హాల్ లోకి బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం వచ్చిన ప్రణవి కి డైనింగ్ టేబుల్ మీద దియా ను కూర్చో బెట్టి ఇడ్లీ తినిపిస్తున్న ఆశ్రిత ను చూసి ఎక్కడి లేని కోపం, చిరాకు వచ్చేస్తాయి ఆ కోపంతోనే ఆవేశంగా వెళ్ళి దియా చెయ్ పట్టుకుని ఏయ్ బుద్ది లేదా నీకు దాని చేత్తో ఎందుకు తిన్నావ్ అంటూ దియా వైపు కోపంగా చూస్తు అడుగుతున్న తనను చూసి దియా భయపడి రాగం అందుకుంటుంది అది చూసిన ఆశ్రిత దియా ను దగ్గరకి తీసుకుని గుండెలకు హత్తుకుని అరెరే లేదు లే బంగారు ఏడవకు మా అమ్మ కదూ చూడు మమ్మా ఇక్కడే ఉంది కదా ఇలా ఏడవకు అంటూ తన వెన్ను నిమురుతూ దియా తో కష్టంగా ఏడుపు మానిపించి లక్ష్మి అని దియా ను చూసుకునే లక్ష్మి ను పిలుస్తుంది
ఆశ్రిత అరుపు విన్న లక్ష్మి రెండు నిమిషాల్లో ఆశ్రిత ముందు నిల్చొని చెప్పండి మేడం ఎందుకు పిలిచారు అంటూ వినయంగా అడుగుతుంది