కార్ లో కూర్చున్నప్పటి నుండి దియా ఆయుష్ వొళ్ళో కూర్చుని మార్నింగ్ నుండి దాచుకున్న మాటలు ఆన్ని తన బుజ్జి బుజ్జి కళ్ళను అటు ఇటు చక్రాల్లా తిప్పుతూ ఎదో అద్బుతం చూసినట్టు తను టివి లో చూసిన సినిమా గురించి గొప్పగా చెప్తున్న దియా ను చూసి నవ్వుకుంటూ తను చెప్పే మాటలు వింటూ తనకు జ్యూస్ తాగిస్తు పక్కకు చూసిన ఆయుష్ కి కార్ ఎక్కినప్పటి నుండి విండో లో నుండి బయటకు చూస్తు తమ మాటలు కూడా వినకుండా ఎదో లోకం లో ఉన్న ఆశ్రిత వైపు విసుగ్గా చూస్తూ దియా కాసేపు గేమ్స్ ఆడుకో అంటూ కార్ లోనే ఉన్న మరో మొబైల్ దియా చేతిలో పెడుతూ తనను గేమ్ లో ఎంగేజ్ చేసి ఎన్టీ నీ లవర్ దూరంగా వెళ్తున్నాడని బాధ పడుతున్నావా అంటూ వినిపించిన ఆయుష్ వాయిస్ కి తన వైపు కోపంగా చూస్తుంది
ఎంటా చూపు కార్ ఎక్కినప్పటి నుండి చూస్తున్నా ఎవరో పోయినట్టు ఎంటా ఎక్స్ప్రెషన్ మొదటి సారి హస్బెండ్ & డాటర్ తో బయటకి వెళ్తున్నా ఆన్న హ్యాపీనెస్ నీ మోహం లో కొంచెం కూడా కనిపించడం లేదు