New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పరిచయమే పరవశమై 💘 – 1

పరిచయమే పరవశమై 💘 – 1

కాలేజ్ క్యాంపస్ – ఉదయం 9 గంటలు 

అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంది మెయిన్ గేట్ దగ్గర ఫుల్ రష్. ఒకవైపు కొత్తగా వచ్చిన జూనియర్స్ కళ్ళలో భయం, ఇంకోవైపు వాళ్ళని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్న సీనియర్ గ్యాంగ్స్. కారిడార్స్ మొత్తం అరుపులు, కేకలతో మారుమోగిపోతున్నాయి……..
కొంతమంది సీనియర్స్ జూనియర్స్ ని ఆపి, “ఏయ్! డ్యాన్స్ చెయ్.. మంచి పాట పాడు.. మా బ్యాగ్స్ పట్టుకో” అంటూ ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ ర్యాగింగ్ చేస్తున్నారు.  జూనియర్స్ పాపం భయంతో సీనియర్స్ ను చూసి వణికిపోతున్నారు. ఎంతైనా కాలేజ్ ఫస్ట్ డే కదా వాళ్ళు చెప్పింది చేయకపోతే ఎక్కడ పనిష్ చేస్తారో అని వాళ్ళ భయం అందుకే వాళ్ళు చెప్పింది నో అనకుండా చేస్తున్నారు………. 
సరిగ్గా అప్పుడే ఆ రౌడీ సీనియర్స్ గ్యాంగ్ ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని పట్టుకుని ఏడిపిస్తున్నారు. అది చూసి అందరూ జాలిగా ఫేస్ పెట్టుకున్నారు తప్పా ఎవరు క్వశ్చన్ చేయలేదు అప్పుడే  కారిడార్ చివర నుండి ఒక అబ్బాయి చాలా క్యాజువల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు….  నోటిలో ఒక బబుల్ గమ్, భుజానికి ఒక వైపు మాత్రమే తగిలించుకున్న బ్యాగ్. రఫ్ గా ఉన్న బియర్డ్ సిల్కీ హేర్ & వైట్ స్కిన్ టోన్ తో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు 
అతనే ఆర్యన్…….. 
ర్యాగింగ్ చేస్తున్న సీనియర్స్ ఆర్యన్ ని చూడగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు…… అందులో ఒకడు 
ఒరేయ్.. ఆర్యన్ వస్తున్నాడు, ఆపేయండిరా!  అనగానే అందరూ ఆర్యన్ ను తన షార్ప్ ఐస్ చూసి కామ్ అయిపోయారు… ఆర్యన్ ఆ సీనియర్ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి ఎమ్ మాట్లాడడు హ్యాండ్స్ పాకెట్ లో పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ కళ్లలోకి చాలా తీక్షణంగా &  సీరియస్ లుక్స్ విసురుతాడు ఆ చూపులో ఒక రకమైన వార్నింగ్ కనపడగానే …… ఆర్యన్ చూపును తట్టుకోలేక సీనియర్స్ తడబడుతూ “ఆ.. అది.. ఆర్యన్. జస్ట్ ఫన్ చేస్తున్నాం రా..” అని నవ్వుతూ అందంగా కవర్ చేయడానికి ట్రై చేస్తాడు బట్ ఆర్యన్  ఇంకా అలాగే చూస్తూ ఒక్క అడుగు ముందుకు వేస్తాడు అంతే ఆ సైలెన్స్‌కే భయపడి ఆ గ్యాంగ్ వెనక్కి తగ్గుతుంది. మెల్లగా సీనియర్ తన గ్యాంగ్‌తో పదరా.. వీడితో పెట్టుకుంటే మనకి తేడా కొడుతుంది. వెళ్ళిపోదాం ……..
ఆర్యన్ జూనియర్ భుజం మీద చేయి వేసి  సీనియర్స్ వైపు చూసి ఒక చిన్న యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ…….. ఏంట్రా.. ఫస్ట్ డే నే ఇంత అతి చేస్తున్నారా? ర్యాగింగ్ అంటే సరదాగా ఉండాలి కానీ వాడి కళ్ళల్లో నీళ్లు వచ్చేలా ఉండకూడదు….. గెట్ లాస్ట్ అంటూ సీరియస్ గా చెప్పగానే ఆ సీనియర్స్ ఆర్యన్ వాయిస్ కి అక్కడి నుండి ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు……. ఆర్యన్ కేవలం టాపర్ మాత్రమే కాదు కాలేజ్ ప్రెసిడెంట్  అండ్ ఆల్సో హ్యాండ్సమ్ స్టూడెంట్ ఆఫ్ ది కాలేజ్ ! సో అందుకే ఆర్యన్ అంటే కాలేజ్ లో ఉన్న అందరికీ భయం …….. 
ఆర్యన్ భయపడుతున్న జూనియర్స్ వైపు లుక్ విసిరి తల దించుకుని ఉంటే ఎదుటివాడికి నీ భయం మాత్రమే కనిపిస్తుంది అదే తల ఎత్తి వాడి కళ్లలోకి చూడు  నీలోని ధైర్యం వాడికి భయం పుట్టిస్తుంది ఆర్యన్ మాటలకు జూనియర్స్ కి కొంచెం ధైర్యం రావడంతో థాంక్స్ అన్న టైం కి వచ్చి హెల్ప్ చేసారు కానీ వాళ్లు మళ్ళీ వస్తారేమో అని భయంగా ఉంది…….. 
ఆర్యన్ జూనియర్ భుజం తట్టి ఈ కాలేజీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడూ ఇక్కడ గెలవడానికి రావాలి కానీ ఎవరికో భయపడటానికి కాదు. రేపటి నుండి నిన్ను ఎవరైనా ఆపితే  వాడికి నా పేరు చెప్పకు నీ పేరే వాడికి గుర్తుండిపోయేలా సమాధానం చెప్పు. నీ వెనుక నేనున్నాను వెళ్లు !! అంటూ యాటిట్యూడ్ గా చెప్పగానే జూనియర్స్ ధైర్యంగా తమ క్లాస్ కి వెళ్ళిపోతారు…….
ఆర్య అంటూ వెనుక నుండి వినిపించిన తన ఫ్రెండ్ వాయిస్ హాయ్ రిషి అంటూ తన ఫ్రెండ్స్ ఉన్న వైపు వెళతాడు ఆర్యన్ సరిగ్గా అప్పుడే వైట్ కలర్ రోల్స్ రాయ్స్ కార్ చాలా స్లోగా & సైలెంట్‌గా కాలేజ్ పార్కింగ్ లాట్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ కార్ లో ఎలాంటి మ్యూజిక్ లేదు  కానీ ఆ కారు ఇచ్చే రాయల్ లుక్కే వేరు…… కారు వచ్చి ఆగగానే అందరూ ఎవరా అని చూస్తున్నారు……… 
                అలా చూస్తూ వుండగానే కారు డోర్ ఓపెన్ చేసుకుని అందమైన అమ్మాయి  బయటకి దిగింది. రెడ్ కలర్ డిజైనర్ ఫ్లోరల్ ఫ్రాక్ చేతికి ‘Apple Watch Ultra’, భుజానికి ‘Louis Vuitton’ బ్యాగ్.  తన వైపు చూస్తూనే  తెలుస్తుంది తను ఒక “Millionaire’s Daughter” అని….. 
తను కారు దిగి, డ్రైవర్ సీట్ లోంచి తన పెయింటింగ్ కాన్వాస్ ని, బ్రషెస్ , కలర్స్ ఇంకా బుక్స్ పట్టుకుని కార్ పార్క్ చేసి లోపలికి వెళుతుంది……. తను ఎవరినీ తక్కువ చేసి చూడదు అలాగని ఎవరికీ ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వదు ఒక్క మాటలో చెప్పాలంటే తనది ఒక రకమైన  Silent attitude & dignity అనచ్చు …….. తన పేరు అన్విక ❤️ 
ఆర్యన్ తన గ్యాంగ్‌తో క్లాస్ కి ఇంకా టైమ్ ఉండడం తో బెంచ్ మీద కూర్చుని తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు అన్విక మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే గాలికి తన చేతిలో ఉన్న పెయింటింగ్ బోర్డ్ ఎగిరి  ఆర్యన్ షూస్ మీద పడి, ఆ తర్వాత తన కాళ్ళ దగ్గర ఆగుతుంది……..
అన్విక కంగారుగా ఓ మై గాడ్.. సారీ! అని వంగి తీసుకోబోతుండగా  ఆర్యన్ ఆల్రెడీ ఆ బోర్డ్ ని తన చేతి వేళ్లతో మెల్లగా పైకి లేపి  చేత్తో పట్టుకుంటాడు. దాన్ని తీసి చూడగానే ఆర్యన్ కళ్ళలో చిన్న నవ్వు తను తాగుతున్న కాఫీ కప్ కూడా  పక్కన పెట్టేశాడు……..
ఆర్యన్ కి నచ్చేంతలా ఆ పెయింటింగ్ లో ఏముందంటే… “ఒక చిన్న పాప చేతిలో అమ్మ పాత గాజులు ఉన్నాయి. ఆ గాజలలో ఆ పాపకి అమ్మ ముఖం కనిపిస్తోంది. ఆ పాప ఏడవట్లేదు  కానీ ఆ గాజులు పట్టుకున్న తన చేతి నుండి రక్తం కారుతోంది  అంటే అమ్మ జ్ఞాపకం కోసం ఆ పాప ఎంతటి బాధనైనా భరిస్తుంది అని దాని అర్థం……
అన్విక పెయింటింగ్ తీసుకోవడానికి చెయ్యి చాపుతుంది. ఆర్యన్ అది ఇవ్వకుండా, ఆ పెయింటింగ్ లోని ఆ  బ్లడ్ స్టెయిన్స్ ని తన వేలితో తాకుతూ ఆ పెయింటింగ్ వెనుక డెప్త్ ను ఫీల్ అవుతూ చెప్పడం చూసి అన్విక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కాలేజీలో అందరూ తన అందాన్ని, డబ్బుని మాత్రమే చూశారు.. కానీ ఈ అబ్బాయి తను గీసిన ‘పెయిన్’ ని చూశాడు……. 
అన్విక తడబడుతూ అది.. అది నా పర్సనల్ పెయింటింగ్. గివ్ ఇట్ బ్యాక్ అంటూ లో వాయిస్ తో చెప్పగానే తన ఎదురుగా & దగ్గరగా వినిపించిన క్యూట్ వాయిస్ కి తల పైకి ఎత్తి చూసిన ఆర్యన్ కి అపరంజి బొమ్మ లా ఉన్న అన్విక కనిపించి ఒక్క క్షణం తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు తన ఎదురుగా తనకు ఎవరూ కనిపించడం లేదు అన్విక తప్పా ఎంతో మంది అమ్మాయిలను చూసిన కలగని ఫీలింగ్ అన్విక ను చూసి కలుగుతుంటే తనను అలా చూస్తూ చుట్టూ మర్చిపోయాడు……… 
హలో మిస్టర్ అని వినిపించిన అన్విక వాయిస్ కి తేరుకుని తన వైపు ఓ క్యూట్ ఇస్తూ పెయింటింగ్ వేసే ప్రతీ ఒక్కరూ ఆర్టిస్ట్ అవ్వరు కానీ కళ్లలోని నీటిని రంగులుగా మార్చి, కాన్వాస్ మీద బాధ ని గీయడం చేతనైనవాడు  మాత్రమే ఆర్టిస్ట్’ అవుతాడు…… అన్విక ఆర్యన్ మాటలకు తన వైపు చూస్తూ ఉంటుంది……….
చాలా మంది అమ్మ ముఖాన్ని గీసి ఆవిడ అందాన్ని చూపిస్తారు కానీ నువ్వు అమ్మ వదిలి వెళ్లిన ఆవిడ జ్ఞాపకాన్ని ఆవిడ లేని లోటుని చూపావ్ ఈ పెయింటింగ్ లో ఆవిడ ముఖం లేకపోయినా నాకు అమ్మ ప్రేమే కనిపిస్తోంది. This is not just art,  It’s a feeling. నీ 
ఆర్ట్ అద్భుతంగా ఉంది.. కానీ ఆ ఆర్ట్ వెనుక ఉన్న నువ్వు అంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నావ్  అంటూ కళ్ళు ఎగరేస్తాడు……..
అప్పటి వరకూ నవ్వుతున్న అన్విక మొహం ఎర్రబడ్డం తో ఆర్యన్ చేతుల్లో ఉన్న  బోర్డ్ లాక్కున్నట్టు తీసుకుని ఒక సెకండ్ ఆర్యన్ కళ్లలోకి చూసి.. చుట్టూ ఉన్నవాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది…… 
ఆర్యన్ వెళ్తున్న అన్విక వైపు చూస్తూ తన ఫ్రెండ్స్ వైపు తిరిగి రేయ్.. ఇప్పటివరకు ఈ కాలేజీలో చాలా మంది అమ్మాయిలను చూశా బట్ ఈరోజే ఒక  అద్భుతాన్ని ని చూశాను She is special రా!” 
అన్విక వెళ్ళిపోయాక కూడా ఆర్యన్ ఇంకా తనని చూస్తూనే ఉంటాడు అది చూసిన తన ఫ్రెండ్స్  షాక్ లో చూస్తుంటారు ఆర్యన్ ఎంటలా స్టన్ అయిపోయావ్ ఏంట్రా జస్ట్ ఒక్క చూపుకే పడిపోయావా ఏంటి ……. ?? 
      ఆర్యన్ ఆన్సర్ ఇవ్వకుండా నవ్వడం చూసిన తన ఫ్రెండ్ రిషి ‘ పిచ్చి వేషాలు వేయకు ఆర్యన్ యూ నో హు ఇస్ షి? బిజినెస్ టైకూన్ మహేంద్ర తెలుసు కదా ఆ అమ్మాయ్ తన కూతురు! సో మనకి, వాళ్ళకి అసలు సంబంధమే లేదు…..  తను ఒక అందమైన కల.. దాన్ని చూసి వదిలేయాలి అంతే!! తన ఫ్రెండ్  మాటలకు 
ఆర్యన్ మెల్లగా వాళ్ల వైపు తిరిగి  చాలా కాన్ఫిడెంట్‌గా & యాటిట్యూడ్ గా నవ్వుతూ ఒక్క చూపుకి పడిపోవడానికి తను ఏమైనా అందరూ అమ్మాయిల్లా అనుకున్నావా నో తను ఒక అద్భుతం ……… 
అందరూ తన తండ్రికున్న ‘మహేంద్ర’ అనే పేరుని చూస్తున్నారు  కానీ నేను ఆ పేరు వెనుక హైడ్ అయి ఉన్న ఒక అమాయకమైన  అన్విక’ని చూశాను…… 
అంటే.. నిజంగానే లవ్ లో పడిపోయావా? 
ఆర్యన్ చాలా సీరియస్ గా లవ్ లో పడటం కాదురా తనని నా ప్రాణంలో కలిపేసుకున్నా తన ఫాదర్ మహేంద్ర అయితే ఏంటి తను బిజినెస్ డాటర్ అయ్యి ఉండచ్చు  కానీ ఈ ఆర్యన్ మనసుకి తను మాత్రమే మహారాణి She is Mine. తను ఎవరి కూతురనేది నాకు అనవసరం తను నాది అనేది నా నమ్మకం ……..   
అవతల ఉన్నది సముద్రమైనా సరే  నా పడవ ప్రయాణం తన వైపే! రాసి పెట్టుకోండిరా.. తను మహేంద్ర కూతురు కావచ్చు, కానీ త్వరలో ఆర్యన్ గాడి పెళ్ళాం అవుతుంది !! ఆర్యన్ కాన్ఫిడెన్స్ చూసి తన ఫ్రెండ్స్ అందరూ నోరు తెరిచి చూస్తూ ఉంటే ఆర్యన్ నవ్వుకుంటూ కాలేజ్ లోకి వెళ్ళిపోతాడు……..
అన్విక ఆర్యన్ నుండి తన పెయింటింగ్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత తన పెయింటింగ్‌ను సబ్మిట్ చేసి ఒంటరిగా లైబ్రరీ లో కూర్చుని ఉంటుంది.అన్విక చేతులు ఇంకా వణుకుతూనే ఉంటాయి. తను ఆర్యన్ కళ్లలోకి చూసిన ఆ క్షణం తన మైండ్‌లో రిపీట్ అవుతూ ఉంటుంది. తను తన లైఫ్ లో ఎంతో మంది రిచ్ కిడ్స్‌ని, పొగరున్న వాళ్లని చూసింది.. కానీ తన పెయింటింగ్‌లో ఉన్న అమ్మ ప్రేమ ను గుర్తుపట్టిన వాడు ఆర్యన్ ఒక్కడే……..
ఆర్యన్ తన పెయింటింగ్ చూసి అన్న మాటలు అన్విక మైండ్‌లో ఒక లూప్ లా తిరుగుతున్నాయి. తను మరో పెయింటింగ్ వేయడానికి బ్రష్ పట్టుకుంటుంది కానీ మనసు మాత్రం ఆర్యన్ కళ్ల దగ్గరే ఆగిపోయింది హు ఇస్ హి ? అందరూ నా చుట్టూ ఉన్న అందరూ నా లక్సరీ లైఫ్ ను చూస్తే తను మాత్రం నా పెయింటింగ్‌లో ఉన్న లెగసీ ని చూశాడు…… That’s strange… and beautiful.” 
అప్పుడే ఆర్యన్ అన్విక ను వెతుకుతూ అక్కడికి వస్తాడు తను చాలా క్యాషుయల్ & కూల్ గా నడుచుకుంటూ  ఆ రూమ్ లోకి రాగానే ఒక రకమైన పాజిటివ్ ఔరా క్రియేట్ అవుతుంది ఏదో డీప్ థింకింగ్ లో ఉన్న అన్విక ను చూసి ఇన్ కంప్లీట్ గా వదిలేస్తే… అది ‘Art’ అవ్వదు అకేవలం ఒక ‘Attempt’ మాత్రమే అవుతుంది ………
అన్విక ఆ వాయిస్ కి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. ఆర్యన్ తనకి చాలా దగ్గరగా నిలబడి ఉంటాడు అది చూసి పైకి లేచి నుంచుంటూ నువ్వు మళ్ళీ వచ్చావేంటి? అండ్ వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ?? 
“I’m not following you  I’m just following my Intuition. నీ పెయింటింగ్‌లో ఉన్న ఆ పెయిన్ నే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది 
లుక్ మిస్టర్ మా డాడ్ ఎవరో నీకు తెలుసా? హి ఈజ్ మహేంద్ర అని తను చెప్తూ ఉంటే ఆపమన్నట్టు చెయ్ చూపిస్తూ ఐ డోంట్ వాంట్ టు నో అబౌట్ యార్ ఫాదర్  నాకు కావాల్సింది నీ కళ్లలో ఉన్న ఆ స్పార్క్ …..  నీ చుట్టూ ఉన్న ఈ గోల్డ్ నీకు ప్రొటెక్షన్ ఇవ్వొచ్చు కానీ నీ లోపల ఉన్న కోల్డ్ ని కరిగించలేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్ కెన్ డు దట్ 
నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావ్……… ?? 
లేదు… నేను చాలా  క్లియర్ గా మాట్లాడుతున్నాను   నీ లైఫ్ లోకి చాలా మంది ఆప్షన్ లా రావచ్చు… కానీ నేను మాత్రం నీకు ఓన్లీ ఛాయిస్ లా మిగిలిపోతాను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటూ తన చేతిలో ఉన్న ఒక  చాక్లెట్  అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు…….