ఆయుష్ దియా రూమ్ లోకి బయటకు వచ్చి అప్పటి వరకు ఆపుకున్న బాధ, ఆవేశం ఒక్క సారిగా తన్నుకు రావడం తో పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్లి గోడకు ఆపకుండా పంచెస్ ఇస్తూ నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు కానీ ఐ కాంట్ కంట్రొల్ మై సెల్ఫ్ నిన్ను ఇలా చూస్తూ కూడా దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు ఆషి అంటూ మొబైల్ లో తను ఆషి కలిసున్న పిక్ వైపు బాధగా చూస్తూ ఎంతో అనందంగా సాగిపోవాల్సిన మన జీవితాలు ఎందుకిలా తారు మారు అయ్యాయి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావ్ ఆషి నువ్వు లేకుండా నాకు ఎంత నరకంగా అనిపిస్తుందో తెలుస్తుందా
నీకు నేను ఇలా చేస్తున్నందుకు కోపంగా ఉన్నావా చెప్పు ఆషి ఒక్క సారి నాతో ప్రేమగా మాట్లాడు నీతో చాలా మాట్లాడాలి అనుంది కానీ మాట్లాడలేని స్థితిలో ఉన్నా ఎందుకే నన్ను ఇలా చిత్ర వాధ చేస్తున్నావ్ నేను వున్నా అంటే ఉన్నా జస్ట్ ఉన్నాను అంతే తప్పా సంతోషంగా లేను నీకు అన్ని నిజాలు తెలిసాకే నేను ప్రశాంతంగా ఉండగలను అంటూ ఆషి ఫొటో కి ముద్దు పెడుతూ అలాగే కళ్లు మూసుకున్న ఆయుష్ కి తన బుజం మీద చెయ్ పడ్డం తో మొహాన్ని నార్మల్ గా పెట్టుకొని మొబైల్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూస్తాడు