New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అజేయ – 3
అజేయ 3 min read

అజేయ – 3

                 **   అజేయ  –   3**

హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్ ఏరియా లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రాయల్ హేవెన్ ఆర్ట్ గ్యాలరీ’ అది..ఆ రాత్రి కలర్‌ ఫుల్ లైట్స్‌ తో మిల మిల మెరిసిపోతోంది..
సిటీలోని ఎలైట్ క్లాస్ జనాలు, బిజినెస్ మేగ్నెట్స్, టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు అలాగే ఇంటర్నేషనల్ ఆర్ట్ క్రిటిక్స్ అందరూ కూడా అక్కడే ఆ ఆర్ట్ గ్యాలరీ లో సమావేశం అయ్యారు….
ఆ ఎయిర్ కండీషన్డ్ హాల్ అంతా కూడా మైల్డ్ క్లాసికల్ ఫ్యూజన్ మ్యూజిక్ వినిపిస్తోంది..
అందరి చేతుల్లో వైన్ గ్లాసెస్ ఉన్నాయి, కానీ అందరి చూపులు మాత్రం అక్కడే వున్నా ఆ గ్యాలరీ గోడలపై ఉన్న పెయింటింగ్స్ మీదే ఉన్నాయి…
ఆ పెయింటింగ్స్ అన్నీ ఒక వింతైన మాయా ప్రపంచాన్ని తలపిస్తున్నాయి..అక్కడ ఒక 12వ శతాబ్దపు పాత కోట, ఆ కోట బురుజుల పైనుంచి చూస్తున్న ఒక అందమైన యువరాణి, అలాగే యుద్ధంలో నలిగిపోతున్న సైనికులు…
ఇలా ప్రతి పెయింటింగ్ ఎంతో అందం గా రూపు దిద్దుకొని వుంది.. అక్కడ వున్నా ప్రతి ఆర్ట్  వెనుక ఒక కథను చూపిస్తూ..అందరిని కూడా ఆ రోజుల్లోని వారిని తీసుకుపోతుంది.. 
జీవం ఉట్టిపడేలా వున్నా ఆ పెయింటింగ్స్ వేసింది మరెవరో కాదు.. ఆ అందాల యువరాణి తనేనా అనేలా వుండే..ఒక ముగ్ద మనోహరి..సియా..
సియా అంటే ఈ తరం మోడ్రన్ ఆర్టిస్ట్స్ లో ఒక సెన్సేషన్. ఆమె రూపాన్ని చూస్తే చాలా మోడ్రన్, ఇండిపెండెంట్, అల్ట్రా-స్టైలిష్ అమ్మాయిలా కనిపిస్తుంది..
ఎమరాల్డ్ గ్రీన్ కలర్ డిజైనర్ ఇండో-వెస్ట్రన్ గౌన్, సింపుల్ డైమండ్ నెక్లెస్,  కళ్లలో ఏమాత్రం తగ్గని కాన్ఫిడెంట్, పెదవుల పై అందరిని మాయ చేయగల మనోహరమైన నవ్వు..ఆమె నవ్వులో ఒక పవర్ ఉంటుంది..
గ్యాలరీకి వచ్చిన పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్  అంతా కుడా ఆమె  చేసిన ఆ పెయింటింగ్స్ ని కోట్ల రూపాయలు పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు..
సియా అందరికీ చాలా ప్రొఫెషనల్ గా, స్మార్ట్ గా థాంక్స్ చెప్తూ ఆర్ట్ గ్యాలరీ మధ్యలో నిలబడింది..కానీ, ఆమె ఆ నవ్వు వెనుక, ఆ గ్లామర్ వెనుక ఎవరికీ తెలియని ఒక పెద్ద సస్పెన్స్ దాగి ఉంది…
బయట ప్రపంచానికి ఆమె ఒక సక్సెస్ ఫుల్ మోడ్రన్ పెయింటర్. కానీ ఆమె అంతరాత్మకు మాత్రమే తెలుసు, ఆ పెయింటింగ్స్ తను ప్లాన్ చేసి వేసినవి కావు అని…
తనకు తెలియకుండానే, తన చేతులు ఆ కాన్వాస్ పై ఆ బొమ్మలను గీసేస్తున్నాయి.. అని, ముఖ్యంగా ఆ కోట, ఆ యువరాణి ముఖం ఆమె మైండ్ లో ఒక ముద్రలా పడిపోయాయి..
చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నా, సియా కళ్లు మాత్రం గ్యాలరీ చివరి గదిలో ఉన్న ఒక పెద్ద కాన్వాస్ వైపు చూస్తున్నాయి, అది ఎవరి కంట పడకుండా ఇప్పటికి దానిపై ఇంకా క్లాత్ కప్పే ఉంది..
అదే ఈరోజు ప్రదర్శనలోని చీఫ్ ఆర్ట్ పీస్.. సెంటర్ అఫ్ అట్రాక్షన్ కూడా!
అప్పుడే  అప్పటి వరకు ప్రశాంతంగా వున్నా వాతావరణం కాస్త.. హడావిడి మొదలు అయింది..సడన్‌గా గ్యాలరీలోకి మీడియా జర్నలిస్ట్స్ కెమెరా లైట్స్ మరియు మైక్స్‌తో ఎంటర్ అయ్యారు..
సియా చుట్టూ కెమెరా ఫ్లాష్ లైట్స్ ఒకేసారి గ్లో అయ్యాయి. హైదరాబాద్ లోనే కాకుండా నేషనల్ లెవెల్లో ఆమె ఎగ్జిబిషన్ కి మంచి హైప్ రావడంతో టాప్ ఛానెల్స్ అన్నీ లైవ్ కవరేజ్ ఇస్తున్నాయి అక్కడ..
ఒక సీనియర్ ఆర్ట్ జర్నలిస్ట్ మైక్ సియా వైపు పెట్టి ప్రశ్న అడగడం స్టార్ట్ చేశాడు..”కాంగ్రాచులేషన్స్ మిస్ సియా ! మీ పెయింటింగ్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి..
కానీ మాకొక పెద్ద డౌట్ ఉంది. మీరు చూస్తే చాలా మోడ్రన్ అండ్ అల్ట్రా-నెక్స్ట్ జెన్ అమ్మాయిలా కనిపిస్తారు..
మీ లైఫ్ స్టైల్ అండ్ ఇంకా మీ థాట్స్ అన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ కి దగ్గరగా ఉంటాయి..
కానీ మీరు గీసే ఈ ప్రతి బొమ్మలోనూ ఒక 800 ఏళ్ల నాటి పాత కాలపు కోట, ఒక సాంప్రదాయమైన యువరాణి, ఆ యుద్ధ వాతావరణం  కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి..
అసలు మీకు ఈ పెయింటింగ్స్ వేయడానికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుండి వచ్చింది? 
మీరు ఏమైనా హిస్టారికల్ బుక్స్ చదివి రిఫరెన్స్ గా తీసుకొని ఇవి గీస్తున్నారా?” అని అడిగాడు..
రిపోర్టర్ ప్రశ్న కి సియా ఒక చిన్న కాన్ఫిడెంట్ స్మైల్ ఇచ్చింది..
సియా తన ముందు వున్నా మైక్ అందుకుని చాలా క్రిస్ప్ గా, పాష్ ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ మాట్లాడటం స్టార్ట్ చేసింది..
“థాంక్యూ ఫర్ ద క్వశ్చన్..జనరల్ గా చాలామంది ఆర్టిస్ట్స్ కి ఒక మోడల్ లేదా ఒక రియల్ లొకేషన్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది..
కానీ నా కేసులో అది టోటల్లీ డిఫరెంట్. నేను ఎలాంటి హిస్టారికల్ బుక్స్ చదవలేదు, ఏ కోటని విజిట్ చేయలేదు..
అండ్ ఇట్స్ జస్ట్ మై సబ్‌కాన్షియస్ డ్రైవ్. నేను బ్రష్ చేతిలోకి తీసుకోగానే, నా బ్రెయిన్ లో కొన్ని విజువల్స్ ఫ్లాష్ అవుతాయి…ఐ జస్ట్ ఫాలో దట్ ఫ్లో,” అంది చాలా క్యాజువల్ గా.”
* * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️