New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హిట్లర్ హస్బెండ్ – 3

హిట్లర్ హస్బెండ్ – 3

సర్లే నా దురదృష్టవంతమైన మాటలు అని మీకెందుకు నాకెప్పుడూ ఉండేదే లేండి ఇప్పుడు విషయానికి వస్తే మా శివయ్యకి పూజ చేసుకొని పెదనాన్న మామయ్యలకి కూడా ఫుడ్ పెట్టేశాక మిగిలింది మళ్లీ నాకంటూ నేనొక్కదాన్నే కాబట్టి నా రూమ్ లోకి వెళ్దాం అనుకున్నాను. 

అప్పుడే ఒక పాప వాయిస్ వినపడింది పాప అంటే పాప కాదులే ఏమో నా ఏజ్ ఉంటుందో నాకంటే ఒక సంవత్సరం పెద్ద ఉంటుందో! 
హలో అన్నయ్య నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది అయ్యింది లే వామ్మో అసలు ఎంత ఇరుకుగా ఉంది తెలుసా గది అయితే పైగా బయటికి వస్తే చాలు పేడ స్మెల్ దోమలు విపరీతంగా ఉన్నాయి నువ్వు అయితే ఒక్కరోజు కాదు కదా ఒక్క గంట కూడా ఉండలేవు మంచి పని చేశావు ఫారెన్ నుండి రాగానే ఫ్రెండ్స్ తో టూర్ అని చెప్పి తప్పించుకున్నావు కానీ నాకు ఆ వీలు లేకుండా పోయింది కదా ఇక్కడ లాక్ అయ్యాను అని ఆ పిల్ల మాటలు మాత్రమే వినిపిస్తుంటే నాకు, 
ఓసిని దీనికేం పోయేకాలం ఇంత మంచిగా ఇల్లు పెట్టుకొని చుట్టూ పచ్చని పొలాలు ఎలాంటి క్రీములను దగ్గరికి రానటువంటి ఆవు పేడతో అలిగిన కల్లాపి ముగ్గులు పైగా ఇప్పుడిప్పుడే డిసెంబర్ నెల  స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మంచు ఆ వాతావరణం దగ్గర్లో అతిపెద్ద సంక్రాంతి పండగ ఉంది కాబట్టి ఊర్లో సంబరాలు ఇవన్నీ చూస్తూ కూడా ఈ పిల్ల ఈ ఊరు నచ్చలేదు అనిందంటే మామూలుది కాదు అని అనుకుని వెంటనే దుమ్ము దులిపెద్దాం అనుకున్న అమ్మో వద్దులే అసలే పెద్దత్త తోటి కోడలు కూతురు మళ్ళీ ఏమన్నా అని అరచి మా పెద్దతయ్య చెప్పి ఆవిడ మళ్లీ నన్ను ఏదో ఒక క్లాస్ పీకి ఇదంతా నాకెందుకు వచ్చినా గోలలే అంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎక్స్క్యూజ్మీ అని పిలిచింది! 
ఆ ఎక్స్క్యూజ్మీని కూడా ఫోన్లోనే ఏమోలే నన్ను కాదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే అమ్మ పనిమనిషి నిన్నే పిలుస్తున్నాను అని ఆ పిల్ల అనేసరికి నాకు ఒళ్ళు మండింది కానీ కోప్పడకూడదు కదా కోప్పడితే మనకి ఒక పూట ఫుడ్ కట్ అవుతుంది  అని వెనక్కి తిరిగి ఆ పిల్ల వైపు చూసేసరికి పాపకి బట్టలు లేవనుకుంటా మావయ్యలకి చెప్పి మా షాప్ లో నుండి ఓ డ్రస్సు మంచి పంజాబీ డ్రెస్ అన్న తీపించాలి అని అనుకున్నా ఏదో వేసుకుంది మోకాళ్ళ వరకు ఒక షార్ట్ పైన టీ షర్ట్ కానీ ఆ పిల్ల హైదరాబాద్ నుంచి వచ్చింది కదా అలాగే ఉంటదేమో అక్కడ డ్రెస్సింగ్ అని అనుకుంటూ నేను అలాగే చూస్తూ ఉంటే నాకు ఎగ్ మ్యాగీ కావాలి చేసిస్తావా అని నన్ను అడుగుతుంటే అమ్మో సోమవారం గుడ్డు తాకాల నావల్ల కాదే అని నేను ఆలోచిస్తూ ఉంటే ఫోన్ బాగా వాల్యూమ్లో పెట్టింది అనుకుంటా, 
హే పింకీ ఇంకొకరిని అడగటం ఎందుకు నువ్వు వెళ్లి చేసుకో లేదా ఏది ఉంటే అది తిను అంటూ అటు వైపు నుండి కాస్త గంభీరమైన స్వరం వినిపించేసరికి ఆ వాయిస్ ఓనరే కాబోలు ఈ పింకీ కి అన్నయ్య అని అనుకుంటూ సోమవారం ఇంట్లో నీసు వండరన్డి అని చెప్పాను నేను. 
ఇంతకీ మా పాపకు హీరో ఎవరబ్బా ఆల్రెడీ ఇక్కడ పెద్ద అత్తయ్యకు ఒక కొడుకు ఉన్నాడు కదా!!
నేను అంత పద్ధతిగా నిదానంగా చెప్తూ ఉంటే ఆవిడ మాత్రం పెనంలో ఉన్న పాప్కాన్ లాగా పాప్ అవుతూ ఇక్కడ ఏవి వండుతారు వండరు నాకు అనవసరం ప్రజెంట్ నాకైతే ఎగ్ మ్యాగీ కావాలి పని మనిషివి కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాలి వెళ్లి తీసుకొని రా పో అని చెప్పడంతో నా మనసు ససేమిరా అంగీకరించలేదు దానికి. 
పనిమనిషివి అన్నందుకు మనకేం పెద్ద బాధ లేదు కదా ఎందుకంటే మనం అదే కాబట్టి.
అందరూ ఉన్న లేనిదాని కదా నేను అందుకే అలా అంటున్నాను. 
కావాలంటే ఓన్లీ మ్యాగీ చేసుకుని తీసుకొస్తాను దయచేసి ఎగ్ మాత్రం వండను అని నేను చెప్తే విసుగ్గా చూస్తూ సరే పో ఏదో ఒకటి తీసుకురాపో అని పంపింది ఆవిడ. 
పోనీలే దీనికన్నా ఒప్పుకున్నారు ఒక మనిషి కడుపు నిండుతుంది మన మీద ఎలాంటి కోపం లేకుండా అని అనుకుంటూ లాగెట్టిన నేను తీరా కిచెన్ లో చూస్తే మ్యాగీ ప్యాకెట్స్ లేవు అయ్యయ్యో మొన్న పిల్లలకు చేసి ఇచ్చాను కదా ఇప్పుడు ఈ ప్యాకెట్స్ కోసం షాప్ వరకు వెళ్లాలా నేను? 
కానీ నా దగ్గర అంత డబ్బులు లేవే ఒకవేళ కాలేజ్ ఓపెన్ అయితే డబ్బులు అంతా అయిపోగా బస్సు పాస్ చేయించుకోవడానికి సరిపడా అమౌంట్ ని ఉంది మ్యాగీ కి ఇంత లేదన్నా ఒక 50 రూపాయలు కావాలి ఎలా అబ్బా అని నేను ఆలోచిస్తూ ఆవిడనే అడుగుదాం అనుకున్నాను మళ్ళీ ఏమైనా అంటుందా? 30 రూపాయలు కూడా మేము తర్వాత ఇవ్వలేమా అని ఫీల్ అవుతారేమో అనుకుంటూ సరేలే అప్పటికి పెదనానని అడిగి తీసుకుందాము అనుకుంటూ అంగడికి బయలుదేరాను నేను. 
మా ఊర్లో చానా షాపులు ఉన్నా కూడా మా వీధికి మాత్రం షాప్ లేదు అందుకే కాస్త దూరం నడవాల్సి వచ్చింది ఆ దారి లో అందరికీ నేను తెలుసు.
ఎప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా నేనే వెళ్తుంటా కాబట్టి వాళ్ళందరికీ నేనంటే బాగా గుర్తు అందుకే ఏమ్మా ఇలా వచ్చావు అంటూ మాట్లాడిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చున్నానే అరగంటసేపు వదిలిపెట్టరూ నన్ను నేను ఇంటికి లేటుగా వెళ్లడం మా అత్తలో పెద్దమ్మను నన్ను వేసుకోవడం ఇదంతా నాకు బాగా అలవాటే కాబట్టి దారిలో నడుస్తూనే వాళ్లకి సమాధానం ఇచ్చాను.
అసలే ఆవిడ ఆకలి  అంది లేట్ అవుతే ఏం చేస్తుందో అనుకుంటూ కానీ ఆ షాప్ కి వెళ్లే దారిలో ఒక పెద్ద చెట్టు ఉంటది ఆ చెట్టు కింద అరుగు కూడా ఉంటుంది అందులో ఒకప్పుడు అయితే తాతయ్యలు కూర్చొని మాట్లాడేవారు కానీ ఇప్పుడు అందరూ పోకిరి మొహాలే. 
వాళ్లకి కూడా నేను తెలుసు కాబట్టి ఏంటి ఐషు బయటికి వచ్చావు అని ఒకరు ఐషు ఏంట్రా చూస్తూ ఉండగానే ఇంత పెద్దది అయిపోయింది అని ఒకరు పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉంటే అవన్నీ మనకు చిన్నప్పటినుండే అలవాటు తిరిగి వాళ్ళని నేను ఏమీ అనలేను అన్నా కూడా గొడవ అవుతుంది నాకు సాయం గా వచ్చేవాళ్ళు ఎవరున్నారు అందుకే కుక్కలు మొరుగుతున్నాయి అనుకోని వాళ్ళని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అందులోని ఒకడు నా చున్ని పట్టుకొని లాగాడు.
ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీని కూడా ఆదరించండి పండులాగి బ్యూటిఫుల్ స్టోరీలే కానీ చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి ప్లీజ్!!