New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 1

Episode 1

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ….. పూబంతి మాలలతో ….. నవ్వుతున్న పిల్లల నవ్వులతో…… బంధు మిత్రుల హడావిడితో…. అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది

గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు

కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ సాగుతున్న మాటలు మరో వైపు పసుపు , గంథం, ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకం లో ఉన్న కబుర్లు మొత్తం చెప్పుకుంటు నవ్వుకుంటున్న ఆడవాళ్ళు

అమ్మలాలో,తీపి బొమ్మాలాలో, ముద్దుల గుమ్మాలాలో

అల్లరిచేసే ఈడు పిల్లలాలో ఆకాశాన్నంటే ఇంటి సంబరాలో

ముద్దబంతి, చామంతి తోరనాలో, విరిసేను మా ముంగిట సంబారాలో

పసుపు, చందనం తలబ్రాలలో , మెరిసేను అక్షింతల ముత్యాలతో …. మెరిసి మురిసిన ముత్యాలతో

మన జీవితంలో ఓకే సారి వచ్చే పెళ్లి పండుగ అదే ఆ ఇంట అందరిలో ఆనందాన్ని,సంతోషాన్ని కలిగిస్తోంది

ఆ ఇంటి పెద్ద ప్రభాకర్ బ్యాంక్ మ్యానేజర్ ఆయన బార్య అనిత వీళ్లకు ఇద్దరు అమ్మాయిలే మొదటి అమ్మాయి పేరు ఆశ్రిత ( తనే మన హీరోయిన్ అందానికి నిర్వచనం మన ఆశ్రిత) బీ. టెక్ ఫినిష్ చేసి జాబ్ చేస్తు ఉండే టైమ్ లో తన కంపెనీ సి. ఈ. ఓ. అయిన నిషాన్ వర్మ ఆశ్రిత కు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం నిషాన్ మీద మంచి అభిప్రాయం ఉండడం వల్ల 6 మంత్స్ టైమ్ అడిగి మరీ మ్యారేజ్ కి ఓకే చెప్పింది

నిషాన్ తన పేరెంట్స్ తో పాటు ఆశ్రిత ఇంటికి వచ్చి ప్రభాకర్ కు తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి పెద్దల సమక్షం లో ఎంగేజ్మెంట్ చేసుకుని తను ప్రేమించిన అమ్మాయిని మహారాజ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకోబోతున్నాడు

ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోబోతున్నందుకు ఆశ్రిత అనందం అంతా ఇంతా కాదు తన ఫ్రెండ్స్ ఆశ్రిత చుట్టూ చేరి తనను ఆటపట్టిస్తూ ఆశ్రిత ను నిషాన్ కుటుంబ సంప్రదాయ పద్ధతిలో నే మేలి ముసుగుతో రెడీ చేస్తారు కొద్ది క్షణాల్లో తను మిసెస్ నిషాన్ అవ్వబోతుంది కొంచెం నర్వస్ గా కొంచెమ్ టెన్షన్ గా ఇంకొంచెం సంతోషంగా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ తో పెళ్లి కూతురు గెట్ అప్ లో ఆందంగా రెడీ అయి సిగ్గూ పడుతూ కూర్చుంది

తన బంగారు బొమ్మ కు అప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దది అయిపొయింది అని అనిత గారు ఆశ్రిత ను చూసి చాలా బావున్నావ్ అషి నా దిస్టే తగిలేలా ఉంది అని చెవి వెనుక తన కల్లకున్న కాటుక తీసి పెడుతూ నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావ్ అషీ అందుకే అంత గొప్ప కుటుంబానికి కోడలు అవ్వబోతున్నావ్ అని కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఆనందంగా చెప్తుంది

అనిత అషి రెడీ అయిందా అని రూమ్ లోకి వచ్చిన ప్రభాకర్ పెళ్లి కూతురు లా ఉన్న తన బంగారు బొమ్మ ను చూసి చాలా అందంగా ఉన్నావ్ అషి అంటూ బుగ్గన ముద్దు పెడుతూ త్వరగా కానివ్వండి అనిత అల్లుడు గారు మండపం లోకి వచ్చేశారు అని కాల్ రావడంతో హడావడిగా అక్కడి నుండి వెళ్లిపోతారు

అక్క నేను ఎలా ఉన్నానో చెప్పు అంటూ బ్లూ కలర్ లేహంగా పట్టుకుని చుట్టూ తిప్పుతూ అడుగుతుంది ప్రభాకర్ రెండో కూతురు అయిన అభిత ఏమ్. బీ. ఏ చదువుతూ ఉంటుందీ చాలా అల్లరి పిల్ల అక్కంటే ప్రాణం అమ్మ నాన్న అంటే పంచ ప్రాణాలు చెల్లిని చూసిన ఆశ్రిత నవ్వుతూ చాలా బావున్నావ్ అభి అని నవ్వుతూ చెప్పగానే నువ్వు కూడా బావున్నావ్ అక్క అంటూ ఆశ్రిత ను హగ్ చేసుకుని ఇక్కడి నుండి మహల్ కి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోవు కదా అని డల్ గా అడుగుతున్న అభి ను చూసి నిన్ను ఎవరైనా మర్చిపోతారా అసలు జరగదు మనం డెయిలీ కాల్స్ మాట్లాడుదాం సరేనా అంటూ చెల్లి బుగ్గలు తుడిచి ముద్దు పెడుతుంది

ఈ లోపు పెళ్లి కూతురు ను తీసుకు రండి అని పిలవడం తో ఆశ్రిత మేలి ముసుగు తొడిగి ఆశ్రిత ను తన ఫ్రెండ్స్ ఇంకా అనిత గారు మండపం దగ్గరకు తీసుకు వెళతారు మండపం లో ముసుగు వేసుకుని పురోహితుడు చెప్పినట్టు చేస్తున్న నిషాన్ ఓ సారి చూసి సిగ్గుతో తల వంచుకుని పక్కనే కూర్చుని హాయ్ నిష్ అంటూ చిరు నవ్వుతో చెప్పి పురోహితుడు చెప్పినట్టే చేస్తు ఉంటుంది

వధూ వరులతో చేయాల్సిన పూజ మొత్తం చేయించి వరుని చేతికి మంగళ సూత్రం అందించి అది అమ్మాయి మెడలో కట్టండి నాయన అని చెప్పిన పురోహితుడి మాట విని నిషాన్ పైకీ లేచి అందరికి అది చూపెట్టి ఆశ్రిత మెడలో మూడు ముళ్లు వేస్తాడు

ఆ మంగళ సూత్రం పట్టుకుని ఆనందంగా వాటిని కళ్లకు అద్దుకుంటూ ఎదురుగా చూసిన తనకు నిషాన్ తన వైపే బాధగా చూస్తూ కనిపించడం చూసి ఆశ్రిత బయం తో బిగుసుకుపోతుంది తన ఎదురుగా కనిపిస్తుంది నిషాన్ అయితే మరీ తనకు తాళి కట్టింది ఎవరు అని షాక్ అవుతూ తన పక్కన కూర్చున్న అతని వైపు తీక్షనంగా చూస్తుంది మేలి ముసుగు వేసుకోవడం వల్ల అక్కడ ఉంది ఎవరో అర్తం అవ్వక అతని మేలి ముసుగు తీయడం తో తన వైపు ఈవిల్ స్మైల్ తో చూస్తున్న ఆయుష్ వర్మ కనిపించి వొళ్ళంతా చెమటలు పడతాయి తన నోటి నుండి అప్రయత్నంగా బీస్ట్ ఆన్న పిలుపు విని ఆయుష్ మోహం లో అదే ఈవిల్ స్మైల్

నిషాన్ ఉండాల్సిన స్థానం లో తన అన్నయ్య ఆయుష్ వర్మ ఉండడం చూసి కూర్చున్న బంధువులు కూడా షాక్ అయ్యి పైకీ లేచి ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు

ప్రభాకర్, అనిత, అభి & ఆశ్రిత ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యి ఆయుష్ వైపు పక్కనే కళ్ళ నిండా నీళ్లతో తన మెడలో ఉన్న మంగళ సూత్రం వైపూ చూస్తున్న ఆశ్రిత ను చూస్తూ ఉంటారు ఆ హాల్ మొత్తం గందర గోళంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సడెన్ గా వచ్చిన బుల్లెట్ సౌండ్ విని ఒక్క సారిగా హాల్ మొత్తం నిశబ్దంగా మారి బయం తో బిగుసుకు పోతారు

పురోహితుడి మంత్రాలు తప్పా మరే ఒక్క శబ్దం అయినా నా చెవిన పడ్డా నెక్స్ట్ మినిట్ నా గన్ లోని బుల్లెట్ మీ గుండెళ్ళో దిగుతుంది గాట్ ఇట్ అని బేస్ వాయిస్ తో చెప్తున్న ఆయుష్ ను చూసి అందరూ ఊపిరి బిగబట్టి ఆయుష్ వైపే చూస్తూ ఉంటారు నిశబ్దం కూడా అంత భయంకరంగా ఉంటుందని అపుడే చూస్తున్న అభి అనిత చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న ఆశ్రిత వైపు బాధగా చూస్తూ వుంటుంది

కూర్చోండి అన్న ఆయుష్ కంచు కంఠం విని అందరూ దెబ్బకు నోటి మీద చెయ్ పెట్టుకొని ఊపిరి కూడా పిల్చకుండా ఆయుష్ వర్మ వైపు బెదురు కళ్ళతో చూస్తూ ఉంటారు ఆయుష్ చిటికె వేయడం ఆలస్యం 15 మంది బౌన్సర్ గన్స్ పట్టుకుని అక్కడికి వచ్చి ఆయుష్ ఆర్డర్స్ కోసం వినయంగా వెయిట్ చేస్తూ ఉంటారు

మ్యారేజ్ ఫినిష్ అయ్యేవరకు ఎవరి దగ్గర నుంచి చిన్న సౌండ్ కూడా రాకూడదు వచ్చిందా వాళ్ళని నిర్దాక్షినంగా లేపేయండి అని సీరియస్ గా చెప్పగానే యస్ సర్ అంటూ వాళ్ళు గన్స్ పట్టుకుని అందరి వైపు గురి పెట్టి చూస్తూ ఉంటారు

అనవసరంగా పెళ్లి కి వచ్చాం నిషాన్ పెళ్లి అని వెడ్డింగ్ కి ఇన్వైట్ చేసి తమ్ముడి చేసుకాబోయే అమ్మాయిని అన్న చేసుకోవడం ఎంటో అర్తం అవ్వక ఆ విషయం ఆయుష్ ను అడిగే ధైర్యం లేక బొమ్మల్లా జరిగేది చూస్తూ ఉంటారు

ఆశ్రిత ఆయుష్ వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ నీ తమ్ముడిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదా ఆయుష్ నేను నిషాన్ ను ప్రేమించాను తనను మాత్రమే ప్రేమిస్తున్నా నువ్వు నాకు ఈ తాళి కట్టినంత మాత్రాన నా భర్త వి అయిపోవు అని కోపంగా చెప్పి పైకి లేచి ముందుకు వెళ్తున్నా ఆశ్రిత కు అక్కా!!! ఆన్న అభి వాయిస్ విని వెనక్కీ తిరిగి చూడగా అభి మెడ మీద కత్తి పెట్టుకుని కనిపిస్తాడు బలంగా ఉన్న ఒక అబ్బాయి అది చూసిన ఆశ్రిత కంగారుగా అభి అంటూ ముందుకు వెళ్తు ఉండగా ఆగు అన్న ఆయుష్ వాయిస్ విని అక్కడే ఆగిపోతుంది

పెళ్లి అయ్యేంత వరకు నోరు తెరిచినా నీ నోటి వెంట నిష్ ( నిషాన్) పేరు వచ్చినా నీకు నీ చెల్లి శవమే మిగులుతుంది అని కోపంగా చెప్పి మంత్రాలు చదవండి అని సీరియస్ గా పంతులు చెప్పేవి చేస్తున్న ఆయుష్ ను చూసి నిస్సహాయంగా వెళ్ళి ఆయుష్ పక్కన కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటు యంత్రం లా చెప్పేవి చేస్తూ ఉంటుంది అది చూసిన ఆయుష్ కోపంగా తన పక్కనే ఉన్న కత్తి తీసుకుని ప్రభాకర్ చేతి మీద కట్ చేయగానే ఆ బ్లడ్ ఎగిరి ఆశ్రిత నుదుటి మీద పడగానే ఆశ్రిత అ…..ఆ….ఆ…. అంటూ షాక్ తో గట్టిగా అరుస్తుంది

 

Continues ❣️