“ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య…? బాబు మాట్లాడడం రాకపోవడం ఏంటి…? అయినా ఆ బాబు ఎవరు…? మీకేమవుతారు?” అసహనంగా అడిగాడు సిద్ధు.
“బాబు… అది మా పెద్ద అమ్మాయికి పుట్టిన బాబు వీడు…!”
“అంటే మీరు అన్నది…?” అనుమానంగా అడిగాడు సిద్ధు.
“హా… అవును బాబు. నాకు ముగ్గురు అమ్మాయిలు. వీడు నా పెద్ద కూతురు కొడుకు బాబు…!”
“డాడ్… మీకు ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు…?”
“మీ నాన్నగారు చెప్పింది నిజమే బాబు. ప్రస్తుతానికి ఇద్దరే కూతుళ్లు. నా పెద్ద కూతురు వీడిని కన్న ఆరు నెలలకే కూతురు, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు…!”
“ఆరు నెలల పసికందును మా చిన్న కూతురైన గీతనే తల్లిలా చూసుకుంటుంది.”
“మరి బాబుకి మాటలు రావు అన్నారు…?”
“అవును బాబు. వాడికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాడికి ఇంకా మాటలు రాలేదు…!”
“బాబుకి హెల్త్ ప్రాబ్లమ్ ఏంటండీ?” ఈసారి సిద్ధు గొంతులో కంగారు వినిపించింది.
ఇంతలో రఘురాం గారు అక్కడికి వచ్చారు.
“నాన్నా… సిద్ధూ!”