New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 1

కడదాక నీతోనే ❤️‍🔥 – 1

అతని ది భాధ్యత  ఆమెది అనుకువ 
అతను డబ్బు లో పుట్టి పెరిగిన అహంకారం ఉండదు.
ఆమె ది మధ్య తరగతి కుటుంబం లో పుట్టి నా   అత్యాశ లేదు వీరిద్దరు ఎలా కలుస్తారు ఎలా కుటుంభం నీ చూసుకుంటారు  చూద్దాం
ఆర్యన్ ❤️ ప్రణవి ల ప్రేమ ప్రయాణం
కుటుంభం లో చక్కటి అనుబంధాల అనురాగల పొదరిల్లు అన్నదమ్ముల అనుబంధాలు అక్క చెల్లెలా అనురాగాల కలయిక మన ఈ కథ. ఇదండి మన స్టోరీ నచ్చింది అంటే చెప్పండి కంటిన్యూ చేద్దాo  ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ అందరూ ఆధారిస్తారని ఆశిస్తున్నాను   ఇది  కేవలం కల్పితం మాత్రమే గమనించగలరు.       మనం  స్టోరీ లో కి వెళదామా      
ఒక అందమన పల్లెటూరు.  ఆ ఊరి పేరు సిరిపురం
శ్రీనివాసరావు గారు అతని భార్య అన్నపూర్ణ గారు
వారికి    ఇద్దరు కొడుకులు ఒక కూతురు.
కూతురు:పద్మావతి గారు ఆవిడ భర్త గోవింద్ గారు
ఆయనకి సొంతంగా బిజినెస్ లు చాలా ఉన్నాయి కానీ ఆయన కి ఉన్న ఒక వ్యసనం వలనమొత్తం పోగొట్టుకున్నారు వారికి ఇద్దరు కుతూర్లు 
పెద్దకూతురు: శార్వాణి 
చిన్న కూతురు: చంద్రిక 
పెద్దకొడుకు : మురళీధర్ గారు ఆయన ఒక చిన్న వ్యాపారి. ఆయన   తన మేనమామ కూతుర్ని  రమాదేవి గారిని పెళ్లి  చేసుకున్నారు వారికి ఒక కుతురు పేరు: సరిత 
చిన్నకొడుకు: వంశీ కృష్ణ గారు  ఆయన  అక్క కూతురు అయిన శార్వాణి గారి ని పెళ్లి చేసుకున్నారు 
గోవింద్ గారు వ్యసనాలు కారణంగా మనవరాలిని 
పట్టుబట్టి చేశారు శ్రీనివాస రావు గారి ఆమె భార్య అన్నపూర్ణ గారు. మొదట్లో చిన్న పిల్ల అని కాదన్న తరువాత పెద్దల నిర్ణయానికి తలవంచారు.
శార్వాణి గారు చిన్నప్పటినుండి మేనమామ అంటే ఒక భయం ఆ భయం ఆమె మెదడు లో మనసు లో అలాగే  ఉండిపోయింది. ఎంత భయమో అంతే ప్రేమ .ఆ ప్రేమ తోనే వంశీ గారినీ మార్చుకున్నారు.
వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు 
కూతురు: ప్రణవీ శ్రీ  ( మన. హిరోయిన్)
కొడుకు: వర్షిత్
ప్రణవి అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్న వంశీ గారికి. కానీ ఆడపిల్ల నీ ప్రేమ గా చూస్తే వారి జీవితం వల్ల అక్క జీవితం లా అయిపొతుందెమో అని ఎంత ఇష్టం ఉన్న మనసు లో నే దాచుకునేవారు. వాళ్ళ అక్కని ఒక్కతే కూతురు అని చాలా గారాబం చేశారు. అందుకే వాళ్ళ అక్క జీవితం అలా అయిపోయింది అని ఇద్ధారన్నదమ్ములు మనసులో నిలిచిపోయింది.
మన ప్రణవి పుట్టిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టాడు వర్శిత్. గోవింద్ గారికి మగపిల్లలు లేరు ఇక్కడ వర్శిత్ ఒక్కడే .అందుకే మన శ్రీనివాసరావు గారికి అన్నపూర్ణమ్మ గారికి ముద్దుల మనవడు అయిపోయాడు..
హైద్రాబాద్ మహా నగరం లో ఒక పెద్ద భవనం ఇంద్ర లోకమే దిగి వచ్చిందా అన్నంతగా ఉంది ఆ ఇల్లు చుట్టూ ప్రహరీ లోపల ఒక పక్కగా అంతా గార్డెన్ మధ్యలో కృష్ణుడు విగ్రహం చాలా అందంగా ఉన్న కృష్ణుడిని దాటుకుని వెళ్తే లోపల కళ్ళు మిరిమిట్లు గొలిపే లిటింగ్స్ అండ్ పెయింటింగ్స్ ఆ ఇంటి యజమాని మహేంద్ర నందంగారు నందన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు దాన్ని దేవంద్ర నందన్ గారు టాప్ వన్ బిసినెస్ గా మార్చారు. 
మహేంద్ర నందన్ గారు ఆయన భార్య మహాలక్ష్మి గారు ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు
కూతురు:సరస్వతి గారు ఆయన భర్త రాజశేఖర్ గారు
రాజశేఖర్ గారు దేవేంద్ర గారు చాలా మంచి స్నేహితులు 
వారి స్నేహం బంధుత్వం గా మారింది 
కొడుకు:దేవేంద్ర నందన్ గారు ఆయన భార్య ప్రగతి గారు
దేవేంద్ర గారి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు 
దేవేంద్ర గారు చెల్లెలిమీద ప్రేమతో వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు.
రాజశేఖర్ గారు ఒక అన్నాథ 
కుటుంబం ఆయనకు ఎలాగో లేదు అందుకే భార్య కుటుంబాన్ని తన కుటుంభం గా చూసుకుంటారు.
రాజశేఖర్ గారు ప్రగతి గారు సొంత అన్నాచెల్లెళ్ల లాగ ఉంటారు. రాజశేఖర్ గారికి ఇద్దరు కూతుర్లు 
సంజన,సాత్విక 
దేవేంద్ర ప్రగతి గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు  
ప్రగతి గారికి చాలా కాలం పిల్లులువుపుట్టలేదు
అందుకే వారికి పిల్లలు అంటే చాలా ఇష్టం 
కొడుకు: ఆర్యన్ నందన్ ఇంటికి వారసుడు వచ్చాడు అని మహేంద్ర గారు మహలక్మి గారి ఆనందం అంతా ఇంతా కాదు మనవడు పుట్టాడని మహేంద్ర గారు తన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అందరికీ బోనస్ లు ప్రకటించారు ఒక పండగ వాతావరణం నెలకొంది.
అందరు ఆర్యన్ నీ చాలా గారాబం చేసేవారు
కూతురు : ఆద్య  ఆద్య పుట్టిన తర్వాత ఇంటికి మహాలక్మి పుట్టింది అని చాలా సంతోషించారు.
ఇప్పుడు ఆర్యన్ కి 18 సంవత్సరాలు 
ఆద్య కి 16 సంవత్సరాలు 
సంజనా కి19  సంవత్సరాలు 
సాత్విక కి 15 సంవత్సరాలు
వీళ్ళ నలుగురిలో సాత్విక చిన్నది కావున అందరూ తనని గారాబం  చేసేవారు. 
సాత్విక చాలా అల్లరి పిల్ల 
సంజన తెలివైనది 
ఆధ్యా డేరింగ్ అండ్ డాషింగ్ 
ఆర్యన్  బాధ్యత అండ్ కేరింగ్ ఎక్కువ ఆర్యన్ కి కుటుంబం అంటే చాలా ఇష్టం 
ఆ వయసులోనే తండ్రికి సహాయం చేసేవాడు సగం బిజినెస్ తనే చూసుకునేవాడు కుటుంబం ని వదిలి వెళ్లాలని లేకున్నా పై చదువుల కోసం యూఎస్ వెళ్ళాడు
ఇంకా ఉంది….
తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయిపోండి మన కడదాక నీతోనే ❤️‍🔥…
ఈ ఎపిసోడ్ నచ్చితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి…
థాంక్స్ ఫర్ రీడింగ్ 😊