కడదాక నీతోనే ❤️🔥 – 2
చిన్న ఇల్లు డాబా రెండు గదులు ఒక హల్ చూడటానికి ముచ్చటగా ఉండే ఇల్లు
మురళీధర్ గారు, వంశీ గారు పక్క పక్క నే ఉంటారు.
వంశీ గారు : శర్వాణి ప్రణవి స్కూల్ కి వెళ్లిందా ….
శర్వాణి గారు : హా వెళ్ళిందండి మన ప్రణవికి చదివి అంటే చాలా ఇష్టం చాలా బాగా చదువుతుంది కూడా
వంశీ గారు : అవును శర్వాణి మన ప్రణవి బాగా చదువుతుందని మొన్న వాళ్ల మాస్టారు కనపడి చెప్పారు
శార్వాణి గారు : అవునండి మన ప్రణవిని చదివిద్దాం
వంశీ గారు : చూద్దాంలే మన ఊరిలో అమ్మాయిలు చదువుకోవడం అంటే పెద్ద కష్టమే మరి మన ప్రణవి విషయంలో ఏం జరుగుతుందో అన్నయ్య తో మాట్లాడి చూద్దాం
శార్వాణి గారు : ఎలాగైనా పెద్ద మావయ్యని ఒప్పించాలండి
వంశీ గారు : చూద్దాంలే శర్వాణి
అన్నపూర్ణమ్మ గారు : వాడు ఒప్పుకోడు రా మన సరితనే చదవనివ్వలేదు ఆడపిల్లలకి చదువు అవసరమా అని మాన్పించి పెళ్లి చేసేసాడు
వంశీ గారు : అన్నయ్య మాట కాదని నేను ఏం చేయనులే అమ్మ ఒకసారి అడిగి చూద్దాం. సరేలే నేను అలా పొలం దాకా వెళ్లి వస్తాను
శర్వాణి గారు : రండి అన్నం పెట్టేస్తాను
శ్రీనివాసరావు గారు: అమ్మ శర్వాణి నాకు కూడా పెట్టెయ్ తల్లి చిన్నోడు తో నేను అలా పొలం దాకా వెళ్లి వస్తాను
అన్నపూర్ణమ్మ గారు : మీరెందుకండి వాడు వెళ్తాడు లే…
శ్రీనివాస రావు గారు : ఇంటిదగ్గర అంటే నాకు ఏమీ ఉసుపోవడం లేదుల వెళతాను లే పూర్ణ
శార్వాణి గారు : రండి తాతయ్య పెట్టేసాను
అలా బోజునాలు ముగించి వాళ్ళిద్దరూ పొలానికి వెళ్ళారు
సాయంత్రం……..
ప్రనవి : అమ్మ…. అమ్మ ……ఎక్కడ ఉన్నావ్
శార్వాణి: ఇక్కడనే ఏం అయ్యింది స్కూల్ నుండి వచ్చిన వెంటనే అంతలా అరుస్తున్నావ్
ప్రణవి : అది అమ్మ ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? నేను స్కూల్లో ఫస్ట్ వచ్చానమ్మా
శార్వాణి గారు : మనసులో ఒక నిట్టూర్పు …..
చాలా మంచి వార్త చెప్పావు తల్లి
ప్రణవి : అవునమ్మా వచ్చే సంవత్సరం పక్కూరు వెళ్లి చదువుకోవాలి గా నాన్నని అడుగమ్మ ప్లీజ్……
మా ఫ్రెండ్స్ అందరూ పక్కూరు స్కూల్లో జాయిన్ అవుతున్నారు నేను కూడా వాళ్ళతో పాటు చదువుతానమ్మ ప్లీజ్ …..ప్లీజ్…….
శర్వాణి గారు: చూద్దాం లేవే అడుగుతాను లే.
అయినా పెదనాన్న ఒప్పుకోవాలిగా… ఆశలు పెట్టుకోకు
ప్రణవి : అదేంటమ్మ….. అలాగ అంటావ్ నాకు చదువు అంటే చాలా ఇష్టం కదమ్మా ..ఇప్పటివరకు చాలా బాగా చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి నాలో చదవాలి అనే కోరికని పెంచి మధ్యలో నా ఆశల్ని చంపేస్తారా అసలు ఈ కాలంలో కూడా ఏంటమ్మా అమ్మాయిలు చదువుకోకూడదు అని బయటకు వెళ్ళకూడదు అని ఏంటి అమ్మ ఇలాగా చాలామంది చదువుకుంటున్నారు నేను చదువుతాను అమ్మ నేను కూడా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటాను ప్లీజ్ అమ్మ నన్ను చదివించండి ప్లీజ్ పెదనాన్న నీ ఒప్పించండి.
ప్రణవి చాలా బాధపడుతుంది చదువుకుంటనో లేదోనని
ఆమెకి చాలా భాద గా ఉంది వల్ల నానమ్మ దగ్గర కి వెళ్ళి ఒసేయ్ ముసలి వెళ్లి పెదనాన్న నీ అడగొచ్చుగా అంటే అన్నపూర్ణమ్మ గారు : నువ్వే వెళ్లి అడుగు అయితే నేను ఎందుకు .నేను అడగను నన్ను తిడతాడు
ప్రణవి : అదేమిటి నానమ్మ అదే తమ్ముడిని అయితే చదివించకుండా వదిలేస్తారా……మరి నన్నెందుకు చదవోద్దు అంటున్నారు ……వాడిని ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తున్నారు. నేనేమో గవర్నమెంట్ స్కూల్ లో చదివిస్తున్నారు. అయినా ఎప్పుడైనా అడిగాన ఎందుకంటే నాన్న పరిస్థితి నాకు తెలుసు అందుకే బాగా చదివి నాన్న కి సాయం చేయాలనుకున్నాను.
అన్నపూర్ణమ్మ గారు : వాడు మగ పిల్లాడు వాడికి నీకు చెప్తావెంటే …..రేపు వాళ్ళని పోషించాల్సిన వాడు అందుకే మగపిల్లలు నీ చదివిస్తారు ….ఆడపిల్లలకి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేస్తారు.ఎవరు ఎక్కువ తక్కువ కాదే.
ప్రణవి : ఏ…… ఆడపిల్లలు చదవలేరా…….ఆడపిల్లలు పోషించలేరా……ఎందుకు ఆడవాళ్ళను తక్కువ చేస్తారు నానమ్మ…..ఎప్పుడు మారుతారు నానమ్మ నేనే అడుగుతాను పెదనాన్న నీ నాకూ ఏం అన్నా భయమా….
శార్వాణి గారు : ఒసేయ్ ఆగవే ఎందుకు తొందర నాన్న అడుగుతాను అన్నారు ఆగు.
ప్రణవి : చదువుకునేది నేనే కదమ్మా నేనే అడుగుతాను
అన్నపూర్ణమ్మ గారు : వెళ్ళనివ్వవే అదే అడుగుతుందిలే నువ్వు పని చూడు
మురళీధర్ గారు : రమా మంచినీళ్లు ఇవ్వు……
రమా దేవి గారు : సరేనండి తెస్తున్నాను. ఇదిగోండి నీళ్ళు…ఏవండీ….ఈరోజు మన సరిత ఫోన్ చేసిందండీ.. పిల్లలకి సెలవలు ఇచ్చారంట వెళ్లి తీసుకుని వస్తారా …..
సరిత కూడా చాలా బాగా చదివేది కానీ ఆడపిల్లలకి చదువు అవసరం లేదు అని సతీష్ ఇచ్చి పెళ్లి చేసారు.
తనకి ఇద్దరు పిల్లలు తనకి ఒక బాబు ఒక పాప ఇద్దరు ఒకరు ఐదవ తరగతి, ఒకరు మూడు వాళ్ళనే తీసుకురమ్మున్నారు రమా గారు
మురళీధర్ గారు : సరే రమా……మన వర్షిత్ ఏం చేస్తున్నాడు …చదువుతున్నదంటా బాగా…..
రమా గారు : హా వాడు ఒక కోతి ఎప్పుడు చూడు ఎగురుతా దుకుతా ఉంటాడు ఒట్టి అల్లరి కోతి…..మురుసుకుంటా చెప్తారు రమా గారు
మురళీధర్ గారు : పోనీలే రమా వాడు ఒక్కడే కదా మనకి మేము ఎలాగో గారాబం చెయ్యలేం మీరన్నా చెయ్యండి.
రమా గారు : మేము ఏం అనము అనే అల్లరి ఎక్కువైపోతోంది ఇంకా మీరు కూడా చేస్తే వాడి అల్లరి భరించలేము.
అయినా వాడి కి అల్లరే అందమండి.
ఇంకా ఉంది…
తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయిపోండి మన కడదాక నీతోనే ❤️🔥
ఈ ఎపిసోడ్ నచ్చితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….
థాంక్స్ ఫర్ రీడింగ్ 😊
Swipe left/right or tap the sides to turn pages