New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మగువ మనసు 🔥 – 3

మగువ మనసు 🔥 – 3

ఆఫీస్ లో అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు……

ఏమయ్యింది ఈరోజు అందరూ ఇలా తిరుగుతున్నారు….అని ఒక ఎంప్లాయ్ ఇంకో ఎంప్లాయ్ నీ అడుగుతున్నాడు…..
నీకు తెలియదా ఈరోజు మన చైర్మన్ సార్ అబ్బాయి వస్తున్నారు…మన చైర్మెన్ వీరేంద్ర సార్ కంపెనీస్ అన్నిటినీ వాళ్ళ అబ్బాయి కి హ్యాండోవర్ చేస్తున్నారు….
అవునా అతను ఎలా ఉంటారో…..మన చైర్మెన్ సార్ అయితే చాలా మంచివాడు…. ఇంతకీ అతని పేరు ఏంటి….
అతని పేరు “కృష్ణాంశ్ వర్మ”…..
పేరు కూడా కొత్తగా ఉంది….మరి మనిషి ఎలా ఉంటారో చూడాలి అని మాట్లాడుకుంటూ ఉండగా క్రిష్ కార్ ఎంటర్ అవుతుంది….
అందరూ అలెర్ట్ అవుతారు…..
కార్ లో నుండి క్రిష్ బయటికి దిగుతాడు….అంతే అందరూ ఆశ్చర్యంగా క్రిష్ అని అరుస్తారు ఆడపిల్లలు అందరూ….
మేనేజర్ వచ్చి అందరు నోర్లు ముయ్యండి….ఎవరు క్రిష్ సార్ దగ్గర కి వెళ్ళి నా సరే వాళ్ళని జాబ్ లో నుండి తీసేయమ్మనారు చైర్మెన్ సార్….
అంతే అందరూ సైలెంట్ అయిపోయారు….
చూడండి….అతను ఇప్పుడు మన చైర్మెన్ సార్ అబ్బాయి…. అంత వరకు మాత్రమే….ఎవరైనా వెళ్ళి అతనితో మాట్లాడాలి అని చూసినా ఆటోగ్రాఫ్ అడిగినా సరే వాళ్ళ జాబ్ పోతుంది అని వార్నింగ్ ఇస్తాడు….
క్రిష్ వచ్చి అందరినీ చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని సీరియస్ గా అడుగుతాడు….
అది సార్ మీకు వెల్కమ్ చెప్దామని అని అంటుంది ఒక లేడీ……
ఏమి అవసరం లేదు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి…..వర్క్ నెగ్లెట్ చేస్తె మీ జాబ్ తీసేయడానికి కూడా ఆలోచించను….గో అండ్ వర్క్ ఫస్ట్ అని గంభీరంగా చెప్తాడు…..
అంతే అందరూ పరుగులు పెడుతూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు…..
పక్కనే ఉన్న విజయ్ ఆశ్చర్యపోతూ ఏంటి రా నువ్వే నా ఇది….నేను చూస్తుంది క్రిష్ నే నా….
క్రిష్ విజయ్ వైపు చూసి కాదు కృష్ణాంశ్ వర్మ…..అని యాటిట్యూడ్ గా చెప్తాడు….
అయోమయంగా చూస్తాడు విజయ్….
క్రిష్ విజయ్ భుజం పై చెయ్యి వేస్తూ పద….అని మేనేజర్ వైపు చూస్తూ డాడ్ ఎక్కడ ఉన్నారు…..
ఆయన కేబిన్ లో ఉన్నారు సార్ రండి మీరు వస్తె మిమ్మల్ని అక్కడి కి తీసుకుంటామన్నారు….
సరే పదండి…..అని మేనేజర్ కూడా వెళ్తారు క్రిష్,విజయ్….
ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్న వీరేంద్ర గారు గర్వంగా ఫీల్ అవుతూ గ్రేట్ జాబ్ క్రిష్….నాకు తెలుసు నువ్వు బయట ఎలా ఉన్నా ఆఫీస్ లో ఒక బాస్ లా నే ప్రవర్తిస్తావు అని…. నా కొడుకువి నా నమ్మకాని నిలబెట్టావు…..అని అనుకుంటారు….
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
చ నేను అనుకున్నది జరగలేదు లేదంటే ఆ భూమి ఎగ్జామ్ రాసేదే కాదు…..
నువ్వు ఏమి చెయ్యలేవు లే గీతూ ఇంక వదిలేయ్….
ఏయ్ చంపేస్తాను ఇంకో మాట మాట్లాడారు అంటే… పొండి ఇక్కడ నుండి….
అని కోపంగా గీతిక పిడికిలి బిగించి ఈరోజు గెలిచాను అని సంభారపడకు భూమి ఇప్పుడు గెలిచినా జీవితం లో ఓడిపోయేలా చేస్తాను..
నిన్ను నా చెప్పు చేతల్లో పెట్టుకుని నా కాళ్ళ దగ్గర పడి ఉండేలా చెయ్యకపోతే నా పేరు గీతిక నే కాదు…అని కోపంగా అనుకుని అక్కడినుండి ఇంటికి స్టార్ట్ అవుతుంది….
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఎంటే రోజు రోజు కి మీ చెల్లెలు ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి….ఈరోజు కొంచెం లో తప్పిపోయింది….
లేకపోతే ఎగ్జామ్ రాసేదానివే కాదు……నీ లైఫ్ నాశనం అయి ఉండేది…..ఇంకా ఎన్ని రోజులే అక్కడ వాళ్లందరికీ భయపడుతూ ఏడుస్తూ ఉంటావు…అని అసహనంగా అడుగుతుంది లావణ్య…..
నేను అదే అనుకుంటున్నాను…..నాకంటూ ఒక జాబ్ వస్తే నేను బయటికి వచ్చి నా బ్రతుకు నేను బ్రతుకుతాను…..కానీ నాకు నమ్మకం లేదు లవ్ వాళ్ళు నన్ను వదిలిపెడతాడు అని….
పోలీస్ కంప్లైంట్ ఇవ్వు భూమి….
అప్పుడు నేనే తప్పు చేశాను అని నిరూపిస్తారు వాళ్ళు…..అందుకే వాళ్ళు ఏం చేసిన మౌనంగా భరిస్తూ వస్తున్నాను…..
లేదు భూమి ఒక్కసారి నువ్వు బయటికి వచ్చి చూడు నీకు అండగా నేను ఉంటాను….
థాంక్స్ లవ్ అందరూ నన్ను చూసి అసహించుకున్న దూరం పెట్టినా నువ్వు మాత్రం నన్ను ఒక తల్లి లా ఆదరించావు…..
చాల్లే నోరు ముయ్యి నువ్వు అందంగా ఉంటావు రా…..కాకపోతే నీ ఒళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది….అయినా బాగుంటావు చబ్బీ గా…అని భూమి బుగ్గలు పట్టుకుని లాగుతుంది…..
భూమి నవ్వుతూ పద లేట్ అయితే పిన్ని అరుస్తుంది….
సరే పద నీకు ఎప్పుడు ఈ కష్టాలు తప్పుతాయో ఏంటో….
అనుకుంటూ ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు…..
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఇంటికి వచ్చిన గీతిక దమయంతి తో భూమి తప్పించుకున్న విషయం చెప్పి చిందులు తొక్కుతుంది….
అవునా అది అంత ధైర్యంగా వాళ్ళని కొట్టిందా అని అడుగుతుంది దమయంతి….
అవును మమ్మీ నాకు నా ఫ్రెండ్స్ దగ్గర చాలా అవమానం జరిగింది…..దానిని వదిపెట్టను…..
చూడు గీతిక అది ఎక్కడికి పోదు జీవితాంతం మన కాళ్ళ దగ్గర కుక్కిన పేను లా పడి ఉంటుంది….దాని సంగతి ఎప్పుడైనా చూసుకోవచ్చు… ఇప్పుడు అది ముఖ్యం కాదు….నువ్వు చెయ్యవలసిన ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది…..
ఏంటి మమ్మీ…..
మీ డాడీ నీకు పెళ్లి చెయ్యాలి అని చూస్తున్నారు….
ఏంటి మమ్మీ నువ్వు అనేది….
అవును దేశం లో నే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ మెన్ వీరేంద్ర గారి అబ్బాయి కి….
అవునా మమ్మీ…..అంత ఉన్నవాళ్ళు నన్ను చేసుకుంటారా…..
నీకంటే త్వరలోనే మిస్ ఇండియా అవుతావు…..
మమ్మీ నేను ఇంకా పోటీ లో సెలెక్ట్ అవ్వలేదు మమ్మీ….
అవుతావు లే.ఆ ఇంటి కోడలువు అవ్వు ముందు…..
మమ్మీ మిస్ ఇండియా అన్నది నా డ్రీమ్ అందుకే నాకు చదువు ఎక్కలేదు….
మీ డాడీ ఉండగా నీ కలలు అన్ని సాకారం చేస్తాడు…మీ డాడీ నక్క తెలివితేటలు చూపించి ఖచ్చితంగా అనుకున్నది చేస్తాడు నాకు తెలుసు….
అని గతాన్ని తలుచుకుని గర్వంగా అనుకుంటుంది…..
అయితే నేను పెద్దింటి కోడలిని అయిపోతాను అని కలల్లో విహరిస్తూ ఉంటుంది గీతిక….
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కాశి లో ఒక ముసలావిడ ఒక స్వామీజీ ముందు కూర్చుని స్వామి నా మనవడి జాతకం లో 28 సంవత్సరాన్ని గండం ఉంది అని చెప్పారు…..నా మనవడికి తొందర లో నే 27 పూర్తి కానున్నాయి…అని ఆందోళనగా అడుగుతారు కళ్యాణి దేవి గారు….
స్వామీజీ చిరు మందహాసం చేస్తూ నడిచేది మనమే అయినా నడిపించేది ఆ పరమాత్ముడు తల్లి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది….
నేను చెప్పిన జాతకం ఉన్న అమ్మాయి తో వివాహం జరిపించండి …..
అలాగే స్వామి….అని అతనికి దణ్ణం పెట్టుకొని స్వామీజీ ఇచ్చిన జాతకం పట్టుకుని అక్కడి నుండి ఇంటికి బయలదేరుతారు….
స్వామీజీ శివుడు నీ చూస్తూ ఆట మొదలు పెట్టావా శివ….అని నవ్వుతూ అని ధ్యానం లో కి వెళ్ళిపోతారు….
ఇంకా ఉంది…..
గతం లో ఏమి జరిగింది అని దమయంతి నవ్వుకుంది….?
ఆ జాతకం ఎవరిది….?
తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయిపోండి మన 
మగువ మనసు 🔥….
ఈ ఎపిసోడ్ నచ్చితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి…..
ప్లీజ్ కామెంట్స్ యార్ 😔
థాంక్స్ ఫర్ రీడింగ్ 😊