New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అజేయ – 1
అజేయ 3 min read

అజేయ – 1

                   **   అజేయ  –   1 **

లండన్ మహా నగరంలో  అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న  , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది..
లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో  నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు..
అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల ఒకే దృశ్యం వేల రెట్ల వేగంతో మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతోంది…
అది ఒక యుద్ధభూమి.. కొన్ని వేల గుర్రాల కాలి గిట్టాలా శబ్దాలు, కత్తుల ఘర్షణ,చుట్టూ రక్తపాతం..
ఆ మారణహోమం మధ్యలో ఒక దివ్యమైన, నల్లటి కాంతితో మెరుస్తున్న ఒక పాత ఖడ్గం…ఆ కత్తి పిడిపై ఒక సింహం ఆకృతి రాజసం గా బంగారు పోతాతో మెరిసిపోతు ఉంది…
ఆ కత్తిని పట్టుకోవాలని ఒక క్రూరమైన ఆకారం ముందుకు రావడం, అదే సమయంలో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తూ ఏడవడం… 
మళ్ళీ అప్పుడే సడన్‌గా ఒక పదునైన కత్తి అతడి గుండెల్లోకి దిగబడటం…
“హాహ్!” అంటూ అతను ఒక్క ఉదుటున బెడ్ మీద నుంచి లేచి కూర్చున్నాడు…
అతని శ్వాస వేగంగా ఆడుతోంది.. అతని గుండె కొట్టుకునే వేగం గది నిశ్శబ్దాన్ని చీల్చుతోంది.. అది కేవలం ఒక కల కాదు, ఒక భయంకరమైన అనుభూతి…
ప్రతి రోజూ రాత్రి సరిగ్గా మూడు గంటలకి అతనికి ఇదే కల పదే పదే వస్తోంది…
వై ది హెల్ ఇస్ థిస్ హాప్పీనింగ్ టూ మీ ?
(“నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?” ) అని తనలో తాను గట్టిగా అనుకున్నాడు.. అతడు..
అతడే ..రాఘవ్.. అతడు ఒక సాధారణ యువకుడు కాదు…అతనొక మోడ్రన్ ఆర్కియాలజిస్ట్…
ప్రపంచంలోని ఎన్నో ప్రాచీన రహస్యాలను చేధించిన మెదడు అతనిది. కానీ, తన సొంత మైండ్‌లో జరుగుతున్న ఈ మిస్టరీని మాత్రమే అతను డికోడ్ చేయలేకపోతున్నాడు..
అతని బెడ్ పక్కనే ఉన్న గ్లాస్ లోని నీటిని ఒకే శ్వాసలో తాగేసాడు..టేబుల్ మీద అతని ల్యాప్‌టాప్ ఇంకా ఆన్‌లో ఉంది..
అందులో అతను రాస్తున్న రీసెర్చ్ పేపర్ ఓపెన్ అయి ఉండగా.. స్క్రీన్ మీద..
“Ahobilam : The Unsolved Inscriptions and Myths”..
(“అహోబిలం: పరిష్కరించబడని శాసనాలు మరియు పురాణాలు” ) అని గోల్డెన్ ఫోన్ట్ లో అందం గా మెరుస్తూ కనిపిస్తుంది..
లాప్టాప్ స్క్రీన్ నీ అఫ్ చేసి.. సిస్టమ్ షట్ డౌన్ చేసిన రాఘవ్ లేచి అద్దం ముందు నిలబడ్డాడు…
అతని కళ్లల్లో ఎలాంటి అలసట లేదు, ఒక రకమైన పట్టుదల మాత్రమే ఉంది..!!
అతనకి ఆ కలలో కనిపించే ప్రతి వస్తువు, ముఖ్యంగా ఆ ఖడ్గం, అతని సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎందుకు వెంటాడుతున్నాయి? 
ఒక సైంటిస్ట్‌గా అతను దీన్ని కేవలం ఒక హాలూసినేషన్ మాత్రమే అని ఎందుకు కొట్టిపారేయలేకపోయాడు..??
ఎందుకంటే ఆ కలలో ఒక ఆర్డర్ ఉంది, ఒక హిస్టారికల్ పాటర్న్ ఉంది… మిస్టేరీ లని వెంటాడే అతడిని వెంటాడుతున్న ఆ కల రాఘవ్ నీ ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు..
రాఘవ్ తన టేబుల్ పై ఉన్న ఒక పురాతన భారతదేశ నాణేన్ని అతడి చేతిలోకి తీసుకున్నాడు..దాన్ని గట్టిగా నొక్కుతూ, “నా మైండ్‌తో గేమ్స్ ఆడుతున్న ఈ మిస్టరీ ఏంటో ఈరోజే తేల్చేస్తా” అని మనసులో అనుకున్నాడు..
మరుసటి రోజు కి మారుతున్న గడియారం ముళ్ళునీ చూస్తున్న రాఘవ్ కి.. ఆ లండన్ చలి ఏమాత్రం తగలడం లేదు, 
అతని లోపల ఏదో ఒక తెలియని ఒక శక్తి అతన్ని ఇండియా వైపు లాగుతున్నట్టు అనిపించింది..
ఈ రాత్రికి ఎలాగైనా తన రీసెర్చ్ పేపర్ పూర్తి చేసి, ప్రొఫెసర్ విలియమ్స్ ముందు పెట్టాలని డిసైడ్ అయ్యాడు..
మరుసటి రోజు ఉదయం..లండన్ యూనివర్సిటీ హెరిటేజ్ క్యాంపస్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది..వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ బిల్డింగ్ లోపలికి రాఘవ్ నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు…
లాంగ్ బ్లాక్ ఓవర్‌కోట్, బ్రౌన్ లెదర్ బూట్స్, చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో అతని నడక ఒక రాయల్ లుక్‌ని ఇస్తోంది..
అతని పక్క నుంచి వెళ్తున్న లండన్ స్టూడెంట్స్ అందరూ అతన్నే గమనిస్తున్నారు..
రాఘవ్ అంటే ఆ యూనివర్సిటీలో ఒక బ్రాండ్..!!
అతి చిన్న వయసులోనే ప్రాచీన లిపిని, శాసనాలను చదవడంలో అతను వరల్డ్ క్లాస్ ఎక్స్‌పర్ట్..
రాఘవ్ అలా ఆడిటోరియం కి నడుచుకుంటూ వెళ్తుంటే, అతని కొలీగ్ మరియు క్లాస్‌మేట్ అయిన ఎమ్మా పరిగెత్తుకుంటూ వస్తుంది…
“మార్నింగ్ రాఘవ్! ఈరోజు నీ థీసిస్ సబ్మిషన్ కదా? 
ఆర్ యు రెడీ?
ఆ ప్రొఫెసర్ విలియమ్స్ చాలా డేంజర్ బ్రో..లాస్ట్ వీక్ హార్వర్డ్ నుండి వచ్చిన ముగ్గురు స్కాలర్స్ పేపర్స్ ని రిజెక్ట్ చేసాడు” అని కాస్త కంగారుగా చెప్తుంటే..రాఘవ్ నడక ఆపకుండానే ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు..
* * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️