నిత్య అన్న మాటలకు అర్జున్ తట్టుకోలేక తన చేతిలోనే ఉన్న గ్లాస్‌ను గట్టిగా పిడికిలితో బంధించాడు……… !! గ్లాస్ పగిలి గాజు పెంకులు దిగి చేతిని చీల్చి రక్తం కారుతున్నా ఆ గాయం కంటే నిత్య అన్న మాటకే అర్జున్ మనసుని ఎక్కువ గాయ పరుస్తున్నాయి……… !! నిత్య వెళ్ళిన వైపే బాధగా చూస్తూ సృష్టి కి కాల్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాడు అర్జున్ భట్టాచార్య……. !! అర్జున్ చెప్పేది విన్న సృష్టి చిన్నగా నిట్టూర్చి అన్నయ్య నువ్వు పదేపదే తప్పులు చేస్తున్నావు……… !! అసలు నిత్య మీద ఎందుకు హ్యాండ్ రైస్ చేశావు…….?? మిస్టేక్ నీ వైపు ఉన్నప్పుడు తనను పనిష్ చేసే రైట్ నీకు లేదు………. ?? ఏదైనా అవ్వనీ నువ్వు వీలైనంత త్వరగా తనతో నార్మల్‌గా మాట్లాడి నీలో నిత్య మీద ఉన్న ట్రూ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయి……… !! అంతేగానీ నీ కోపానికి నీ బ్రెయిన్‌ని అప్పగించి మరోసారి నిత్యను నీ లైఫ్ లో నుంచి పర్మనెంట్ గా కోల్పోకు అని అర్జున్ కి అర్థమయ్యేలా చెప్తుంది……… !!