కడదాక నీతోనే ❤️🔥 – 3
పెదనాన్న……పెదనాన్న….. పెదనాన్న……..
ప్రణవి : పెదనాన్న ఏం చేస్తున్నారు పెద్దమ్మ నువ్వు కబుర్లు చెప్పుకుంటున్నారా…..
మురళీధర్ గారు : లేదు లే తల్లి చెప్పు ఏంటి సంగతి ఈరోజు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఈ పెదనాన్న గుర్తుకు వచ్చాడు ఏంటి సంగతి
ప్రణవి : అదా నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను తెలుసా…….
మురళీధర్ గారు : అవునా తల్లి సంతోషం.
ప్రణవి : సంతోషిస్తే సరిపోదు నా ఫ్రెండ్స్ అందరూ పక్కురుకి వెళ్ళి చదువుకుంటున్నారు ప్లీజ్ పెదనాన్న నేను చదువుకుంటాను……మా మాస్టర్ గారు కూడా నాన్న తో చెప్పారట నువ్వు ఒప్పుకుంటే నాన్నా కూడా ఒప్పుకుంటాడు ప్లీజ్…..
మురళీధర్ గారు : కానీ…..ప్రణవి మన పక్కురికి వెళ్లి చదవాలా నువ్వు ఉన్నంతలో చదువుకున్నావు సరిపోతుంది. స్కూల్ ఫస్ట్ వచ్చావు రేపు నీ పిల్లలకి చెప్పుకోవడానికి . పక్కురికీ వెళ్లి చదవడానికి నేను ఒప్పుకోను. ఊరిలో అందరు తలా ఒక మాట అంటారు తల్లి ఆఆర్థం చేసుకో ….. మీ అక్క సరిత కూడా బాగా చదివినా సరే మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం
ఎప్పుడు తను చాలా హ్యాపీ గా ఉంది. నువ్వు కూడా రేపు చాలా సంతోషంగా ఉంటావ్
ప్రణవి : లేదు పెదనాన్న నేను చాలా చడువుకుంటాను మీకు పేరు తీసుకువస్థానే తప్పా మచ్చ తీసుకురాను..
సమాజం కోసం ఆలోచిస్తున్నారే తప్పా నా కోసం నా కలల కోసం ఆలోచించడం లేదు ఎందుకు బయటవాళ్ళకి ఇచ్చిన విలువ నాకు ఎందుకు ఇవ్వడం లేదు ఈరోజు అంటారు రేపు అంటారు తర్వాత మర్చిపోతారు అలాంటి వాళ్ళ కోసమా నా భవిష్యత్తుని నాశనం చేస్తాను అంటున్నారు మగపిల్లలు గా పుట్టాలి చదవాలి అంటే ఆడపిల్లలు గా పుడితే ఇంతేనా మా జీవితం అమ్మ నీ పెద్దమ్మ నీ చూస్తూనే ఉన్నాను కదా ఏన్నో కళలతో ఆశలతో మా చదువు ప్రయాణం మొదలవుతుంది కష్టమైన ఇష్టంగా చదువుతాం ఏదో సాధించాలి అని అనుకుంటాం జీవితం లో ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అనెంతలో మ కాళ్ళకి పెళ్లి అనే భందనం వేస్తారు తరువాత పెళ్లివరకు తల్లి తండ్రిమాట కి ఎదురు చెప్పకూడదు పెళ్లి అయ్యాక భర్త మాట కి ఎదురు చెప్పకూడదు ఎందుకు ఆడదానికి ఎప్పుడు వస్తుంది పెదనాన్న స్వేచ్ఛా మకంటూ ఒక గుర్తింపు వద్దా పలానా కూతురు, పలానా భార్య అని చెప్పుకోవడమేనా మా జీవితం అంతా…. పుట్టిన దగ్గరనుండి మీరు ఎంత ప్రేమిస్తారు మమ్మల్ని అలాంటిది చదువు అనే విషయానికి వొస్తే ఎందుకు ఎంత పక్షపాతం చూపిస్తారు
మా భాద మీకు పట్టదా అక్క సంతోషంగా ఉంది అంటున్నారు కదా అదే అక్క నీ చదివిస్తే తన కలల నెరవేర్చుకున్న మహిళా గా మీ ముందు ఇంకా సంతోషం గా తిరిగేది. అది ఎందుకు అర్థం కావడం లేదు అని కింద కూర్చుని ఏడుస్తుంది రామగారు వచ్చి ఊరుకోరా…..ఏడవకు మా బంగారం కదూ…..
రమా గారు : ఏవండీ చూడండి ఇది ఎంతల భాద పడుతుంటే మీకు ఏం అనిపించడం లేదా మీకు మీ తమ్ముడికి ఇది అంటే ఎంత ఇష్టం మాకు తెలియదా మీకు ఉన్న అపోహ వలన దీన్ని దగ్గరకు తీసుకోరు పాపం చదువుకుంటను అని ఎంతలా ప్రధేయపడుతుంటే మెర్ మనసు కరగడం లేదా సరిత సంతోషంగా ఉంది అంటున్నారే అది తన జీవితం అంతే అని సరిపెట్టుకుంది దీన్ని అన్న చదివించండి బంగారం అండి మన ప్రణవి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు మీరు ఒప్పుకుంటే మీ తమ్ముడు ఒప్పుకుంటాడు మీ మాట అంటే అంత అభిమానం , గౌరవం
మురళీధర్ గారు : చిన్నప్పటినుండి దగ్గరకు తీసుకోకపోయినా చాలా ఇష్టం ప్రణవి అంటే అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారు…సరే అని ఒక సారి వంశీ తో కూడా మాట్లాడదాం అని అనుకున్నారు
నందన్ ప్యాలెస్
మహేంద్ర గారు హల్లో పేపర్ చదువుతూ ఉన్నారు అప్పుడే దేవేంద్ర గారు,రాజశేఖర్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఇంట్లో ఎంత మంది పనివారు ఉన్నా తన చేతులతో వండి పెడితేనే ప్రగతిగారికి తృప్తిగా ఉంటుంది సరస్వతి గారు ప్రగతి గారు వచ్చి ఇద్దరికీ వడ్డిస్తున్నారు
దేవేంద్ర గారు : బావా ఈరోజే కదా టెండర్ వేసేది ఎవరు వేస్తున్నారు
రాజశేఖర్ గారు : మన మేనేజర్ రామాచారి అన్నాడుగా బావా తనే చూసుకుంటున్నాడు టెండర్ విషయాలన్నీ
దేవేంద్ర గారు : అవును బావా మనకు శ్రమ లేకుండా అంతా రామాచారియే బాగా చూసుకుంటున్నాడు మన ఆర్యన్ వచ్చేవరకు మనకి శ్రమ తప్పదు వాడు వచ్చాక మొత్తం అన్ని బాధ్యతలు కార్యానికి ఇచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను ఇంక నా వల్ల కాదు ఆర్యన్ వచ్చాక మన రామాచారి నీ పీ. ఏ గా చేస్తే తనే జాగ్రత్తగా చూసుకుంటాడు
ఇప్పుడు ఏం జరుగుతుంది?
ప్రణవి చదువుకుంటుందా…..?
మురళీధర్ గారు ఒప్పుకుంటారా…?చూద్దాం
ఏమి జరుగుతుందో……
ఇంకా ఉంది……
కీప్ రీడింగ్……..
Swipe left/right or tap the sides to turn pages