ఆషి చెయ్ పట్టుకుని లాగుతున్న అభి ను కోపంగా చూస్తు ఫాస్ట్ గా ఆషి వొళ్ళో లో నుండి లేచి బెడ్ దిగి ఏయ్ యూ మమ్మా ను వదులు అంటూ కోపంగా అభి చేతిని పట్టుకుని కొరికి తన శక్తి కొద్ద అభి ను వెనక్కి నెడుతుంది దియా తనను నెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని అభి ఏమరపాటుగా ఉండడం తో కాలు స్లిప్ అయి రూమ్ లోకి వస్తున్న నిషాన్ మీద బోర్లా పడుతుంది అంటే నిషాన్ నేల మీద వెల్లకిలా పడుకుని ఉంటే అభి తన మీద ఉంటుంది ఆ ప్రాసెస్ లో అనుకోకుండా ఇద్దరి పెదాలు కలుసుకుంటాయి అనుకోని ఈ సంఘటనకు ఆషి, మోహిత్ తో పాటు అప్పుడే అఫీస్ నుండి అక్కడికి వచ్చిన ఆయుష్ కూడా షాక్ అవుతారు దియా వాళ్ళని కళ్లు పెద్దవి చేసి చూస్తు ఉంటే మోహిత్ దియా కళ్ళను మూసి వాళ్ళ వైపు చూస్తూ ఎదో ఆలోచన రావడం తో తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు
తన పెదవి నిషాన్ రెండు పెదవుల మధ్య చిక్కుకోవడం చూసి అభి కోపంగా నిషాన్ ను నెట్టి ఫాస్ట్ గా పైకి లేచి నిషాన్ వైపు అసహ్యంగా చూస్తూ హౌ డేర్ యూ నన్నే కిస్ చేస్తావా అంటూ నిషాన్ మీద చెయ్ చేసుకోబోతున్న అభి చేతిని గాల్లోనే ఆపేసి నా ముందే నా తమ్ముడిని కొట్టాలి చూస్తావా బ్రతకాలి అని లేదా నీకు అని కోపంగా అభి వైపు చూస్తున్న ఆయుష్ ను చూసి ఆషి కంగారుగా ఆయుష్ గారు ప్లీస్ వదిలేయండి ఎదో మిస్టేక్ లో జరిగిపోయింది అంటూ ఆయుష్ ను రిక్వెస్ట్ చేస్తుంది