అది కాదమ్మా అంటూ ఆశ్రిత కు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్న రాగిణి మాటలకు అడ్డు పడుతూ తను వస్తుంది నువ్వెల్లు మామ్ అని గుమ్మంలో నుండి గంభీరంగా వినిపించిన వాయిస్ విని అటు వైపు చూసిన ఆశ్రిత కు వైట్ కుర్తా లో నెల రాజు లా మెరుస్తున్న ఆయుష్ ను చూసి మొహాన్ని ఎర్రగా పెట్టుకొని తన వైపు కోపంగా చూస్తుంది రాగిణి ఆయుష్ వైపు చూస్తూ ఆ రూమ్ లో నుండి వెళ్ళగానే ఆయుష్ రూమ్ డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ ఆశ్రిత ముందుకు వచ్చి ప్యాంట్ లో చేతులు పెట్టుకుని సూటిగా చూస్తూ నిల్చుంటాడు
ఆశ్రిత కు ఆయుష్ చూపుల్లో వేడికి బయమేస్తున్న మేక పోతు గాంభీర్యం చూపిస్తూ మీకు భయపడి పెళ్ళి చేసుకున్నా అని ఫస్ట్ నైట్ కి కూడా ఓకే అంటాను అనుకుంటున్నారా నా ప్రాణం పోయినా ఇందుకు నేను ఒప్పుకోను నా ఇష్టం లేకుండా నా శరీరం మీద చెయ్ వేస్తే వొళ్ళంతా కిరోసిన్ పోసుకుని అంటించుకుంటాను తప్పా పతియే ప్రత్యక్ష దైవం ఎలాగో పెళ్లి అయిపొయింది కదా అని మీకు సరెండర్ అవుతాను అని కలలు కనకండి నాకు మీరంటేనే ఇష్టం లేదు మీతో జీవితాన్ని పంచుకుంటాను అని ఎలా అనుకున్నారు నేను ప్రేమించింది ఒకర్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది ఒకర్నె కానీ మీరు మద్యలో వచ్చి నా కుటుంబాన్ని అడ్డూ పెట్టుకొని నన్ను పెళ్ళి చేసుకున్నారు నా మెడలో మీరు తాళి కట్టినా నా మనసులోకి మాత్రం మీరు ఎప్పటికీ రాలేరు