ఉదయ్ నువ్వు కూడా అత్తయ్య వాళ్ళు అలోచినట్టు ఎందుకు ఆలోచిస్తున్నావ్ ……….. ?? నా కడుపు లో ఉంది మన బిడ్డ ఈ బిడ్డ ను వదిలేయమని ఎలా చెప్తున్నావ్ ……….. ?? నువ్వు కూడా అందరి లాగే ఇది మధన్ బిడ్డ అనుకుంటున్నావా అని కొంచెం కోపంగా అడుగుతుంది గాయత్రి……….. !!
గాయత్రి ఎందుకలా ఆవేశ పడుతున్నావ్ …………. ?? చూడు నీ కడుపు లో పెరుగుతుంది మన బిడ్డే కావచ్చు కానీ లోకానికి మాత్రం ఆ బిడ్డ మధన్ వారసుడు………… !! నువ్వు వీడ్ని మనతో తీసుకుని వచ్చినా మధన్ కొడుకు అనే అంటారు అది నాకు ఇష్టం లేదు ……….. !!