Episode 2
ఆశ్రిత ఏడుస్తూ మర బొమ్మ లా పురోహితుడు చెప్పినట్టే చేస్తు ఉంటుంది తనను అలా చూసిన ఆయుష్ పిడికిలి బిగించి తనకు అందే దూరం లో ఉన్న ప్రభాకర్ వైపు ఓరగా చూస్తూ తన దగ్గరున్న కత్తి తో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రభాకర్ హ్యాండ్ కట్ చేయడం తో ఆ బ్లడ్ ఎగిరి ఆశ్రిత నుదిటి మీద పడుతుంది సడెన్ గా తన మొహాన పడ్డ బ్లడ్ ను చూసి భయం తో అరిచిన ఆశ్రిత అది తన కన్న తండ్రి బ్లడ్ అని చూసి డాడీ అని పైకి లేవబోతుంటే తనను లేవకుండా చెయ్ పట్టుకుని ఆపి నీ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి చుక్క నీ బుగ్గల మీద కు జారిన ప్రతీ సారి మీ నాన్న బాడీ లో ఒక్కో పార్ట్ కట్ చేస్తూ ఉంటాను సో నువ్వు మీ నాన్న బ్లడ్ ఏ గ్రూప్ నో తెలుసుకోవాలి అనుకుంటే ఏడువ్ అని ఈవిల్ స్మైల్ ఇస్తాడు
ఆశ్రిత ఆయుష్ వైపు భయంగా చూస్తూ వ… వద్దు ఆయుష్ గారు నేను ఎడవను అని రెండు చేతులతో కన్నీళ్లు తుడుచుకుని వెక్కిళ్లు పెడుతూ రెండు చేతులతో నోటిని మూసేసి ప్రభాకర్ వైపు చూస్తూ పురోహితుడు చెప్పినట్టు ఎడవకుండా చేస్తు ఉంటుంది అది చూసిన ఆయుష్ నవ్వుతూ తను కూడా పూజ మీద దృష్టి పెడతాడు
అనిత ప్రబాకర్ చేతి నుండీ ధారాళంగా పొంగుతున్న రక్తాన్ని చూసి కంగారుగా తన చీర కొంగు చించి కడుతూ ప్రభాకర్ చేతిని పట్టుకుని ఏడుస్తూ ఆశ్రిత వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడే తన కూతురు ఎంత అదృష్టవంతులు అని మురిసిపోయిన తనకు తను పులి బోను లోకి వెళ్తోంది అని తెలిసి కూతురిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటు భర్త చేతిని గట్టిగా పట్టుకుంటుంది
అయ్యా మీరు చేయాల్సిన పూజ అయిపోయింది ఇక మీరు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ఈ హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు వేయండి
ఆయుష్ పురోహితుడు వైపు చూసి నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ ఈ హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు ఎందుకు వేయాలి
పురోహితుడు ఆయుష్ వైపు చూస్తూ అయ్యా రెండు కుటుంబాలను ఒక్కటి చేసే గొప్ప వేడుక పెళ్లి ఇప్పటి వరకు ఒంటరిగా సాగిన మీ ప్రయాణం ఇక నుండి జంటగా సాగుతుంది మన సంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంది అందుకే పెళ్ళిలో ప్రతీ ఒక్కటి సంప్రదాయంగా చేస్తాం ఇక ఏడు అడుగులు విషయానికి వస్తే మొదటి అడుగు అన్నవృద్ధికి , రెండవ అడుగు బలవృద్దికి, మూడవ అడుగు ధనవృద్ధికి, నాలుగవ అడుగు సుఖవృద్దికి ,అయిదవ అడుగు ప్రజాపాలనకి ,ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఇక చివరగా ఏడవ అడుగు సంతాన సమృద్దికి దోహత పడతాయి అందుకే పెళ్లి లో ఏడు అడుగులు వేస్తారు
(నాకు తెలిసింది చెప్పాను తెలుసుకుని మరీ చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు)
ఓహ్ అలాగ ఒకే నా డౌట్ క్లియర్ అయింది అంటూ ఆశ్రిత చేతి ను పట్టుకుని లాగినట్టే తన చిటికెన వేలు పట్టుకుని ఏడు అడుగులు వేసి పెళ్ళిలో చేయాల్సిన మిగిలిన కృతువులు కూడా పూర్తి చేసి ఆశ్రిత చేతిని పట్టుకుని మండపం నుండి లాక్కెళ్ళినట్టే తన కార్ వైపు తీసుకుని వెళ్తాడు
ఆశ్రిత వెనక్కి తిరిగి ప్రభాకర్ వైపు ఏడుస్తూ చూస్తూ తనేం అయినా అంటే ప్రభాకర్ ను ఇంకెంత బాధ పెడతాడో అని ఎమ్ మాట్లాడకుండా నరకం అనుభవించడానికి సిద్దం అవుతు తన వాళ్ళ వైపు కన్నీళ్లతో చూస్తూ వెళ్తుంది
ప్రభాకర్, అనిత ఆశ్రిత వెనుకే ఆషి అని వెళ్తుండగా లావుగా ఉన్న ఇద్దరు బౌన్సర్స్ వాళ్ళని ఆడుకోవడం తో వాళ్ళు ఆశ్రిత వైపు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు అభి తన మెడ మీద కత్తి పట్టిన వాడి చేతిని కొరికి మరీ అంత మంది బౌన్సర్స్ ఉన్నా అందరినీ దాటుకుని బలవంతంగా ఆశ్రిత ను తన బెంజ్ కార్ ఎక్కిస్తున్న ఆయుష్ ను క్రాస్ చేసి అక్కా అని ఏడుస్తూ ఆశ్రిత ను హత్తుకుని వెళ్ళద్దు అక్క వీళ్ళు మంచి వాళ్ళు కాదు అనిపిస్తుంది పదా మన ఇంటికి వెళ్ళిపోదాం అని చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటుంది
అభి బుజం పట్టుకుని కోపంగా వెనక్కి లాగి తన చంప మీద కొడుతున్న ఆయుష్ ను చూసిన ఆశ్రిత అభి ను పక్కకు లాగి ఆ దెబ్బ తనకు తగిలేలా చేసుకుంటుంది అది చూసిన అభి భయంతో నీలుక్కు పోయి ఆశ్రిత ను వెనుక నుండి పట్టుకుని ఆయుష్ వైపు భయంగా చూస్తుంది
ఆయుష్ అభిత వైపు అడుగులు వేస్తూ ఉండడం గమనించిన ఆశ్రిత ఆయుష్ ముందు నిల్చొని క్షమించండి ఆయుష్ గారు తనకు మీ గురించి తెలియదు ప్లీస్ తననేం అనకండి అది ఇన్నోసెంట్ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం చూసి అభి ను విసురుగా వెనక్కి నెట్టి ఆశ్రిత ను కార్ లోకి తోసి తను మీ అక్క కాదు ఈ ఆయుష్ వర్మ బార్య ఇప్పటి నుండి తను నా మహల్ లో నాతోనే వుంటుంది మీరు తనను కలవాలి అన్నా మాట్లాడాలి అన్నా ఈ ఆయుష్ వర్మ పర్మిషన్ తీసుకునే రావాలి అని కోపంగా చెప్పి కార్ లో కూర్చోగానే ఆయుష్ కార్ అక్కడి నుండి దూసుకుని వెళ్ళిపోతుంది వెనుకే 7 కార్స్ దుమ్ములేపుకుంటు వెనుకే వెళ్తాయి
కింద పడ్డ అభి చేతికి అయిన గాయాన్ని తడుముకుంటూ అక్క అని క్షణం లో మాయం అయిన కార్ ను చూసి ఏడుస్తూ పక్కకు తిరిగి చూడగా నిషాన్ అక్కడికీ రావడం చూసి కోపంతో ఉగిపోతు యూ ఇడియట్ నీ వల్లే మా అక్క మాకు దూరం అయింది అని కోపంగా నిషాన్ కాలర్ పట్టుకుని కోపంగా అడుగుతూ నిషాన్ ను కొట్టబోతు ఉండగా ప్రభాకర్ అభి ను వెనక్కి లాగి నిషాన్ వైపు కోపంగా చూస్తూ అనిత ను తీసుకుని అక్కడ ఒక్క క్షణం కూడా వుండకుండా కార్ లో వెళ్ళిపోతాడు
నిషాన్ వెళ్తున్న ప్రాబాకర్ వాల్ల వైపు తప్పు చేసిన వాడిలా తల వంచుకుని తన కార్ లో మహల్ కి స్టార్ట్ అవుతాడు
ఆశ్రిత కార్ లో మూలకు కూర్చుని విండో లో నుండి బయటకు చూస్తూ క్షణ కాలంలో మారిపోయిన తన జీవితాన్ని తలచుకుంటూ సౌండ్ బయటకీ రాకుండా ఏడుస్తూ శూన్యం లోకి చూస్తూ ఉంటుంది ఆయుష్ తన వైపు ఒక సారి చూసి మొబైల్ లో మహల్ వచ్చే వరకు కాల్స్ మాట్లడుతూ బిజిగా ఉంటాడు
మహల్ రాగానే అక్కడున్న పని వాళ్ళు వినయంగా ఆయుష్ కూర్చున్న వైపు డోర్ ఓపెన్ చేయగానే ఆయుష్ గంభీరంగా కార్ దిగి ఆశ్రిత వైపు కార్ డోర్ ఓపెన్ చేసి తన చేతిని ఆశ్రిత వైపు పెడతాడు
ఆశ్రిత ఆ చేతిని అందుకోకుండా పొగరుగా చూస్తూ కార్ దిగి ఆయుష్ కి కొంచెం దూరంగా నిల్చుని రాజు కోట లా ఉన్న ఆ మహల్ ను అశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆశ్రిత ను ఓరకంట గమనిస్తునే తన బుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని నువ్వు నా బార్య వి ఎవరో పరాయి వాడి పక్కన నిల్చున్నట్టు అంత దూరం నిల్చున్నావ్ ఎందుకు ఎందుకు అని తన బూజాన్ని గట్టిగా నొక్కి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు
తన బుజాన్నీ ఆయుష్ పట్టుకున్న విధానానికి ఆశ్రిత కు నొప్పితో కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి కానీ అవి బయటకు కనిపించకుండా ఆయుష్ తో కలిసి కష్టంగా అడుగులు వేస్తూ ఉంటుంది వీళ్లకు అడుగడునా అందమైన పాతిక సంవత్సరాల అమ్మాయిలు వీళ్లకు గులాబీ రేకులతో ఆహ్వానం పలుకుతూ ఉంటారు అదంతా అశ్చర్యంగా చూస్తూనే మహల్ లోకి అడుగుపెడుతున్న ఆశ్రిత ను ఆగండి ఆన్న రాగిణి పిలుపు తో ఇద్దరు కుడి కాలు పెట్టేవాళ్ళు కాస్త కాలు వెనక్కి తీసుకుని రాగిణి వైపు చూస్తారు
రాగిణి తో ముందే పరిచయం వున్న ఆశ్రిత మీ చిన్న కొడుకు తో ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయిని మీ పెద్ద కొడుకు బలవంతంగా పెళ్లి చేసుకున్నా మీరు ఎలా నవ్వగలుగుతున్నారు అత్తయ్య అని బాధగా ప్రశ్నించుకుంటూ రాగిణి వైపు బాధగా చూస్తుంది
ఎందుకమ్మా ఆగమని చెప్పావ్ నాకు చాలా చిరాగ్గా ఉంది ఫ్రెష్ అవ్వాలి లోపలికి రానివ్వు అని అసహనంగా అడుగుతాడు
చిరాకు పడకు ఆయుష్ జస్ట్ 2 మినిట్స్ అంటూ గుమ్మం ముందు బియ్యం నిండా నింపిన బంగారు గ్లాస్ పెడుతూ దాన్ని నీ కుడి కాలితో తన్ని ఆయిష్ తో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టమ్మా అంటూ ఇద్దరికి నవ్వుతూ హారతి ఇచ్చి ఆశ్రిత వైపు చూస్తుంది
ఆశ్రిత మొండిగా గుమ్మం లో నిల్చొని ఉండడం చూసిన ఆయుష్ అమ్మ చెప్పినట్టు చేయకపోతే నీ చెల్లి ప్రాణాలకు నేను గారంటీ ఇవ్వలేను అని ఆశ్రిత చెవిలో చిన్నగా చెప్పగానే ఆశ్రిత ఆయుష్ వైపు కోపంగా చూస్తునే రాగిణి చెప్పినట్టు చేసి ఆయుష్ తో కలిసి ఇంట్లోకి అడుగు పెడుతుంది
రాగిణి దేవుడి గది చూపించి దీపం వెలిగించమని చెప్పడంతో ఆయుష్ వైపు భయంగా చూస్తూ రాగిణి చెప్పిన మాట ప్రకారమే దీపం వెలిగించి ఈ సైకో నుండి నన్ను త్వరగా బయటకీ పంపించేలా చెయ్ స్వామి అని మొక్కుకుని దేవుడి గది నుండి బయటకు వచ్చిన తనకు మమ్మా అంటూ తన కాళ్ళను చుట్టేసిన అయిదు సంవత్సరాల పాప ను చూసి షాక్ తో బిగుసుకుపోతుంది
Continues ❣️
Swipe left/right or tap the sides to turn pages