హిట్లర్ హస్బెండ్ – 1
గోదావరీ అనుకున్నారు కదా!
కాదు కృష్ణమ్మ గట్టున మా ఊరు.
పేరు తడిగడప.
( ఈ ఊరు నిజంగా ఉంది, కానీ అక్కడ నేను చెప్పే ఇళ్లు గుళ్ళు బళ్ళు అన్ని కల్పితం)
అందంగా! రెడీ అయ్యేసి, అలా నేను మా ఊరి పొలం గట్టు మీద, భానుడు పూర్తిగా నా చందమామ సగంగా కనిపిస్తుంటే, లేలేత చెరుకుగడ తీసుకుని, భుజాల మీదగా వేసి, లంగా ఓణీ చెంగు అలా నడుములో దోపుకుంటూ తిరుగుతూ ఉంటే,
ఆహారానికి వెళ్తున్న పిచ్చుకలు నాకు హాయ్ చెప్తుంటే,
ఆవులు గేదెలు గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి.
అలా పొలం మొత్తం తిరుగుతూ ఆ చల్లని ఉదయాన్ని మనఃపూర్తిగా ఎంజాయ్ చేస్తున్న నా ముందు ఒక పడవ లాంటి కార్ వచ్చి ఆగింది.
అందులో నుండి ఒక మనిషి దిగుతాడు అనుకుంటే, ముందు గా పొడవాటి నల్ల ప్యాంట్ వేసుకుని బ్లాక్ బూట్ ఉన్న కార్ బయటికి నా కళ్ళకి కనిపించింది.
అంతే నా కళ్ళు ఇంకాస్త పెద్దగా అయితూ ఈ పడవలాంటి కారులో నుండి దిగుతున్న ఆ జిరాఫీ ఎవరబ్బా అని అనుకుంటూ ఉండగా కార్ డోర్ ఇంకొంచెం ఓపెన్ చేసి బయటికి మొహం పెట్టి కళ్లకున్న కాస్ట్లీ కళ్ళజోడు అనుకుంటా తీసేసేలోపు నా మొహం మీద నీళ్లు పడ్డాయి నేను ఉలిక్కిపడి లేచాను.
ప్రతిరోజు ఇంత వరకే వస్తుంది ఆ కల కానీ అందులో వచ్చి ఆ హీరో గారు ఎవరా అని ఎన్నిసార్లు తెలుసుకుందాం అనుకున్నా ఇక్కడ అంతవరకు నేను పడుకుంటే కదా ఆ లోపు మెలకువ వచ్చేలాగా చేసేస్తారు మరి.
చిన్నప్పటినుండి నా కళ్ళతో చూస్తున్న అదే రూపం కళ్ళముందు కనిపించేసరికి గుడ్ మార్నింగ్ పెద్దమ్మ అని చెప్దాం అనుకున్నా కానీ అలాంటి అలవాట్లు మనకు లేవు ఇచ్చిన వాళ్లు తీసుకోరు కాబట్టి మొహాన్ని నార్మల్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఇంకా తెల్లవారలేదు కదా పెద్దమ్మ అని అడిగాను నేను.
అంటే సూర్యుడు నన్నెత్తి మీదికి వచ్చేదాకా పడుకునే ఉంటావా మా మహారాణి నీవల్ల అక్కడ పిల్లలకి స్కూల్స్ లేట్ అవుతున్నాయి అని గదిని వెళ్లిపోవడంతో,
మీరేదో నేను వాళ్ళని నా సొంత బెంచ్ కారులో డ్రాప్ చేస్తాను అనుకునేరు అంతలేదు టిఫిన్స్ చేసి లంచ్ బాక్సులు కట్టాలి కదా అందుకు లేపారు నన్ను.
సరేలే! పడుకున్నా పక్కా అన్న మెడతేసి కొంచెం మొహాన నీళ్లు కొట్టుకొని తల తలా మెరిపించి పోదాం అనుకునే లోపు మా పెద్దత్త చిన్నత్త వచ్చి ఏంటమ్మా ఇంకా తెల్లవార లేదా నీకు నిన్న రాత్రి చెప్పినట్లు గుర్తు ఈరోజు పెళ్లికి వెళ్లాలి మా పట్టు చీరలు ఐరన్ చేయమని ఇప్పుడు వీటి కోసం మా నిద్ర మానుకొని పొద్దున్నే వచ్చి నిన్ను లేపాలా అంటూ ఇద్దరూ ఒకేసారి సరిచేసరికి అయ్యో వస్తున్నాను కదా అత్తయ్య పది నిమిషాలు అని చెప్పి లేవబోతుంటే,
అక్కడికి వచ్చాడు మా పెద్ద అత్తయ్య భర్త.
ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా అని ఆయన అడిగేసరికి ఆ ప్రశ్నలో ఎలాంటి వెకిలి ఉందో అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లని అయితే కాదు కాబట్టి చురుగ్గా ఒక చూపు చూసి తల పక్కకి తిప్పుకుంటే స్నానం చేయాలి వచ్చి వేడి నీళ్లు తోడుదురా అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇదేంటో మా వాళ్ళకి నేనంటే ఎంత ఇంపార్టెంట్ నో.
నేను లేకపోతే ఏవీ జరిగేలా లేవు అబ్బా దేవుడా ఎంత వాల్యూడ్ పర్సన్ ని పుట్టించాలయ్యా నువ్వు శివయ్య సూపర్ అసలు అంటూ ఎవరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పకపోయినా లక్ష్మికి చెప్పాలి కాబట్టి ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ లక్ష్మి అని చెప్పేసరికి నా భాష దానికి అర్థం అవుతుందా పడ కానీ నా కళ్ళల్లో భావాలు అర్థం అయినట్లు తలని అటూ ఇటూ ఊపి నా చేతిని నాకింది.
మీరు మళ్లీ లక్ష్మీ అంటే నా ఫ్రెండ్ అను చెల్లి అనుకునేరు కాదు మూడు నెలలు ముందు మా ఇంట్లో పుట్టిన ఆవు దూడ దాని పేరే నేను లక్ష్మి అని పెట్టుకున్నాను.
మామూలుగా అయితే నేను నా రూమ్ లోనే పడుకునేదాన్ని కానీ మా పెద్ద అత్తయ్య వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారు కాబట్టి వాళ్లకి రూమ్ తక్కువ అయింది కాబట్టి నారు వాళ్లకిచ్చి నేనే లక్ష్మితో బెడ్ షేర్ చేసుకున్నాను పాపం అస్సలు ఒక్క మాట కూడా అనలేదు తెలుసా నేను వచ్చాను అన్న రెస్పెక్ట్ తో ఇంకా ముడుచుకొని సగానికి సగం పైగా పాక నాకే వదిలేసి నిద్రపోయింది బుజ్జిది అంటూ ఇంకోసారి కృతజ్ఞతగా దానికి ముద్దు పెట్టి ఇక మనం డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చింది అనుకుంటూ చున్ని మెడ మీదగా రెండు పక్కల వేసుకొని వంటింట్లోకి పరుగులు అందుకుంటుంటే,
స్నానం చేయకుండా లోపలికి ఏంటి రాత్రంతా ఆ పాతలో పడుకున్నావు పేడ కంపోస్తోంది స్నానం చేసి లోపలికి అడుగు పెట్టు అని పెద్దమ్మ ఆర్డర్ వేసేసరికి ఏంటో నా ఇంట్లోకి నేనే అడుగుపెట్టడానికి ఇంతమంది పర్మిషన్ కావాల్సి వస్తుంది అనుకుంటూ డిసెంబర్ నెల మొదటి రోజు పెడుతున్న చలిని కూడా లైట్ తీసుకుంటూ చర్నీలతో ఆరోజు సోమవారం నా శివయ్యకి పూజ చేసుకోవాలి కాబట్టి తలస్నానం చేసి నాకున్న వాటిల్లో ఒక మంచి డ్రెస్ వేసుకొని వంటింట్లోకి వెళ్లాను.
అంటే మరి వేడి నీళ్లు నేను తోడుకుంటే అక్కడ క్యూలో ఉన్న ఐదు మందికి తక్కువ వచ్చేస్తే దానికోసం కూడా మళ్లీ నన్ను ఏదో ఒకటి అంటారు అవసరమా అని అనిపించింది అంతే!!
అక్క నా నోట్స్ ఎక్కడ?
వదిన నా లంచ్ బాక్స్ అయ్యిందా?
నా క్యాజువల్ షర్ట్స్ ఎక్కడున్నాయి? అంటూ ఒక్కొక్కరి నుండి వచ్చిన ప్రశ్నలకు ముందు ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాను అక్కడే ఆరని విషయం పాటు!
వెంటనే నా పచ్చని భుజం మీద చెయ్యి పడటంతో జడుసుకొని వెనక్కి తిరిగి చూస్తే???
ఫ్రెండ్స్ ఇది పండు లాంటి సెల్ఫ్ నేరేషన్ స్టోరీనే కానీ కంప్లీట్ జోనర్ అండ్ స్టోరీ లైన్ దానికి దీనికి వేరే ఉంటుంది ప్లీజ్ ఆ స్టోరీని చదివి హిట్ చేసినట్లుగా ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అప్డేట్స్ మాత్రం కచ్చితంగా మిస్ అవ్వకుండా ఇస్తాను.
ఈరోజు నా దిల్కుష్ అయ్యే కామెంట్స్ మీరు ఇచ్చేస్తే ఇంకో అప్డేట్ నైట్ నేను మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను కానీ స్టోరీ ఎలా ఉంది అసలు అక్కడున్న పేరు ఏంటి ముఖ్యంగా హీరోయిన్ పేరేంటి ఆమె లైఫ్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఉందా అసలు మీకు ఇది చదువుతానే ఎలా అనిపించింది అన్నది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నా హెల్త్ బాలేకపోయినా మీకోసం స్టోరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇది నా ప్యాషన్ కాబట్టి!!!
Continues…..
Swipe left/right or tap the sides to turn pages