ్వమంది పిన్ని….
అక్కడ పెట్టు….వెళ్ళు నిన్ను చూస్తేనే వికారం వస్తుంది నాకు…..
భూమి పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టీ బయటికి వెళ్ళిపోతుంది….
అప్పుడే అక్కడికి తన తండ్రి కేశవరావు వస్తాడు….
అతని నీ చూసి పక్కకు వెళ్ళిపోతుంది……
అతను తన గదికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తుంది….
అతను గీతిక రూమ్ లో కి వెళ్ళి బేబీ ఇంకా లేవలేదా…..
వస్తున్న డాడ్ అని లేచి వెళ్ళి ఏంటి డాడీ….
ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ కదా ప్రిపేర్ అవ్వాలి కదా….
హా డాడీ అవ్వాను లే…..
సరే ఈసారి అన్న ఆ దరిద్రపు దాని కన్నా నువ్వే ఫస్ట్ రావాలి…..
కచ్చితంగా డాడీ….
నా బంగారం వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలేజ్ కి వెళ్ళు….
సరే డాడీ అని హ్యాపీ గా వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది….
అదంతా వింటున్న భూమి కళ్ళలో నీళ్ళు….
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
చుట్టూ జనాలు అరుపులు కేకల మద్యలో ఒక రాక్ స్టార్ తన ఫర్ఫామెన్స్ నీ ఇస్తున్నాడు…..
అతను పాడే పాటను ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫేవరేట్ రాక్ స్టార్ నీ వాళ్ళ అరుపులతో ఇంకా ఉత్సాహాన్ని ఇస్తున్నారు…..
వాళ్ళని చూస్తూ తన పాటని మరింత హుషారుగా పడుతూ తను డాన్స్ చేస్తూ వాళ్ళను కూడా డాన్స్ చేసేలా చేస్తాడు తన మ్యూజిక్ తో….
పాట ముగిసిన తర్వాత అందరూ క్రిష్….క్రిష్ అని అరుస్తూ
ఉంటారు….
వాళ్లలో అమ్మాయిలు తన టచ్ దొరికితే చాలు అనుకునేవారు కొందరు అయితే తనని ఎలాగైనా డేట్ కి రమ్మనాలి అని కొందరు….కొందరు తమ ఫేవరేట్ రాక్స్టార్ ఆటోగ్రాఫ్ కావాలి అని కొందరు….చాలా ప్రయత్నాలు చేస్తున్నారు…..
కానీ వాళ్ళు ఎవరికి దొరకకుండా వెనుక నుండి తీసుకుని వెళ్ళిపోతాడు అతని ఫ్రెండ్ విజయ్…..
రేయ్ రక్షించావు రా బాబు…..అనుకుంటూ విజయ్ భుజం చుట్టు చెయ్యి వేస్తూ అంటాడు….
ఏమి జనం రా బాబు…. ఏదో అమ్మాయి పై న పడిపోయినట్టు పడిపోతున్నారు….చ అబ్బాయిలకి రక్షణ లేకుండా పోయింది….అందులో అమ్మాయిలే ఎక్కువ మంది. రా బాబు….అని అంటాడు విజయ్….
మరి ఏం అనుకున్నావు ఈ క్రిష్ అంటే….
సరే కానీ పద అంకుల్ ఎప్పటికీ.. టు టైమ్స్ కాల్ చేశారు….
అవునా పద పద… ఇంత ఆలస్యంగా నా చెప్పేది పద….అని ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు…..
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది భూమి…..
అమ్మ ఇదిగో లంచ్ బాక్స్…..అని సరస్వతి భూమి కాలేజ్ బ్యాగ్ లో పెట్టేస్తుంది…..
పిన్ని చూసింది అంటే గొడవ చేస్తుంది సరసు….
చూడకుండా నేను చూసాను లే….అయిన. ఏంటో నీ ఇంట్లో తిండి తినడానికి కూడా లేదు….అని బాధ గా అంటుంది సరస్వతి….
నాకు ఇవన్నీ అలవాటే లే….కానీ నువ్వు బాధపడకు ఈరోజు నుండి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి…. ఇందులో నాకు మంచి మార్క్స్ వస్తె నాకు మంచి జాబ్ వస్తుంది….
అప్పుడు మనిద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోయి మనం హ్యాపీ గా ఉందాము….
అలాగే తల్లి ఇక్కడ నుండి బయటపడితే నరకం నుండి బయట పడినట్టే….
సరే నన్ను ఆశీర్వదించు…..అని సరస్వతి కాళ్ళకి నమస్కారం పెడుతుంది….
అయ్యో లెగు తల్లి….నీకు అంతా మంచే జరుగుతుంది….
అని భూమి పై కి లేపి…నుదుటిన ముద్దు పెడుతుంది….
భూమి నవ్వుతూ మా అమ్మ చనిపోలేదు సరసు నీ రూపం లో నన్ను పలకరిస్తూనే ఉంటుంది….
నాకు కాలేజ్ కి టైం అవుతుంది సరసు వెళ్ళొస్తాను….
వెళ్ళు తల్లి మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూడరు అంటే నిన్ను వెళ్లకుండా లేని పోని పనులు చెప్తారు….
సరే అని భూమి ఎవరు చూడకుండా బయటికి వచ్చి అక్కడి నుండి నడిచి వెళ్తుంది బడ్ స్టాప్ కి…..
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
హేయ్ గీతిక ఈసారి కూడా మీ అక్క నీ కాలేజ్ టాపర్ అనుకుంటున్నారు….అని గీతిక ఫ్రెండ్ అయిన స్మిత అడుగుతుంది…..
ఏయ్ ఎవరే అక్క ….ఇంకోసారి ఆ బండదాన్ని నాకు అక్క అన్నారు అంటే చంపేస్తాను…
ఎప్పుడు అది టాపర్ అయ్యి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం అది ఎగ్జామ్స్ కూడా రాయలేదు…..
ఏం చేస్తున్నావే…..అని పక్కనే ఉన్న గీతిక ఇంకొక ఫ్రెండ్ అయిన నిషా అడుగుతుంది….
ఏం చేస్తాను చూడండి…..అని కన్నింగ్ గా నవ్వుతుంది….
ఇంకా ఉంది…..
గీతిక ఏం చేయనుంది…..?
భూమి ఎగ్జామ్స్ రాస్తుందా….?లేదా…?
చూడాలి అంటే ఫాలో అయిపోండి మన మగువ మనసు
ఈ స్టోరీ నచ్చితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి నన్ను ఫాలో చేయండి…..అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ కామెంట్స్ యార్….
థాంక్స్ ఫర్ రీడింగ్ 😊
Swipe left/right or tap the sides to turn pages