ఓ మనసా❤️🔥 – 1
కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏల గల ఘటికుడు.
అహంకారం ఆవేశం అతనికి పెట్టని ఆభరణాలు. ఎవరిని నమ్మకపోవడమే అతని విలక్షణత. అమ్మాయిలంటే చిన్న చూపు తేలిక భావం.
తండ్రిని ద్వేషించే పుత్రరత్నం. అతని ముందు నిలబడి మాట్లాడాలంటేనే వణికిపోయే తత్వం అతని చుట్టూ ఉన్నవారికి.
కుటుంబాన్ని వెలి వేసి తనదైన ప్రపంచంలో ఎటువంటి బంధాలకు బాంధవ్యాలకు చోటు ఇవ్వకుండా ఒంటరి రాక్షసుడిగా బతికే అతను.
అల్లారం ముద్దుగా అనురాగాల మధ్యన పెరిగిన నిండు జాబిలి. అభిమానమే మెండైన ఆభరణం. నలుగురిని కలుపుకుపోయే తత్వం, తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఆమె లక్షణం.
గుండె లేని ఈ మొండి మనిషి చల్లని జాబిలి జత కడితే…
జత కాగలడా..?? ఆ జాబిలి ప్రేమను అందుకోగలడా..??
అతని అమ్మాయిల వ్యసనాన్ని ఈ జాబిలమ్మ వదిలించగలదా..
ఆడది అంటేనే ద్వేషించే అతని మనసును సాధించగలదా..???
మనసు చేసే ఆ వింత మాయను తెలుసుకోండి…..❤️🔥
*****************
అందమైన ఆహ్లాదకరమైన ఓ సాయంత్ర సమయం.
చుక్కలు చంద్రుడి పక్కన ఆకాశంలో మెరవడానికి సిద్ధమవుతున్న వేళ, చల్లని చిరుగాలి మనసుకు హాయిగా అనిపిస్తుంటే తనతో ఉన్న అబ్బాయి తో క్లైమేట్ చాలా బాగుంది.
థాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఈవెనింగ్ చుట్టూ ఉన్న గ్రీనరీని ఇష్టంగా చూస్తూ చెప్పింది ఆమె.
నీకు ఇలా ఉంటే నచ్చుతుందనే ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆమె ఫేస్ లో కనిపిస్తున్న ప్రసన్నతకు ఇదే కరెక్ట్ టైం నా ప్రపోజల్ తన ముందు ఉంచడానికి అనుకుంటూ
అప్పటి వరకు తనలో తానే ట్రైల్స్ వేసుకున్న మాటలన్నీ మనసులో మరోసారి రిపీట్ చేస్తూ ఆమె కోసం కొన్న డిజైనర్ గోల్డ్ రింగ్ పాకెట్ లోంచి బయటకు తీసాడు.
మొదటి చూపుకే ఆమె అందానికి ఎట్రాక్ట్ అయిన, తన ఫీలింగ్స్ ని ఎప్పుడు బయట పడనివ్వకుండా చాలా కంట్రోల్ గా ఉన్న అతను ఈరోజు ఆమెకి తన మనసులోని మాట చెప్తున్నాడు.
చాలా టెన్షన్ గా ఉంది అతనికి…
ఇన్ని రోజుల పరిచయంలో ని తన ప్రేమను ఆమె ముందు ఉంచుతున్న అతనికి ఆమె యస్ చెప్తుందన్న కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉన్న ఎందుకో టెన్షన్ గా ఉంది.
ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆలోచనతో గొంతు సెట్ చేస్తున్నట్టు ఉ.. ఉ.. అని చిన్నగా సౌండ్ చేసే సరికి నేచర్ తో కనెక్ట్ అయిన ఆమె తిరిగి చూసింది మెరిసే కళ్ళతో.
ఒత్తైనా కనుబొమ్మల మధ్యన మెరుస్తున్న నల్లటి ఆమె కను పాపలలో తన ఫేస్ చూసుకుంటు
ఐ లవ్ యువ్..!! ఆ ఒక్క మాటలోనే తన మనసులోని ప్రేమంతా తెలిసేలా చెప్పి గోల్డ్ రింగ్ ఆమె ముందు ఉంచాడు.
అతని ప్రపోజల్ వింటూనే ఆమె ఫేస్ డల్ అయితే గోల్డ్ రింగ్ బాక్స్ క్లోజ్ చేసి నిలబడుతూ సారీ అంది.
నేనంటే నీకు ఇష్టం కదా, మరి సారీ ఎందుకు.. అని ఒక రకమైన షాక్ స్టేట్లో అడిగిన అతని గొంతులో సన్నటి వణుకు.
నువ్వంటే నాకు ఇష్టమే, బట్ ప్రేమించి పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు. నాకంటూ ఎవరూ లేని జీవితంలో నువ్వు నాకు మంచి ఫ్రెండ్ లా చాలా ఇష్టం.
అంతకు మించి నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. అసలు నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని స్పష్టంగా చెప్పినా ఆమెలో కూడా చిన్న గిల్టీ ఫీలింగ్.
నిన్ను బాగా అర్థం చేసుకున్న నేను నీకు మంచి భర్తగా ఉండగలను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోగలనన్న నమ్మకం నాకుంది.
ఇప్పటి వరకు నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు ఇప్పటి నుంచి ప్రేమించు అని ఆమె లేకపోతే బతకలేనన్నట్టు, ఆమె జీవితం అన్నట్టు చెప్పాడు.
అతని ప్రేమ అర్థం అవుతుంటే చిప్పిల్లుతున్న కళ్ళతో నా మనసులో మరొకరు ఉన్నారు.
అతనినే నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము అని తన ప్రేమ గురించి చెప్పింది.
అలా అస్సలు ఊహించని అతనికి చాలా షాకింగ్ గా అనిపించి ఏమంటున్నావ్ అన్నాడు నమ్మలేనట్టు.
నన్ను క్షమించు అని ఆయన కన్నా ఒక్క రోజు ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి ఉంటే నా మనసు ఆయన వైపు అట్రాక్ట్ అయ్యేది కాదేమో అంది.
ప్రేమ పెళ్లి అని ఆమె అంత క్లియర్ గా చెప్తుంటే అతని చేతిలోని గోల్డ్ రింగ్ బాక్స్ నేల మీదకు జారి పడిపోయింది
హు.. ఒక్క క్షణం చాలు ప్రేమ పుట్టడానికి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు మన విషయంలో అది నిజమైందని చాలా విరక్తిగా అని నీ దృష్టిలో నేను ఒక మంచి స్నేహితుడిని మాత్రమే, కానీ నా దృష్టిలో నువ్వు నా జీవితం.
నా జీవితంలో నువ్వు లేకపోయినా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తనకు దక్కని ఆమెని మరోసారి తనివి తీర చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ
రెండు అడుగులు ముందుకు వేసిన అతను మరోసారి వెనుకకు తిరిగి చూడగా కళ్ళనిండా కన్నీళ్ళతో క్షమాపణ చెప్తున్నట్టుగా చూస్తుంది ఆమె.
నా గురించి ఆలోచించకు, బాధపడకు నేను బాగుంటాను అని నమ్మకంగా చెప్పి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు.
జాగ్రత్త అని వెళ్ళిపోయాడు.
ఇన్ని సంవత్సరాల స్నేహం ఇలా ఒక లవ్ రిజెక్షన్ తో దూరమవుతుంటే బాధగా అతనినే చూస్తూ బెంచ్ మీద కూలబడింది ఆమె.
……..
21 అంతస్థుల బిల్డింగ్ కాంపౌండ్ లోకి హై స్పీడ్ తో రాకెట్ల వచ్చి ఆగింది బ్లాక్ రేంజ్ రోవర్.
కార్ ను చూడడమే స్పీడ్ గా వచ్చి డోర్ ఓపెన్ చేసే లోపే లోపల నుంచి డోర్ ఓపెన్ అవడంతో స్టిఫ్ గా సెల్యూట్ చేసిన సెక్యూరిటీకి ఫుల్ టెన్షన్ కారులో ఉన్న వ్యక్తి అంటే.
కాలి షూస్ నుండి హెయిర్ జెల్ వరకు ప్రతిదీ కాస్ట్లీ, లగ్జరీ, అండ్ బెస్ట్ బ్రాండ్ అవుట్ ఫిట్స్ లో బ్రాండ్ కె బ్రాండ్ అంబాసిడర్ గా కార్ లోంచి దిగిన 6.2″ కటౌట్…. రాణా రణదీర్ వర్మ.
అస్సలు స్మైల్ అనేది లేని పేస్ తో ఎప్పుడు ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కోపానికి మరోక రూపంగా ఉండే రాణా మరో పేరు డెవిల్.
పొగరు, అహంకారం, డబ్బు ఉందన్న బలుపు, జాలి దయా లేని రాతి మనిషి.. అని రాణా కు ఇలాగే చాలా చాలా బిరుదులు ఉన్నాయి.
చెప్పుకోవడానికి కూడా అతని ఫేస్ లో సీరియస్ నెస్ తప్ప మరో కోణం స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా చూడలేదు. అయితే ఒకటి డెవిల్ కోపంలో హెచ్చుతగ్గులు అందరికీ సుపరిచితమే.
పాయింటెడ్ మౌంట్ కార్ల్ షూస్ తో కార్ దిగడమే రాణా చేతిలో నుంచి సన్నగా వణుకుతున్న చేతితో బ్రీఫ్ కేస్ సెక్యూరిటీ తీసుకోగా వాకింగ్ రోబో లా ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు రాణా.
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
నోట్..
కథలోని పాత్రలన్నీ కల్పితం. ఎవరిని ఉద్దేశించినవి కావు. స్టోరీ మీద సర్వహక్కులు నావి. నా పర్మిషన్ లేకుండా కాపీ చేయడానికి ప్రయత్నించకండి.
మై డియర్స్ …
Please share and support 🙏
థాంక్యూ..💞
Varna..❤️🔥
Swipe left/right or tap the sides to turn pages