మానస తన వడిలో పడుకున్న వరుణ్ తల నిమురుతూ …………. !! నువ్వు ఇలా బాధ పడతావు అనే ఈ విషయాన్ని నీకు ఎప్పటికీ తెలియకూడదు అని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు వరుణ్……….. !! తన కొడుకు కి పుట్టని నిన్ను వదిలేయమని మధన్ పేరెంట్స్ తనను చాలా ఫోర్స్ చేశారు ………… !! కానీ మధన్ నీ చేయ్ వదల్లేదు నీ కోసం తన పేరెంట్స్ కి శాశ్వతంగా దూరం అయ్యాడు అలాంటి గొప్ప వ్యక్తి నీ ఫాదర్ మధన్ ……… !!
వరుణ్ కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి కూర్చుని………… !! మరి నన్ను అంతలా ప్రేమించే నాన్న నన్ను పట్టించుకోకుండా ఎందుకు నెగ్లేట్ చేశాడు ఎప్పుడు డ్రింక్ చేస్తూ ఎందుకు ఒంటరిగా గడిపాడు ……….. ??