New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 3

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 3

వీళ్లు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అఖిల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.

ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్‌పై పడుకొని మొబైల్‌లో వీడియోస్ చూస్తూ ఉంటాడు.
బెడ్‌రూమ్‌లోకి వచ్చిన సత్య, ఫోన్ చూస్తూ నవ్వుతున్న అఖిల్‌ని చూసి,
“ఏంటండీ… నవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు?” అని అడుగుతూ అఖిల్ పక్కన వచ్చి కూర్చుంటుంది.
తను అలా కూర్చోవడం ఆలస్యం… అఖిల్ తన భుజంపై చేయి వేసి తన వైపుకి లాక్కుంటాడు.
“ఏంటి శ్రీవారు…” అని సత్య తనని తాను ఆపుకోవాలని చూసినా, సడన్‌గా లాగడంతో అఖిల్ దగ్గరగా పడుతుంది.
అఖిల్ వెంటనే మొబైల్‌ని పక్కన పెట్టి,
“సత్యా… నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. అలా సరదాగా ఎక్కడికైనా వెళ్దామా?” అని అడుగుతాడు.
“ఎక్కడికి వెళ్దాం అండి? ఇంట్లో అత్తయ్య గారు, మామయ్య గారు ఉన్నారు కదా… వాళ్లని వదిలేసి ఎలా వెళ్తాము? వెళ్తే అందరం కలిసి వెళ్లే విధంగా ప్లాన్ చేయండి” అని చెప్తుంది సత్య.
“అలా కాదు బంగారం…” అని అఖిల్ ఆమె భుజంపై చేయి వేసి సరదాగా అంటాడు.
“చెప్పండి శ్రీవారు… ఏంటి అసలు విషయం?” అని నొసలు ఎగరేస్తూ అడుగుతుంది సత్య.
“అది… అది… మనకోసం కొంచెం టైమ్ స్పెండ్ చేయాలని ఉంది” అని చెప్తాడు అఖిల్.
“ఏంటి సార్… మన కోసమా? ఆల్రెడీ ఉన్న టైంలో మీతోనే ఉంటున్నాగా… ఇంకా మీకు టైమ్ సరిపోవట్లేదా?” అని కోపంగా చూస్తుంది.
“నువ్వు అలా చూడకు బంగారం… కోపంలో ఉంటే ఇంకా ముద్దొచ్చేస్తావు” అని నవ్వుతూ ఆమె బుగ్గపై కిస్ ఇస్తాడు.
“మిమ్మల్ని…” అని సత్య అఖిల్ భుజంపై చిన్నగా దెబ్బ వేస్తుంది.
అఖిల్ మాత్రం నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకుంటాడు.
“ఏంటి… కొడుతున్నావా?” అని అడుగుతూ మళ్లీ ఆమెను ఆటపట్టిస్తాడు.
“అవును… మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు” అని సత్య సిగ్గుపడుతూ అంటుంది.
అఖిల్ ఆమెను ప్రేమగా హగ్ చేసుకొని,
“సరే బంగారం… కోపం తగ్గిందా?” అని అడుగుతాడు.
“తెలియదు…” అని సత్య ముఖం పక్కకు తిప్పుతుంది.
“అయితే ఇలా చూస్తే తెలుస్తుందేమో” అని సరదాగా ఆమెను చూస్తూ ఉంటాడు అఖిల్.
సత్య కూడా నవ్వకుండా ఉండలేక చిన్నగా నవ్వుతుంది.
“చాలా శ్రీవారు… చక్కిలిగింతగా ఉంది” అని నవ్వుతుంది.
“సరే…” అని ఆమెను గట్టిగా హగ్ చేసుకొని,
“నాకోసం ఏదైనా స్పెషల్‌గా ఇవ్వచ్చుగా?” అని అడుగుతాడు.
“ఏం ఇవ్వాలి శ్రీవారు?” అని సరదాగా ఉడికిస్తూ అడుగుతుంది సత్య.
“ఏమి ఇవ్వాలా…” అని ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ, ఆమె చెవి దగ్గరగా వచ్చి ఏదో మెల్లగా చెప్తాడు.
అది విన్న సత్య కళ్ళు రెండు పెద్దవిగా చేసుకొని అఖిల్ వైపు చూస్తూ ఉండిపోతుంది.
“ఏంటి పిల్లా… షాక్ అయినావా?” అని నవ్వుతూ అడుగుతాడు.
“మీరు అలాంటి క్వశ్చన్ వేస్తే షాక్ అవ్వక ఏమవుతాను?” అని సిగ్గుపడుతూ అంటుంది.
“నేనేమైనా తప్పుగా అన్నానా? నువ్వు షాక్ అవ్వడానికి… నా పెళ్లానివే కదా. నేను అడిగింది ఇంకెవరినో కాదు కదా” అని అఖిల్ నవ్వుతూ అంటాడు.
“అలాగే… నేను ఎలా ఇస్తాను శ్రీవారు?” అని సిగ్గుపడుతూ ముఖం పక్కకు తిప్పుతుంది.
“నువ్వు సిగ్గుపడితే నాకు ఇంకా నిన్ను ఆటపట్టించాలి అనిపిస్తుంది” అని కొంటెగా అంటాడు అఖిల్.
“మీకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది” అని సత్య నవ్వుతుంది.
అఖిల్ ఆమెను దగ్గరికి తీసుకొని ప్రేమగా హగ్ చేసుకుంటాడు.
ఇద్దరూ కొద్దిసేపు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.
తర్వాత అఖిల్ సత్య నుదుటిపై చిన్నగా కిస్ చేసి,
“నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి… నాకు ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా… నీతో ఇలా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే చాలు. రోజు మొత్తం అలసట అంతా పోయినట్టే ఉంటుంది” అని చెప్తాడు.
ఆ మాటలు విన్న సత్య ముఖంలో చిన్న నవ్వు వస్తుంది.
“నాకూ అంతే శ్రీవారు… మీరు ఎంత బిజీగా ఉన్నా, చివరికి నా దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలు. నాకు ఇంకేం అవసరం లేదు” అని చెప్తుంది.
అఖిల్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా చూస్తాడు.
“అయితే ఈరోజు మనిద్దరం కొంచెంసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉందాం” అంటాడు.
“సరే…” అని సత్య కూడా నవ్వుతూ అతని పక్కనే కూర్చుంటుంది.
అలా ఇద్దరూ కొంతసేపు తమ పాత జ్ఞాపకాలు, పిల్లల గురించి, ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడుకుంటూ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు.
ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న చిన్న సరదా క్షణాల్లోనే వాళ్ల ప్రేమ ఇంకా మరింతగా పెరుగుతూ ఉంటుంది.
నా స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి… ఇది స్టోరీ మాత్రమే, స్టోరీలాగే చూడండి. ఇందులో క్యారెక్టర్స్ రియల్ లైఫ్‌కి సంబంధించినవి కాదు… ఇవి కేవలం కల్పితం మాత్రమే.
మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు… 🥰🥰
మీ Chinni ❤️