నేను నా రూమ్ లో లేనప్పుడు ఆషి ఒక్కటే వున్నప్పుడు ఎందుకు వచ్చావ్ అని సీరియస్ గా చూస్తూ అడుగుతున్న ఆయుష్ వైపు గుటకలు మింగుతూ చూస్తున్న నిషాన్ వైపు చూస్తూ నిన్నే అడుగుతుంది చెప్పు ఎందుకొచ్చావ్ అని రెట్టించి అడుగుతున్న ఆయుష్ గొంతు లోని కోపానికి భయపడుతూ అన్నయ్యా అది నేను… నేను నీ రూమ్ కి వెళ్లలేదు నా రూమ్ లోనే వున్నాను ఆని వణుకుతున్న గొంతు లో చెప్పి తల వంచుకుంటాడు
ఆయుష్ కోపంగా నిషాన్ గొంతు పట్టుకుని నొక్కుతూ డోంట్ ట్రై టూ లైస్ టూ మీ నేను రూమ్ లోకి రాగానే కనిపెట్టాను నువ్వు నా రూమ్ లోనే వున్నావ్ అని కానీ ఎందుకు బయటపడలేదో తెలుసా ఆషి కోసం తను మా ముందు దోషి లా నిల్చోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నువ్వు నా రూమ్ లో వున్నావ్ అని తెలిసినా తెలియనట్టే నటించా ఇప్పుడు చెప్పు ఆషి తో ఎమ్ చెప్పాలని నా రూమ్ కి వచ్చావ్ అంటూ తన పట్టును మరింత గట్టిగా బిగిస్తాడు