New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మనసు చూడ తరమా 💗 – 3

మనసు చూడ తరమా 💗 – 3

ఆ టైమ్ లో ఫోన్ రావడం నాకు టెన్షన్ గా అనిపించినా… నీ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది అనగానే చురుకుగా చూస్తాడు అనిర్వాణ్… ఇలా మాట్లాడటం తప్పేమో… కానీ నీతో ఏ విషయం దాచుకోలేని బలహీనత నాది… అని అనిర్వాణ్ కళ్ళలోకే చూస్తాడు ఉజ్వల్… 

నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా అని ఉజ్వల్ అనగానే వెంటనే చూపు తిప్పేస్తాడు అనిర్వాణ్…  
ఈ రోజు ఆ అమ్మాయి కారణంగా నేను గుర్తొచ్చానా… ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ చేశాను… ఒక్కదానికైనా ఆన్సర్ ఉందారా నీ నుంచి… అసలు ఎన్ని సార్లు హాస్పిటల్ కి వచ్చి కూడా నువ్వు కలవడానికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వక తిరిగి వెళ్లానో గుర్తుందా… 
ఆ అమ్మాయికి ఇలా జరగడం బాధాకరమైన విషయమే అయినా… తన ప్రాణాల మీదకు తెచ్చుకొని…  నా ప్రాణ మిత్రుడు నాతో మాట్లాడేలా చేసింది… వాడికి నేనొకడిని ప్రాణాలతో ఉన్నానని గుర్తొచ్చేలా చేసింది… నిజంగా ఆమెకు ఋణ పడి ఉంటాను అని ఎమోషనల్ అవుతాడు ఉజ్వల్… తన ఫ్రెండ్ తనకు దాదాపు దూరమైపోయాడు అనే భాధతో కుమిలిపోతున్న సమయంలో వారు మళ్ళీ ఇలా కలుసుకోవడానికి కారణమైన ఆ అమ్మాయి నిజంగా అతని కళ్ళకు దేవతలాగే కనిపిస్తుంది… 
కంటికి దూరంగా ఉంటే తెలియలేదు కానీ… కళ్ళ ముందు ఉన్న తన ఫ్రెండ్ బాధని  చూడలేని అనిర్వాణ్… ఉజ్వల్ భుజం మీద చెయ్యి వెయ్యడం తో… అప్పటి వరకూ అప్పుకున్న కన్నీళ్లను వదిలి… తన బాధను కంట్రోల్ చేసుకుంటాడు ఉజ్వల్…
అయినా ఈ పేషెంట్స్  ఈ బ్లడ్, ఈ ఎమర్జెన్సీ కేసులు ఏవీ నీకు కొత్త కాదు… ఎవరూ నిన్ను కదిలించలేదు… ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ నువ్వు ఏ పేషెంట్ కోసం ఇంత టెన్షన్ పడుతూ నువ్వు నాకు కాల్ చెయ్యలేదు… ఆఖరికి పసిపిల్లలకు ట్రీట్మెంట్ ఇస్తూ కూడా నువ్వు ఇంత గాబరా పడటం నేను చూడలేదు…
కానీ ఇప్పుడెందుకు నీలో ఇంత మార్పు… ఇంత కంగారు…  నువ్వు పర్సనల్ గా కేర్ చేయడం నాకు కొత్తగా వింతగా ఉంది అంటూ అనిర్వాణ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు ఉజ్వల్… 
ఉజ్వల్ ఆలా అడిగే వరకూ తనకు కూడా తెలియదు… ఆ అమ్మాయి కోసం తనెంత భయపడ్డాడో, ఆమెను బ్రతికించడానికి అతనెంత తపనపడ్డాడో, ఎంత పర్సనల్ కేర్ తీసుకున్నాడో… ఆఖరికి తన బ్లడ్ ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు… 
తనలో తనకే తెలియని ఆ మార్పు ఏంటో అర్థం కాదు అనిర్వాణ్ కి… 
అసలు ఎవరు తను… తనకోసం నేనెందుకు ఇంత మదన పడుతున్నాను అని మనసు ప్రశ్నిస్తుంటే… 
కళ్ళముందు ఒక నిండు ప్రాణం పోవడం చూడలలేక పోవడం మానవత్వం… అందులోనూ నువ్వు ఒక డాక్టర్ వి… ఆ మాత్రం పేషెంట్ గురించి ఆలోచించడం ఒక డాక్టర్ గా అది నీ బాధ్యత… అని మైండ్ బదులిస్తుంది…
ఎంత భాద్యత అయినా ఒక పేషెంట్ కి డాక్టర్ స్వయంగా తన బ్లడ్ ఇవ్వడానికి సిద్దపడటం నార్మల్ విషయం కాదు కదా… అందులోనూ తనది ఇవ్వడానికి కుదరకపోతే… కొన్ని నెలలుగా మాట్లాడటం మానేసిన వాడిని కూడా నిమిషాల్లో అర్ధరాత్రి హాస్పిటల్ కు రప్పించడం మామూలు విషయం కాదు కదా అని మళ్ళీ మనసు ప్రశ్నిస్తే…
ఆమెకి దెబ్బతగిలిందని వేరే ఎవరైనా తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే వారి మీదే బాధ్యత వదిలి నీ పని నువ్వు చూసుకునే వాడివి… కానీ తనను తీసుకోచ్చిందే నువ్వు… ఆమెను చూసుకోవడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ… ఆమె ఫ్రెండ్స్ రెలెటివ్స్ కూడా లేరు అలాంటప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవడంలో అంత వింత ఏమి లేదని మైండ్ మళ్ళీ బదులిస్తుంది… 
ఇలా మనసు మెదడు మధ్య జరిగిన  యుద్ధంలో మెదడు గెలవడంతో… 
అవును నేనొక డాక్టర్ ని… నా వృత్తి పేషెంట్ ని బ్రతికించడమే… నా స్థానం లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అవుతారని తనకు తను సర్థిచెప్పుకుంటుంటే… 
ఆ టైమ్ లో అంబులెన్సు కి కాల్ చేసి అందులో ఆమెను పంపించి నువ్వు నీ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా… ఎన్ని సార్లు కళ్ళ ముందు ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా… నా డ్యూటీటైం కాదని నిర్ధాయగా చెప్పి వెళ్ళిపోలేదు… మరి ఇప్పుడు అలా ఎందుకు చేయలేదు… ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి ఈ హాస్పిటల్ లో నీ కంటే సీనియర్ డాక్టర్ అయిన డా. రంగన్నాధన్ శర్మ గారు కూడా ఉన్నారు… ఆయన కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు… ఇప్పుడు డ్యూటీ డాక్టర్ కూడా అతనే… అని మళ్ళీ మనసు పోరు పెట్టడం తో… 
మైండ్ తన వెర్షన్ చెప్పబోయే లోపు… నర్స్ వచ్చి ఆమె పల్స్ స్లో అవుతుంది సర్ అని చెప్పడం తో… మైండ్ ని మనసుని గాలికి వదిలేసి… పరుగున వెళ్లి ఆమె పల్స్ చెక్ చేస్తాడు డాక్టర్ గా మారిన అనిర్వాణ్… 
ఆమె పల్స్ స్లో అవుతుంటే… అతని హార్ట్ బీట్ రైస్ అయ్యి పక్కనే ఉన్న నర్స్ కి కూడా వినిపిస్తుంది ఆ శబ్దం… 
ఎన్ని కేసులు వచ్చినా తనకేం పట్టనట్టు నార్మల్ గా ఉండి ట్రీట్ చేసే ఈ డాక్టర్ గారు… 
ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు… 
ఆ అమ్మాయి కి సర్ కి ఏంటి సంబంధం… ఏమవుతుంది ఆమె ఇతనికి… సర్ వాళ్ళ బంధువుల అమ్మాయా ఏంటి అని వంద ప్రశ్నలు ఆలోచన చేస్తుంది ఆ నర్స్ కూడా… 
కానీ వాటిలో ఒక్కటి కూడా అడిగే ధైర్యమే లేదు ఆమెకు… 
ఏం మాట్లాడితే ఏం అంటారో అనే భయం ఆమెది… 
ఎలాగైనా ఆమెను బ్రతికించాలనే తపన అతనిది… 
ఎప్పుడూ లేనిదీ ఆమెకు సిపిఆర్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వణుకుతూ కనిపిస్తాయి అతని చేతులు అతనికే… 
ఎలాంటి ఆపరేషన్ అయినా అవలీలాగా చేసే ఆ డాక్టరేనా ఇతను అని అనుమానంగా చూస్తుంది పక్కనే ఉన్న నర్స్… 
ఎవరు నువ్వు… ఎందుకు నీ విషయం లో నేనింత బలహీనమవుతున్నాను… అని ఆమె ఫేస్ చూస్తూ మనసులోనే ప్రశ్నించుకుంటాడు అనిర్వాణ్… 
ఏదో ఆందోళన ఆమె మొహాం లో స్పష్టంగా కనిపిస్తుంటే… 
ఆమెను మొదటి సారి చుసిన దృశ్యం మళ్ళీ కళ్ళ ముందుకు రాగానే ఒళ్ళు జలదరిస్తుంది అతనికి… 
వెంటనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు పూర్తిగా డాక్టర్ గా మారిన అనిర్వాణ్…
ఆమె పట్ల అతని అభిప్రాయం ఏంటో… అతనిలో ఆ మార్పు ఎందుకో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం…
మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ❤️