ప్రణయం శరణం గచ్ఛామి – 2
ఎపిసోడ్ 2:
ప్రజ్వల మాటలు వింటూనే హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనసు కరిగిపోయింది. కాస్త ముందుకు వంగి ఎంతో ఆప్యాయంగా చూశారు.
“ఎందుకమ్మా నీకింత స్ట్రగుల్? నువ్వు నా బంగారుతల్లివి కదా.. ఈ తాతయ్య ఉన్నాడుగా నీకు! నేను చెప్పేది ఒక్కసారి విను తల్లీ.. నీ చేతికి మట్టంటకుండా నీ ప్రాబ్లమ్స్ అన్నీ చిటికెలో సాల్వ్ చేసేస్తాను. నువ్వు జస్ట్ ఒక్కమాట ‘ఊ’ అనాలే కానీ.. అంతా నేను చూసుకుంటాను!” చాలా బాధగా అన్నారు.
ప్రజ్వల మొహంలో కృతజ్ఞత కనిపించినా, ఆమెలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గలేదు.
“వద్దు తాతయ్యా.. ఆ మాట అనకండి,” చాలా కూల్‌గా, అంతే క్లియర్‌గా అంది ప్రజ్వల.
“ఆరోజు మీకు హెల్ప్ చేశానని చెప్పి, ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని రిటర్న్ లో ఏదైనా అడిగితే.. అది హెల్ప్ ఎలా అవుతుంది తాతయ్యా?
మీ ప్రాణాలకు నేనేదో రేట్ కట్టి, మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టే అవుతుంది కదా! నా కాళ్ల మీద నేను నిలబడాలన్నదే నా గోల్. సారీ తాతయ్యా.. నన్ను తప్పుగా అనుకోకండి.”
చిన్నగా నమస్కారం పెట్టి, సైలెంట్‌గా తన రూమ్‌లోకి వెళ్లిపోయింది ప్రజ్వల.
ఆమె వెళ్లిన వైపే గర్వంగా చూస్తూ ఉండిపోయారు హరిశ్చంద్ర ప్రసాద్.
‘ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా రేర్.. అందుకే నువ్వు నా మనసు గెలుచుకున్నావ్! నిన్ను ఎవరి ముందూ తలదించుకోనివ్వను.. ఎలాగైనా నిన్ను ఒప్పించి తీరుతాను!’ అని మనసులో అనుకున్నారు..
అప్పుడే అక్కడికి వొచ్చిన కనకం..
“అయ్యా..నేనొక మాట చెబుతాను.. ఏమనుకోకండి.. మీ మనసులో ఉన్న ఆ మాటేంటో అమ్మాయిగారికి చెప్పి చూడండయ్యా.. ఇలా మీలో మీరు బాధపడుతుంటే ఎలా చెప్పండి..” అని అంది..
హరిశ్చంద్రప్రసాద్ ఇంట్లో ఆయన పెళ్ళయినపుడు తన భార్యతో పుట్టింటి నుంచి ఒచ్చి ఇక్కడే ఆయమ్మగా పని చేస్తూ ఉండిపోయింది.. ఆమె ఆయమ్మ అనే కంటే ఇంటి మనిషీ అన్నంత ఇదిగా ఉంటుంది..ఇక రాజావారి ఫ్యామిలీ కూడా ఆమెను అలాగే గౌరవిస్తారు..
“ఎలా అడుగుతాను కనకం..నా ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయికే నేను ఋణపడి ఉన్నాను.. ఆ పిల్ల సంస్కారం నచ్చి నేను ఏదైనా సాయం చేద్దామంటే.. దానికి దీనికి లెక్క కట్టలేనూ అంటుంది.. అలాంటిది సాయం చేసిన ఆ పిల్లనే మరో సాయం ఎలా అడగనూ..” అని బాధపడతారు రాజావారు..
“నిజమే బాబు గారు కానీ..ఆ పిల్ల అలా అనుకోదు..చూస్తుంటే బ్రతికి చెడ్డ కుటుంబంలా ఉంది..మీరు చెబితే తను అర్థం చేసుకుంటుందనిపిస్తుంది”
ఆ మూమెంట్‌లో.. ప్రజ్వల అసలు తన లైఫ్‌లోకి ఎలా వచ్చిందో ఆయన కళ్ల ముందు రీల్ లాగా తిరిగింది.
కరెక్ట్‌గా నెల రోజుల క్రితం..
ఢిల్లీలో తన ఫ్రెండ్ మనవరాలి మ్యారేజ్‌కి వెళ్లిన రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు, రిటర్న్ జర్నీలో ట్రైన్ ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేలో వస్తున్నారు. ఏదో స్టేషన్‌లో ట్రైన్ ఆగింది. ఆయన బిజినెస్ కాల్స్‌లో చాలా బిజీగా ఉన్నారు.
సరిగ్గా అప్పుడే.. ఒక అమ్మాయి ఊపిరి పీల్చుకోలేనంత టెన్షన్‌తో గబగబా ఆ బోగీలోకి ఎక్కేసింది. భయంతో వణికిపోతోంది.
ఆయన ఫోన్ పక్కన పెట్టి అనుమానంగా చూశారు.
ఆమె చేతులు జోడించి, “సార్.. ప్లీజ్.. నన్ను సేవ్ చేయండి! కొందరు రౌడీలు నన్ను వెంబడిస్తున్నారు సార్.. ప్లీజ్!” అంది భయపడుతూ.
సిట్యుయేషన్ అర్థం చేసుకున్న రాజావారు, “టెన్షన్ పడకమ్మా.. ముందు కూర్చో, ఈ వాటర్ తాగు” అంటూ వాటర్ బాటిల్ ఇచ్చారు.
కొంచెం కూల్ అయ్యాక, “ఎవరమ్మా నువ్వు? ఈ రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావ్?” అని అడిగారు.
“నా పేరు ప్రజ్వల సార్. రేపు మార్నింగ్ హైదరాబాద్‌లో చాలా ఇంపార్టెంట్ జాబ్ ఇంటర్వ్యూ ఉంది. స్టేషన్‌కి వస్తే కొందరు రౌడీలు వెంటపడ్డారు.
వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఏమీ తోచక ఈ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కేశాను. నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగిపోతాను సార్.. ప్లీజ్,” అంది అమాయకంగా.
చూడగానే అమాయకమైన చక్కని రూపం…ఆమె మాటలు, పద్ధతి చూసి ఆయనకు పూర్తి నమ్మకం కుదిరింది. “పర్లేదులేమ్మా.. నువ్వేం దిగనక్కర్లేదు, కూర్చో,” అన్నారు.
తర్వాత టీసీ రావడం, రాజావారే ఫైన్ కట్టి సీట్ అడ్జస్ట్ చేయడం జరిగిపోయాయి. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయన బిజినెస్ కాల్స్‌తో బిజీగా ఉండగా.. ప్రజ్వల కాస్త రిలాక్స్ అయి నిద్రలోకి జారుకుంది. చివరకు రాజావారు కూడా నిద్రపోయారు.
కానీ.. సరిగ్గా ఓ గంట తర్వాత..
ట్రైన్ బోగీలో ఏదో మూలుగు వినిపించి ప్రజ్వల ఒక్కసారిగా కళ్లు తెరిచి భయంగా చుట్టూ చూసింది..
ఎదురుగా చూస్తే.. రాజావారు ఛాతీ గట్టిగా పట్టుకుని విలవిల్లాడిపోతున్నారు. బాడీ మొత్తం స్వెట్టింగ్‌తో తడిసిపోయింది. మాట రావడం లేదు.
వెంటనే లైట్ వేసిన ప్రజ్వల
“సార్! సార్.. ఏమైంది సార్?!” కంగారుగా అయన దగ్గరికి వచ్చింది.
“నొ..నొప్పి.. గుండెల్లో చాలా పెయిన్‌గా ఉంది..” అన్నారు కష్టంగా.
చూస్తుంటే సివియర్ హార్ట్ ఎటాక్ లా ఉంది..
ఆ క్షణంలో ప్రజ్వల ఏమాత్రం ప్యానిక్ అవ్వలేదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగింది.
ట్రైన్ ఆగడం, రైల్వే హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి అంబులెన్స్ రప్పించడం, దగ్గర్లోని పెద్ద హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
డాక్టర్లు ఆయన్ని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఆ కొత్త ఊళ్లో ఆయనకు తోడుగా ఎవరూ లేరు. అలా వదిలేసి వెళ్లడం ఇష్టం లేక రెండు రోజులు అక్కడే ఉండి, ఏ లోటూ లేకుండా చూసుకుంది.
ఎవరైనా అనుమానించకుండా ఉండటానికి.. “నేను ఆయన మనవరాలినండి” అని చెప్పి, ఆయన్ను ‘తాతగారు’ అని పిలవడం స్టార్ట్ చేసింది.
కానీ, ఆ మూడు రోజులు అక్కడే ఉండిపోవడం వల్ల హైదరాబాద్‌లో ఆమె లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన జాబ్ ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది!
ఆ విషయం తెలిశాక రాజావారు చాలా ఫీలయ్యారు. డిశ్చార్జ్ అయ్యాక ఆమెను బలవంతంగా తనతో పాటు ఇంటికి తీసుకొచ్చేశారు.
ఫోన్‌లో మెడిసిన్ అలారం మోగడంతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చారు రాజావారు.
టైమ్‌కి తను సేవ్ చేయకపోతే.. ఈరోజు తాను బతికేవాడే కాదు.
తన కంపెనీలోనే మంచి పొజిషన్‌లో జాబ్ ఇస్తానంటే.. “ప్రాణాలు కాపాడినందుకు బిజినెస్ చేస్తానా తాతగారూ? రికమండేషన్స్ తో వచ్చే జాబ్ నా సెల్ఫ్ రెస్పెక్ట్‌కి సెట్ అవ్వదు. నా టాలెంట్‌తోనే సాధించుకుంటాను” అని మొహం మీదే చెప్పేసింది.
ఈ వన్ మంత్‌లోనే ఆమె ఆ ఇంటికి ప్రాణంగా మారిపోయింది. ఆయన డైట్, బీపీ, టైమ్‌కి మెడిసిన్స్ అన్నీ తానై చూసుకుంటోంది. ఇంటి పనులను సెట్ చేసి ఆయనకు వర్క్ బర్డెన్ లేకుండా చేసింది.
బ్లడ్ రిలేషన్ లేకపోయినా.. నెల రోజుల్లోనే ఆయనకు ప్రాణం కంటే ఎక్కువైపోయింది ప్రజ్వల..
ఇంతలో “తాతగారూ.. అలారం మోగింది టాబ్లెట్ వేసుకున్నరా?” అని అడుగుతూ లోపలికి వచ్చింది ప్రజ్వల.
“ఇప్పుడే తల్లి మోగింది.. అయినా నేను వేసుకుంటాను కదా నీకెందుకు అమ్మా శ్రమా? అని నొచ్చుకుంటూ అన్నారు రాజావారు..
“ మీరు వాడే మెడిసిన్స్ వల్ల మీకు నిద్ర వస్తుంది..ఒకవేళ అలారం మోగినా మీకు మెలకువ రాకపోతే కష్టం కదా తాతగారు..” అని పక్కనే టేబుల్ మీద ఉన్న ఆ టైం కు వేసుకోవాల్సిన మెడిసిన్ తీసి ఆయన చేతిలో పెట్టింది ప్రజ్వల..
ఆమెను అలాగే చూస్తున్న రాజావారు..
‘ ఈ అమ్మాయిని ఎప్పటికీ నా ఇంట్లోనే ఒక క్వీన్‌లా ఎలా ఉంచుకోవాలి?’ అని ఆలోచిస్తున్న రాజావారికి సడన్‌గా ఇంతకు ముందు కనకం తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి..
ఇంతకీ రాజావారి మనసులో మాట ఏంటి కనకం దేని గురించి మాట్లాడింది ఆ మాట అడగడానికి రాజుగారు ఆయన ఎందుకు వెనక ముందు అవుతున్నారు?
నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం!
ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే Follow చేసి, మీ Rating అండ్ Comment పెట్టండి ప్లీజ్.. థ్యాంక్యూ!
Swipe left/right or tap the sides to turn pages