అభి❤️వందనం – 1
రోడ్డు మీద అందంగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయి కి అప్పుడే వెనక నుంచి కార్ హారన్ వినిపించడంతో టక్కున చిరు కోపంతో అటువైపు తిరిగి చూసింది
అంతే ఆమె చూపుకి ఒక్కసారిగా కారు నడుపుతున్న అతను షాక్ అయిపోయాడు… దానికి కారణం ఆమె కళ్ళల్లో ఉన్న స్పార్క్ నెస్
“హలో మేడం గారు ఏంటండీ మీ బాధ ఎందుకు అలా నన్నే తినేసేలా చూస్తున్నారు నేను ఓన్లీ హారనే కదా అండి కొట్టింది” అని అంటూ అతను కాస్త కారుని ఆమె ముందుకు తీసుకు వెళ్లి ఆపాడు
దాంతో అతను ఆమె కాళ్ళ వైపు .. మెడ వైపు చూసి “ఆ..లో మిస్ ఏంటి మీ కోపం నేను హారం కొడితే పక్కకు తప్పుకోమని చెప్తుంటే మీరు నా వైఫ్ అలా చురుగ్గా చూస్తే ఏంటి అర్థం “అని చిరు కోపంగా చెప్పాడు ఆమెతో అతను
“అతను అన్న దానికి ఆమె అతని చూస్తూ ఏంటి మీరు తప్పంతా నాది చేయాలనుకుంటున్నారా “అంటూ ఆమె తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ మరో వైపుకి జరుపుకుంటూ ఇంతకుముందు లాగానే కోపంగా నే చూస్తుంది
“ఓ..అవునా మీరు చెప్పేదంతా నిజమేనా మీరు చేసే దాంట్లో తప్పేమీ లేదా” అని అంటూ అతను ఆమె వైపు ఇంతకుముందు చూసిన అదే కోపపు లుక్ ఇస్తూ
“మీరు చెప్తున్నది నిజమేనా నేను చూస్తూనే ఉన్నాను నేను బస్ దిగి నడవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి .. మీరు నా వెనక రావడం నేను గమనించాను ..
“ఇప్పుడేమో మీరు హారన్ కొట్టాను పక్కకు తప్పు కోలేదు అంటూ బుక ఇస్తున్నారు తప్పు చేసింది మీరైతే తిరిగి మళ్లీ నన్నే అంటున్నారు ..”అని అంటున్న ఆ అమ్మాయి అక్కడ ఎక్కువ సేపు నిలబడి అతనితో మాట్లాడిన ప్రయోజనం లేదనుకొని ..
మౌనంగా మళ్ళీ రెండు అడుగులు వేయడంతో అతను చిలిపిగా తనలోనే తాను నవ్వుకుంటూ
ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా ఇప్పటివరకు తప్పు చేసింది నేనే పైగా మళ్లీ అమ్మాయిని నేనే అంటున్నాను ఇది తప్పురా వివేక్ అంటూ తనకు తానే చెప్పుకొని ..
ఈసారి అమ్మాయి వైపు తుంటారి చూస్తూ తన వెనుక మళ్ళీ కార్ నీ పోనీచ్చాడు అతను
తన పక్కన నడుస్తున్న ఆమె స్పీడ్ కి అనుగుణంగా కారు నడుపుతున్న అతను అనుగుణంగా కారు నడుపుతున్న అతను
మౌనంగా నడుస్తున్న ఆమె వైపు చూసి “మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుందండి ఇందాక మీ తప్పేమీ లేదు తప్పంతా నాదే మీ అందమైన జడను చూస్తుంటే అంతకుమించి కారు నా కారు ముందుకి కదలడం లేదు ..
“సో ఆటోమేటిగ్గా నేను కూడా వెళ్లలేక పోతున్నాను సో మీరు ఇంత అందంగా ఎలా పుట్టారండి ..”అంటూ అతను చెప్పుకుంటూ పోతుంటే
రోడ్డుమీద నడుస్తున్న అమ్మాయి తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ అతను పొగుడుతుంటే తన ముఖంలోనీ అందాలు మరింత మారిపోతుంది
అవేవీ గమనించనీ అతను ఆమె అందాన్ని పొగుడుకుంటూ పోతూ ఉంటే
“ఆహా చాలు చాలు అపండి అంతకంటే ఎక్కువగా మీరు నన్ను పొగిడితే మీకు ఆయుక్షిణం అంటూ ఆమె పొడవైన జడని ముచ్చటగా మూడు చుట్లు తిప్పి సగం కిందకి వదిలేసి కొప్పు కొప్పుచుట్టుకుంటూ ..
“ఇక మీరు ఇక వెళ్లొచ్చు నా వాలు జడ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు లేండి “అని ఆమె అనడంతో
అతను ముఖం నల్లగా చేసుకొని దిగులుగా “సరేనండి ఏం చేస్తాం ఎవరికి ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకే దక్కుతుంది మిమ్మల్ని చూసి తరించమని ఆ దేవుడు నా నుదుటన రాసి పెట్టాడు ..
“మిమ్మల్ని కట్టుకోబయేది ఎవరో కానీ చాలా అదృష్టం చేసుకున్నాడండి లేదంటే ఇలాంటి బాపు బొమ్మ అతనికి దొరుకుతుందా కుదిరితే మళ్ళీ కలుద్దాం”అని అంటూ అతను కార్గా ఆమె వైపు చూసి నవ్వుతూ సెండాఫ్ ఇచ్చి
స్పీడ్ గా నడుపుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు అతను
అతను అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పటివరకు అక్కడే నిలబడి చూసిన ఆమె అందంగా లేత గులాబీలు విచ్చుకున్నట్టుగా ఆమె పెదాలు విచ్చుకోవడంతో
అక్కడి నుంచి మరో నాలుగు అడుగులు వేయగానే పెద్ద ఇల్లు అందంగా పూల మొక్కలు నాటిన పెరటి తోటలు తారస పడడంతో అ ..గేటు ముందు నిలబడి ఒక సుందర దృశ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ పొంగిపోతున్న ఆ అమ్మాయి వైపు చూసిన ..
అక్కడే గేటు పక్కన నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ “అమ్మ వందనమ్మ ఏంటి ఇంకా ఇక్కడే నిలబడిపోయారు లోపలికి పదండి చిన్నయ్య గారు మీ మీద చిందులు తొక్కుతున్నారు…మీ బావగారు చిందులు తొక్కుతున్నారు అని అంటూ అతను ఆమెని కంగారు పెట్టబోతుంటే
ఆమె ఏ భయం లేదు అన్నట్టుగా నవ్వి మామూలుగా అతని వైపు చూసి నవ్వి లోపలికి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పూలన్నీ విచ్చుకున్నట్టుగా ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లుగా మెరిసిపోతోంది అ ఇల్లు
కొనసాగుతుంది..
అందరికీ నా పేరు దుర్గ
ఈ స్టోరీ కనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి 🙏
Swipe left/right or tap the sides to turn pages