ఆశ్రిత ఆయుష్ వైపు విసుగ్గా చూస్తూ దియా పక్కన కూర్చుని దియా చేతిని పట్టుకుంటుంది దియా కోపంగా ఆ చేతిని నెట్టేసి డోంట్ టాక్ టు మీ మమ్మా నో వన్ లవ్స్ మీ అని బోర్లా పడుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అది చూసిన ఆశ్రిత కు చాలా బాధగా అనిపించింది దియా ను వొళ్ళో పడుకోబెట్టుకొని నో క్యూటి వుయ్ అల్ లవ్ యూ ఎక్స్పెషియల్లీ యువర్ డాడ్ లవ్స్ యు సో మచ్ అంటూ దియా కన్నీళ్లు తుడుస్తూ అనునయంగా చెప్తుంది
లేదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అందుకే నువ్వు నాతో లేవు డాడీ కూడా నన్ను తిట్టాడు అని ఏడుస్తూ ఆశ్రిత ను హత్తుకుంటుంది