గాయత్రి తన తల్లి చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ తన పక్కనున్న చీర చేతిలోకి తీసుకుంటుంది ………!! తనకు కూడా ఇలా చాలి చాలని జీతం తో జీవితాంతం అడ్జస్ట్ అవుతూ లైఫ్ లీడ్ చేయాలి అని లేదు ……… !! చాలా రిచ్ గా అన్ని సుఖాలు అనుభవిస్తూ రిచ్ లైఫ్ స్టైల్ మెయిన్టెయిన్ చేయాలి అని తన కళ ………. !! కానీ అనుకోకుండా ఉదయ్ క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయ్యి తనను లవ్ చేస్తుంది ……….. !! కానీ ఉదయ్ తన లైఫ్ లోకి రాకపోయి ఉంటే గాయత్రి డెఫనెట్ గా కోటీశ్వరుడి ను ప్రేమించి పెళ్లి చేసుకునేది ……….. !! కానీ ఇప్పుడు తన మనసులో ఉదయ్ ఉన్నాడు తనను కాదని డబ్బున్న వ్యక్తి ను పెళ్లి చేసుకోలేదు………. !! అలా అని ఉదయ్ తెచ్చే శాలరీ తో అడ్జస్ట్ అవుతూ బ్రతకలేదు తను ఇప్పుడు ఎటు తేల్చుకోలేని సందిగ్ధం నెలకొంది ………. !!