New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అజేయ – 2
అజేయ 4 min read

అజేయ – 2

**   అజేయ  –  2 **
ఆ ప్రొఫెసర్ విలియమ్స్ చాలా డేంజర్ బ్రో..లాస్ట్ వీక్ హార్వర్డ్ నుండి వచ్చిన ముగ్గురు స్కాలర్స్ పేపర్స్ ని రిజెక్ట్ చేసాడు” అని కాస్త కంగారుగా చెప్తుంటే..రాఘవ్ నడక ఆపకుండానే ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు..
రాఘవ్ ఆమెని చూస్తూ..”ఎమ్మా, హార్వర్డ్ స్కాలర్స్ చరిత్రని పుస్తకాల్లో చదువుతారు.. కానీ నేను ఆ చరిత్రలో బ్రతుకుతాను..
విలియమ్స్ కి నా పేపర్ రిజెక్ట్ చేసేంత సీన్ లేదు, నాలెడ్జ్ అసలే లేదు. జస్ట్ వాచ్ మై గేమ్” అన్నాడు చాలా కాన్ఫిడెంట్‌గా..
అతని మాటల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, కేవలం తన రీసెర్చ్ మీద ఉన్న అపారమైన నమ్మకం మాత్రమే కనిపిస్తోంది..
ఎమ్మా.. రాఘవ్ కాంఫిడెన్స్ కి ఇంప్రెస్స్ అవుతూ.. ఎక్సయిటింగ్ గా “ఐ లవ్ యువర్ ఆటిట్యూడ్  యార్ ! బట్ విలియమ్స్ చాలా ఆర్థోడాక్స్.. అతను ఈజీగా ఒప్పుకోడు” అంది ఎమ్మా..
రాఘవ్ సైడ్ స్మైల్ చేస్తూ..”చూద్దాం… చరిత్రని మార్చడం ఎవరి తరం కాదు, అలాగే నా రీసెర్చ్ ని ఆపడం కూడా ఎవరి తరం కాదు” అని చెప్పి కాన్ఫరెన్స్ హాల్ వైపు అడుగులు వేశాడు..
రాఘవ్  ముందుకు నడుస్తుంటే క్యాంపస్ కారిడార్లలో అతని బూట్ల శబ్దం ఎకో లా వినిపిస్తుంది.. అతని మైండ్ లో కేవలం ప్రొఫెసర్ ని ఇంప్రెస్ చేయడం మాత్రమే రన్ అవ్వడం లేదు, 
ఆ ప్రొఫెసర్ దగ్గర ఉన్న ఒక రహస్య సమాచారాన్ని రాబట్టడం కూడా అతని ప్లాన్. ఎందుకంటే ప్రొఫెసర్ విలియమ్స్ గత ముప్పై ఏళ్లుగా సౌత్ ఇండియన్ హిస్టరీ మీద సీక్రెట్ రీసెర్చ్ చేస్తున్నాడు..
ప్రోఫెసర్ విలియమ్స్ ప్రైవేట్ ల్యాబ్ చాలా క్లాసిక్ గా ఉంది. చుట్టూ వేల పుస్తకాలు, గ్లోబ్స్, పురాతన శిల్పాల నమూనాలు ఉన్నాయి..
విలియమ్స్ తన టేబుల్ ముందు కూర్చుని, రాఘవ్ సబ్మిట్ చేసిన డిజిటల్ ఫైల్స్ ని చాలా సీరియస్ గా స్క్రోల్ చేస్తున్నాడు.. అతని ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.. 
రాఘవ్ అతనికి ఎదురుగా చాలా రిలాక్స్డ్ గా, ఒక చేతిని టేబుల్ పై ఉంచి కూర్చున్నాడు..
కొద్ది నిముషాల నిశ్శబ్దం తర్వాత విలియమ్స్ తన గ్లాసెస్ తీసి టేబుల్ పై పెడుతూ.. “రాఘవ్, నీ డేటా కలెక్షన్ అద్భుతం.. కానీ నీ కంక్లూజన్ మాత్రం టోటల్లీ అబ్సర్డ్!
12వ శతాబ్దంలో భారతదేశంలో వున్నా ఒక్క కత్తికి అపారమైన శక్తులు ఉన్నాయని, దాన్ని ఒక శాపం రక్షిస్తోందని నువ్వు రాసావ్..
థిస్ లుక్స్ లైక్ అ టాలీవుడ్ మూవీ స్క్రిప్ట్, నాట్ యాన్ ఆర్కియాలజికల్ పేపర్!” అన్నాడు వ్యంగ్యంగా..
రాఘవ్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. అతను ముందుకు వంగి, ప్రొఫెసర్ కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడటం స్టార్ట్ చేసాడు..
“విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ప్రొఫెసర్… మీ వెస్ట్రన్ ఆర్కియాలజిస్ట్స్ కి ప్రతిదానికీ లిఖితపూర్వకమైన ఆధారాలు కావాలి..
కానీ మా ఇండియాలో చరిత్ర కేవలం పుస్తకాల్లో ఉండదు. అది శిల్పాల్లో, మట్టిలో, మనుషుల రక్తాంతరాలలో దాగి ఉంటుంది..
మీ సైన్స్ ఇంకా కనిపెట్టని ఎన్నో మెటల్ అల్లారామ్స్ ఆ కాలంలోనే వాడారు.. ఆ కత్తి యొక్క కెమికల్ కంపోజిషన్ గ్రాఫ్  మీరు చూసారా? 
నేను దానిని పేజీ నంబర్ 45 లోనే మెన్షన్ చేశాను అని స్ట్రెస్ చేసి చెపుతూ… అది నార్మల్ మెటల్ కాదు ప్రొఫెసర్ అని ” అంటాడు..
రాఘవ్ మాటలకి విలయమ్స్ కోపం గా చూస్తూ..
“డోంట్ లెక్చర్ మీ రాఘవ్! అని అంటూ..
‘అజేయ’—ది ఇన్విన్సిబుల్ స్వార్డ్..
ఈ కత్తిని కేవలం ఆ యువరాజు వంశస్థులు లేదా అతని పునర్జన్మ మాత్రమే తాకగలరు అనే ఈ కర్జ్ థియరీని సైన్స్ ఒప్పుకోదు” అన్నాడు విలియమ్స్ కోపంగా..
“సైన్స్ కి అర్థం కాని రోజే కదా ప్రొఫెసర్ మిస్టరీ పుడుతుంది. నేను రాసింది పురాణం కాదు, హిస్టారికల్ ఫ్యాక్ట్..
ఆ కత్తి ఎక్కడ ఉందో, దాన్ని కాపాడుతున్న ఆ రహస్యం ఏంటో నాకు తెలుసు.. మీరు దాన్ని నమ్మకపోయినా, చరిత్ర నిజాల్ని దాచలేదు” అని రాఘవ్ చాలా గంభీరంగా చెప్పాడు..
రాఘవ్ ఆర్గ్యుమెంట్‌లోని డెప్త్ చూసి విలియమ్స్ ఒక్క క్షణం ఏమ్ మాట్లాడలేకపోయాడు… కానీ ఒక స్టూడెంట్ అలా తన ముందే నిలబడి తన 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ని ఛాలెంజ్ చేస్తుంటే అతను తట్టుకోలేకపోతున్నాడు, అలా అని రాఘవ్ దగ్గర ఉన్న పాయింట్స్ ని అతను కాదనలేకపోతున్నాడు.. ఒప్పుకోవాలి అంటే అతనీ అహం అడ్డు వస్తుంది..
రాఘవ్ అంతటితో ఆగలేదు. అతను లేచి ల్యాబ్ లో ఉన్న పెద్ద 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్టర్‌కి తన ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తాడు… 
ఒక్కసారిగా ఆ చీకటి గదిలో ఒక పెద్ద బ్లూ లైట్ తో ప్రాజెక్టర్ ఆన్ అవుతుంది… 
స్క్రీన్ మీద ఒక ఖడ్గం యొక్క త్రీ-డైమెన్షనల్ స్కెచ్ ప్రత్యక్షమవుతుంది… ఆ కత్తి  మీద  సింహం ఆకృతి లా ఉన్న పిడి, దాని బ్లేడ్ మీద ఉన్న వింత గుర్తులు చాలా స్పష్టంగా కనిపించాయి..
స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ ఖడ్గం యొక్క ఆ స్కెచ్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు..ప్రొఫెసర్ విలియమ్స్.. 
అతని చేతిలో ఉన్న పెన్ కింద పడిపోగా… అతను తన సీట్లోంచి లేచి మెల్లిగా ఆ ఆ హోలోగ్రామ్ దగ్గరకు వచ్చాడు..!!
మరి ప్రొఫెసర్ విలయమ్స్ కి ఆ ఖడ్గం గురించి తెలుసా.. గత కొన్ని సంవత్సరాలనుండి నుండి.. ఇండియాలో అతను దేని కోసం వెతుకుతూ రీసెర్చ్ చేస్తున్నాడు..??
* * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️