New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 1

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 1

“ఏమండీ… ఆఫీసుకి టైం అవుతుంది లేవండి.”
“వస్తున్నాను సత్య… టెన్ మినిట్స్” అంటాడు అఖిల్.
“ఏంటండీ… డైలీ ఇంతే. మిమ్మల్ని డైలీ నేను లేపకుండా ఒకరోజు కూడా లేవరు. ఏంటో…” అని కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉంటుంది సత్య.
పది నిమిషాల తర్వాత బెడ్‌రూమ్‌లోకి వచ్చి చూస్తే ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు.
“మీకన్నా పిల్లల్ని నయం అండి… లేచి రెడీ కూడా అయిపోయారు. మీరు మాత్రం డైలీ నేను వచ్చి లేపందే లేవరు” అని నిద్ర లేపుతుంది సత్య.
అతను సత్య చేయి పట్టుకొని తన వైపుకి లాగడంతో ఆమె కూడా బెడ్‌పై పడిపోతుంది.
“ఏంటి శ్రీవారు… ఆఫీస్‌కి టైం అవుతుంది. పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వండి” అని బుగ్గ మీద కిస్ చేస్తుంది.
“థాంక్యూ బంగారం… ఇంతసేపు వెయిట్ చేసింది దీనికోసమేనా?” అని నవ్వుతూ ఆమె ఫోర్‌హెడ్‌పై కిస్ చేసి, టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోతాడు.
“తెలిసి కూడా నేను ఇంతసేపు వెయిట్ చేశాను చూడు…” అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది సత్య.
పిల్లలు ఆల్రెడీ టిఫిన్ చేస్తూ ఉంటారు.
“మమ్మీ… డాడీ ఎక్కడ?” అని అడుగుతుంది దీక్ష.
“వస్తున్నారు… మీరు టిఫిన్ చేయండి. రెడీ అవుతున్నారు డాడీ” అని చెప్తుంది సత్య.
“మమ్మీ… డాడీ రోజూ ఇంత లేట్‌గా ఎందుకు లేస్తారు?” అని మరో పిల్లాడు అడగడంతో సత్య నవ్వుతుంది.
“మీ డాడీకి నిద్ర అంటే చాలా ఇష్టం. మీరు పెద్దయ్యాక మీ డాడీలా కాకుండా టైంకి లేవాలి” అంటుంది.
“మమ్మీ… మరి డాడీని ఎవరు లేపాలి?” అని దీక్ష అడుగుతుంది.
“ఇంకెవరు… నేనే కదా” అని నవ్వుతూ చెప్తుంది సత్య.
పిల్లలు టిఫిన్ కంప్లీట్ అయ్యేసరికి హాల్లో ప్రత్యక్షమవుతాడు అఖిల్ దేవ్.
“గుడ్ మార్నింగ్ డాడీ” అని ఇద్దరు పిల్లలు విష్ చేసి, వాళ్ల బ్యాగ్స్ తీసుకోవడానికి వెళ్తారు.
“గుడ్ మార్నింగ్ బంగారాలు…” అని వాళ్లిద్దరినీ దగ్గరికి తీసుకుంటాడు అఖిల్.
“డాడీ… ఇవాళ స్కూల్ నుంచి త్వరగా వస్తారా?” అని అడుగుతుంది దీక్ష.
“ఎందుకు?” అని అడుగుతాడు అఖిల్.
“మాతో ఆడుకోవాలి కదా…” అని పిల్లలు చెప్పడంతో అఖిల్ నవ్వుతాడు.
“సరే… ఇవాళ త్వరగా వచ్చేందుకు ట్రై చేస్తాను” అంటాడు.
సత్య గారు టిఫిన్ వడ్డించి, ముగ్గురి కోసం లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్‌పై పెడుతుంది.
అఖిల్ టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, డైనింగ్ టేబుల్‌పై ఉన్న లంచ్ బాక్సెస్ తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్లి నుంచుంటాడు.
“సత్యా… తొందరగా రా. నువ్వు ఎదురొస్తే మేము బయలుదేరుతాం” అంటాడు.
“అలాగే” అని ముగ్గురికి ఎదురొచ్చి, కొంచెం దూరం ముందుకు వెళ్లాక బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంది.
“బాయ్ మమ్మీ…” అని పిల్లలు కూడా చెయ్యి ఊపుతారు.
“బాయ్ బంగారాలు… జాగ్రత్తగా వెళ్లండి” అని సత్య చెప్తుంది.
ముగ్గురు పార్క్ చేసిన కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఎక్కి, పిల్లలిద్దర్నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిపోతాడు.
“అమ్మ సత్యా… అందరూ వెళ్లిపోయారా?” అని వాకింగ్ నుంచి వస్తూ కనిపిస్తారు అత్తమామలు.
“హా అత్తయ్య… ఇప్పుడే వెళ్లారు. మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి. టిఫిన్ చేద్దురు” అని చెప్తుంది సత్య.
“అలాగే తల్లి” అని ఇద్దరూ వాళ్ల రూమ్‌లోకి వెళ్లి, పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు.
ఈలోపు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంటుంది సత్య.
వీళ్లు డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం ఆలస్యం… వీళ్లకి టిఫిన్ వడ్డించి నుంచొని ఉంటుంది.
“అమ్మ సత్యా… నీకు ఎన్నిసార్లు చెప్పాలి తల్లి? మాతో పాటు తిను. ఇప్పటికీ చాలా లేట్ అయింది కదా” అని ఇద్దరూ అంటారు.
“పర్లేదు అత్తయ్య… మీరు తినండి. మీరు తిన్నాకే తింటాను” అని సత్య అంటుంది.
“ఎప్పుడూ ఇదే మాట చెప్తావు. నువ్వు మా కోడలివి మాత్రమే కాదు తల్లి… మా కూతురివి కూడా. మాతో కలిసి తినడానికి ఎందుకు అంత మొహమాటం?” అని అత్తయ్య అంటారు.
“అయ్యో… అలాంటిదేం లేదు అత్తయ్య” అని సత్య చిన్నగా నవ్వుతుంది.
“అయితే కూర్చో” అని అత్తగారు ప్లేట్‌లో టిఫిన్ పెట్టి తన పక్కనే కూర్చోపెట్టుకుంటారు.
ఇక సైలెంట్‌గా ఎవరికి కావాల్సినవి వాళ్లు పెట్టుకొని తిని టిఫిన్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు.
ఇంకా సత్య కిచెన్‌లోకి వెళ్లి వీళ్ల కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది.
పది నిమిషాల్లో కాఫీ ప్రిపేర్ చేసుకొని హాల్లోకి వస్తుంది.
ముగ్గురికి కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చిన తను ఇద్దరికీ కాఫీ ఇచ్చి, తను కూడా కప్పు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లబోతుంది.
“సత్యా… ఇంకా నీ అలవాటు మార్చుకో తల్లి. మాతో మీ అమ్మానాన్నలానే ఫీల్ అవ్వు” అని అంటారు ఇద్దరూ.
“అలాగే అత్తయ్య…” అని సత్య చిన్నగా నవ్వుతుంది…..
మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు 🥰🥰
చదివేలా వెళ్లిపోకుండా ప్లీజ్ ఏదో ఒక కామెంట్ చేయండి.. 🙏🙏🙏
మీ Chinni ❤️