ఆ రాత్రి మొదలయింది…❤️🔥 – 1
ఈ రోజు కలుస్తున్నం….. మోస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ లో.
మిగిలిన స్టోరీస్ ల దీనిని కూడా మీరు చాలా ఇష్టపడతారు.. ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయిపోండి……🥰🤗🥰
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
అనుకోకుండా ఆ రాత్రి కలిసిన..
ఆ ఇద్దరు.
మరణమే శరణ్యమని నమ్మి,
చావడానికి సిద్ధపడిన ఆమె.
ఆ రాత్రి అనూహ్యమైన పరిస్థితుల్లో
ఇరుక్కున్న ఆమె.
ఆ రాత్రి ఊహించని విధంగా
ఆమెను కావాలని అడిగిన అతను.
రోజులకి గంటలకి డబ్బులు లెక్క కట్టి
సుఖాన్ని మాత్రమే ఇవ్వమని అడిగిన
అతని కోరిక.
ఆ రాత్రి అతని కోరికను
ఆమె అంగీకరిస్తుందా..??
ఒక సాధారణ దిగువ
మధ్యతరగతి కుటుంబంలోని ఆమె.
ఆకాశాన ఎగర గలిగే సిరి సంపదలతో,
తులతూగే అతను.
తీరాలు కలవని చెరో దిక్కున నిలిచిన ఇద్దరు.
సంతోషాల దీవిలో సుఖ భోగాలతో
విరసిల్లే అతని కోరిక ..
కన్నీటి కడలి శయనంలో ఆమె తీరుస్తుందా..??
ఆ రాత్రి వారిద్దరి పరిచయం
ఏ మలుపు తిరుగుతుందో..??
ఏ తీరం చేరుతుందో చూడాలి మరి.
ఒక సగటు మధ్యతరగతి ఇల్లాలి కధ.
ఆ రాత్రి అతని పరిచయంతో ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే… ఫాలో అయిపోండి.
❤️🔥ఆ రాత్రి మొదలైంది❤️🔥
*************
అటు ఇటుగా అర్ధరాత్రి కావస్తున్న సమయం.
చుట్టూ చీకటి.
ఎటు చూసినా, ఎవరు లేని నిర్మానుష్యం.
వేగంగా ఖాళీగా ఉన్న రోడ్డుమీద
దూసుకుపోతుంది ఒక కారు.
ఎదురు వచ్చిన మలుపు తిరిగి
ముందుకు పోతుండగా..
కారులో వెనుక ఉన్న అతను
‘స్టాప్’ అని పెద్దగా అరవడంతో
ఆ కారు వేగానికి బ్రేక్ పడింది
ఎండలు ముగుస్తు, తొలకరి
చిరుజల్లులు పలకరించడానికి
సిద్ధమంటున్న కాలం.
చిరు తెమ్మెరలు మృదువుగా తాకుతూ,
ముందుకు పోతున్న క్షణాలు.
ఆహ్లాదకరమైన వాతావరణం.
హాయిగా అనిపిస్తున్న వేళ.
వెచ్చగా చెంపల మీద జారుతున్న
కన్నీళ్లు తుడుచుకుంటూ సిమెంట్
బెంచ్ మీద కూర్చుంది ఒక అమ్మాయి.
నిండుగా పారుతున్న కాలువ మీద
కట్టిన వంతెనకి మొదట్లో ఉన్నది.
ఆ సిమెంట్ బెంచ్.
ఆ కెనాల్ కి అనుకొని ఉన్న డైరీలో
రాత్రి పదింటి వరకు జనం
కిటకిటలాడుతూ ఉంటారు.
ఆ మిల్క్ డైరీ కి వచ్చిన వాళ్ళు
కూర్చోవడానికి వీలుగా,
లోపల, బయట వేయించిన
సిమెంట్ బెంచెస్ అవి.
చుట్టుపరచుకున్న చీకటిలాగా
ఆమె మనసంతా నిండిపోయిన చీకటితో
జీవితం శూన్యంగా అనిపిస్తుంటే..
తల్లడిల్లిపోతూ ఆమె ఎదురుగా ఉన్న
కాలువ వైపు దీనంగా చూస్తుంది.
అదే నీకు శరణ్యం.
అవసరమా ఇటువంటి జీవితం నీకు..??
అని ఆమె మనసు, శరీరం, పరిస్థితులు..
ఇప్పటికే ఎన్నోసార్లు ఆమెను ప్రేరేపిస్తున్నాయి.
ఆ ప్రేరణతో..
నెమ్మదిగా లేచి బరువుగా మారిపోయిన
కాళ్ళను మోసుకేళ్తున్నట్టే,
ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది.
అతి కష్టం మీద బరువైన గుండెలతో
ఆమె అడుగులు ముందుకు సాగుతున్నాయి.
ఇక ఇంతే నీ జీవితం.
దీనికి బ్రతికుండడం అవసరమా..??
అని ఆమెను ఆమె ప్రశ్నించుకుంటూ..
రైలింగ్ ని పట్టుకుని నిలబడింది.
అటు ఇటు చూసింది.
ఎవరు కనిపించలేదు.
ఒక్క నిమిషం దిగులు పడింది.
నా చావుకు ఈ చీకటి తప్ప,
ఇంకేమి సాక్ష్యం లేదు అనుకుంది.
మొద్దుగా మారిన మెదడుతో
విరక్తి కలిగిస్తున్న జీవితం నుంచి
విముక్తి కోసం..
జలజల రాలిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ,
నెమ్మదిగా రైలింగ్ మీదకి ఎక్కి నిలబడింది.
కింద నిండుగా నిలకడగా నిశ్చలంగా
ఏ అలికిడి లేకుండా సాగిపోతున్న నీటి ప్రవాహం.
‘అలికిడి లేకున్న నిండుగా ఉన్న కాలువ.
దూకితే ప్రాణం పోతుంది.’
అన్న నమ్మకం ఆమెకు బలంగా ఉంది.
ఆ నమ్మకంతోనే..
ఆమె పైన, ఆమెనే వెక్కిరిస్తున్నట్టు
చూస్తున్న ఆకాశాన్ని చూస్తూ..
రెండు చేతులు జోడించి
కనిపించని దేవుడికి కళ్ళు మూసుకుని
దండం పెట్టుకుంటుంది.
నీళ్లలో పడగానే ప్రాణం పోవాలి.
ఎక్కువగా కష్ట పడకూడదు.
పొరపాటున కూడా తిరిగి బ్రతకకూడదు.
నువ్వు నాకు దేనిలోను సపోర్ట్ చేయలేదు.
సాయం చేయలేదు.
కనీసం ఈ ఒక్క విషయంలోనైనా
సాయం చెయ్యి స్వామి.
ఆమె కోరిక ఆ పైనున్న
భగవంతుడికి తెలియజేస్తూ
కళ్ళు తెరిచి తిరిగి ఆకాశాన్ని చూస్తుంది.
ఎప్పటిలానే నిశ్చలంగా ఉంది ఆకాశం.
ఆమె మనసు మాత్రం
చావు అంచున నిలబడడంతో..
అందుకు భిన్నంగా ఉగిసలాడుతూ ఉంది.
చచ్చిపోవడానికి సిద్ధపడిన శూన్యంతో,
నిండిపోయిన మనసు..
భయంకరంగా అలజడి రేపుతూ,
వేగంగా గుండె కొట్టేసుకుంటుంది.
దూకాల వద్ద అన్న సందిగ్ధంలో
కెనాల్ రైలింగ్ మీద ముందుకి వెనక్కి
ఊగుతుంది ఆమె శరీరం.
దూకకుండా ఏం చేస్తావు..??
నీకు బ్రతుకుందా అసలు..??
ఈత కూడా రాదు.
ప్రాణం పోయే రాత ఉంటే సరే,
లేకుంటే నీ పరిస్థితి ఏంటి..??
ఈ మాత్రం అన్న సాగుతుందా
నీ బతుకు..??
అధ్వానంగా మారి ఆమెను
భయపెడుతున్న ప్రశ్నల నడుమ
దూకమంటున్న విరక్తి.
ఈత రాదు అని భయపెడుతున్న
కింద నీటి ప్రవాహం.
రైలింగ్ మీద నిలబడిన ఆమె
ఎటు పాలు పోక తన శరీరాన్ని
బ్యాలెన్స్ చేసుకుంటూ
సందిగ్ధంలో ఊగిసలాడుతూ ఉంది.
సో హాట్..
సో సెక్సీ..
లవ్లీ..
రైలింగ్ మీద నిలబడి ఊగుతున్న
ఆమె శరీరాన్ని చూస్తూ..
చీకటిలో కూర్చుని ఆమె వెనుక నుంచి
ఆమెనే గమనిస్తున్న ఒక వ్యక్తి
తెగ రొమాంటిక్ గా ఫీల్ అవుతున్నాడు.
అంతగా నచ్చేస్తుంది, ఆమె ఫిగర్.
ఇంతకుముందు నీటిలో దూకడానికి
రైలింగ్ మీదకు ఎక్కినప్పుడు
వేగంగా వెళుతున్న కారులో నుంచి
అతను ఆమెను చూసాడు.
చూడగానే అర్థం అవుతుంది.
ఆమె చావడానికి, పైకి ఎక్కిందని.
కానీ..
చావు కోసం ఆమె సిద్ధమవుతున్న,
ఆమెను కాపాడాలన్న ఆలోచన చేయలేదు.
రైలింగ్ మీద నిలబడి ఊగుతున్నా,
ఆమెను వెనకనుంచి చూస్తున్నాడు.
ఆమెను ఆపాలన్న
ఆలోచన అతనికి లేదు.
రైలింగ్ మీద నిలబడి కదులుతున్న
ఆమె శరీరం అతని కళ్ళను కట్టి పడేసింది.
దానిని చూడడానికే ఇష్టపడుతున్నాడు.
ఆగిన కారులో నుంచి..
బీర్ బాటిల్, పల్లి పప్పుల పొట్లంతో
కిందకు దిగి ఆమె కనిపించే విధంగా
ఆమెకు దూరంగా ఉన్న మరొక బెంచ్ మీద
సెటిల్ అయ్యాడు.
సన్నగా, బారు జడతో, ఒంటికి చుట్టేసినట్టు
ఉన్న, క్రేప్ శారీ తో ఉంది ఆమె.
భయంతో దూకాలా వద్ద
అని ఉగిసిలాడుతున్న ఆమె శరీరంతో
పాటు వయ్యారంగ కదులుతున్న
ఆమె జడ, ఆమె బ్యాక్ పార్ట్
అంతా అతనికే బలే నచ్చుతుంది.
ఆమె ఊగిసలాట,
అందంగా నాట్యం చేస్తున్న
భంగిమను తలపిస్తుంటే..
కల్లార్పకుండా ఆమెనే చూస్తూ,
బీర్ తాగుతూ, పల్లి పప్పులు తింటూనాడు.
కూర్చున్న చోటు నుంచి ఎటు కదలకుండా
చూపులన్నీ ఆమె మీదే నిలిపి
ఎంజాయ్ చేస్తున్నాడు.
అతను వచ్చి కూర్చున్నాక
ఇది మూడోసారి.. ఆమె నీటిలో దూకడానికి
కెనాల్ రైలింగ్ మీదకు ఎక్కడం..
దూకలేని సందిగ్ధంలో
భయంతో దిగేసి వెనక్కి రావడం.
మిగిలినదంతా వదిలేసి ఆమె రైలింగ్
మీదకు ఎక్కినప్పుడు మాత్రం..
ఆమెను చూస్తూ ఫీలవుతున్నాడు అతను.
అసలు ఆమె
అలా పైకి ఎక్కడం కోసమే
ఎదురు చూస్తున్నాడు.
అక్కడ ఆమె చేసే డాన్స్ చూసి
ఎంజాయ్ చేస్తున్నాడు.
“పల్లి పప్పులు తింటూ,
ఇలా చూస్తూ కూర్చోకపోతే,
వెళ్లి హెల్ప్ చేయొచ్చు కదా ఫ్రెండ్.”
కూర్చున్న అతని పక్కనుంచి వినిపిస్తున్న
చిన్న పాప గొంతుకి..
ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా,
కాళీ అయిపోయిన
బీర్ బాటిల్ పక్కన పడేసి,
పొట్లంలో మిగిలివున్న పల్లి పప్పులను
ఆరామ్ గా, తింటూ ఆమెనే చూస్తున్నాడు.
పక్కన పాప
చాలా కోపంగా చూస్తుంది అతనిని.
“హెల్ప్ చేస్తే ఎంజాయ్మెంట్ పోతుంది.
చూద్దాం.. ఎంతసేపు నన్ను ఎంటర్టైన్ చేస్తుందో.
బ్యాక్ మాత్రం సూపర్.
ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్, ఏ లాట్.
డిస్టర్బ్ చెయ్యకు.”
హస్కీ వాయిస్ తో ఆ పాపని కసురుకుంటూ,
చూపంత ఆమె మీద పెట్టాడు.
కార్ దగ్గర నిలబడి అతనిని చూస్తున్న
అతని కార్ డ్రైవర్.. కాకపోతే మేనేజర్.
అతను ఎవరితో మాట్లాడుతున్నాడో
అర్థం కాక, పిచ్చిలో తనలో తాను
మాట్లాడుకుంటున్నాడు అని జాలిగా
అతనిని చూస్తున్నాడు.
ఇతన్ని కలిసిన దగ్గర నుంచి
ఆ డ్రైవర్ పరిస్థితి అలాగే ఉంది.
మూడోసారి.. అచ్చి రాలేదనుకుంటా..!!
ఆమె మళ్ళీ దిగేసింది.
అంతకుముందు ఆమె కూర్చున్న
బెంచ్ మీదే వచ్చి కూర్చుంది.
చిన్నగా వెక్కిళ్లు పెడుతూ,
తల కొట్టుకుంటూ బాధపడుతుంది.
ఇక్కడ ఆమెనే చూస్తున్న అతను
వెంటనే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ..
“బోర్ కొట్టించేస్తుంది నాకు.
ఉంటే రైలింగ్ పైన ఉండాలి.
లేదా నిలబడి ఉండాలి.
అలా కూర్చుంటే ఎలా..??
తన బాక్ కనిపించడం లేదు నాకు.
ఛా.. వీక్ బాడీ,
వీక్ బ్రెయిన్, వీక్ డెసిషన్.
స్ట్రాంగ్ గా, నిలబడ లేనప్పుడు
ఎందుకు ఎక్కడం..??
ఇక్కడ నాలాంటి వాళ్ళని
ఎందుకు ఇలా డిస్టర్బ్ చేయడం..??
ఇడియట్… అని అంటూ రైలింగ్ మీద నుంచి దిగేసి
అతని ఆనందాన్ని భగ్నం చేసిందన్న
ప్రస్స్టేషన్ తో, ఫీల్ అవుతున్నాడు.
రైలింగ్ కి ఆపోజిట్ సైడ్ లో,
ఉన్న బెంచ్ మీద ఆమె కూర్చుంటే,
ఆమె వెనకాల డైరీ ఎంట్రెన్స్ లో
ఉన్న బెంచ్ మీద అతను కూర్చుని
ఆమెను చూస్తున్నాడు.
నువ్వు బ్యాడ్ ఫ్రెండ్ వి.
నేను హెల్ప్ చేయలేను.
నువ్వు చేయగలిగిన చేయడం లేదు.
ఇట్స్ రియల్లీ బ్యాడ్.
అంటుంది పక్కనున్న
పాప కోపంగా.
నా ఫీలింగ్స్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా..??
అసలే దిగేసిందన్న కోపంలో ఉన్నాను.
బ్యాక్ బాగుంది, కాసేపు చూద్దాం అని కూర్చున్నాను.
తను ఒపక్కన డాన్స్ చేయడం మానేసి దిగేసింది.
ఇక్కడ నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావ్.
నువ్వు నాకు కోపం తెప్పించకుండా
వెళ్ళు.. అని పాపని విసుక్కుంటాడు.
యు సచ్ ఎ బాడ్ ఫ్రెండ్.
ఐ హేట్ యు. అని అర్చినట్టే అనేసి,
ఆ పాప లేచి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతున్న పాప గురించి
అతను అసలు పట్టించుకోకుండా..
అక్కడ తల మాత్రమే కనిపించే విధంగా
కూర్చున్న ఆమె గురించే ఆలోచిస్తున్నాడు.
గెటప్ మై గర్ల్.
పైకి ఎక్కు ఇంకోసారి.
చూసుకుంటా మరోసారి.
బ్యాక్ సూపర్.
చూడ్డానికి వెయిట్ చేస్తున్నా ఇక్కడ.
తనలో తాను అలా మాట్లాడుకుంటూ
ఆమె రైలింగ్ పైకి ఎక్కడం కోసం
ఎదురు చూస్తున్నాడు.
“ఈసారి ఎలాగైనా దూకేయాలి.
ఇలాగే టైం అంతా వేస్ట్ అయిపోతుంది.
ఎవరైనా నిన్ను చూస్తే, నీ పరిస్థితి ఏంటి..??
చావడానికి కూడా వదలమని
వాళ్ళ కాళ్లు పట్టుకోవాలి.
అయినా బ్రతుకు లేని నీకు, భయం ఎందుకే..??
అని ఫుల్ ప్రెస్టేషన్లో తనని తాను ప్రశ్నించుకుంటూ.
దూకాలి.. దూకాలి.. దూకాలి..”
ధైర్యం కోసం మంత్రముల అలా జపిస్తూనే..
గట్టిగా నిర్ణయం తీసుకొని
గబగబా రైలింగ్ వైపుకి,
ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె.
ఆవేశంగా పైకెక్కింది.
కిందకి దూకడానికి బలం ఇవ్వమని,
దేవుడికి దండం పెట్టుకుంటుంది.
§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§
మళ్లీ కలుద్దాం…
నా ఆలోచనల నుంచి నేను తయారు చేసుకున్న
నా కథ. ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ఆలోచనలు ఆచరణలు ఏ ఒక్కరిని అనుకరించినవి కాదని గమనించగలరు.
డోంట్ ఇగ్నోర్… చదివిన ప్రతి ఒక్కరూ సమీక్షలు అందిస్తుంటే డైలీ అప్డేట్ ఇస్తాను.
సపోర్ట్ మీ, ఫాలో మీ, అండ్ సబ్స్క్రైబ్ మీ.
ధన్యవాదాలు.
మీ వర్ణ.
…అన్ని హక్కులు రచయితవి…
దయచేసి కాఫీ కొట్టే ప్రయత్నంతో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయొద్దు.
Swipe left/right or tap the sides to turn pages