New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా జత నీవని 💘 – 1

నా జత నీవని 💘 – 1

హైదరాబాద్ నగరం ఉదయపు వెలుగుల్లో మెల్లగా మేల్కొంటోంది………. !! రోడ్ మీద నుండి వస్తున్న ట్రాఫిక్ సౌండ్స్, జనాల సందడి తో ఉదయపు పరుగుల హడావుడి మొదలైంది………. !! హైదరాబాద్ లోని ఒక డీసెంట్ ఏరియా లో ఉన్న మాలతి లేడీస్ హాస్టల్ ………. !! అప్పటికే టైమ్ మార్నింగ్ తొమ్మిది అవుతూ ఉండడం తో హాస్టల్‌లోని చాలామంది అమ్మాయిలు తమ రెగ్యులర్ వర్క్స్ లైక్ కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళిపోయారు………… !!  కానీ సెకండ్ ఫ్లోర్‌లోని రూమ్ నంబర్ 204 లో మాత్రం చాలా సైలెంట్ గా ఉంది…….. !! ఆ రూమ్‌లోని ఒక బెడ్‌పై ఒక అమ్మాయి దుప్పటి నిండుగా మొహం వరకు కప్పుకుని చిన్నపిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది………… !! సూర్యుని లేత కిరణాలు విండో కర్టెన్స్ ను దాటి లోపలికి వచ్చి సరిగ్గా ఆ అమ్మాయ్ మొహం మీద పడుతున్నాయి………. !! ఆ వెలుతురు తన నిద్రను డిస్టర్బ్ చేస్తుండటంతో ఆ అమ్మాయ్ చిరాగ్గా ముఖం మరో వైపు తిప్పుకుని దుప్పటిని మరింత పైకి లాక్కుంది………. !! 

అప్పుడే వాష్ రూమ్ నుండి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చింది ఆ అమ్మాయ్ రూమ్‌మేట్ & బెస్ట్ ఫ్రెండ్ అను…………. !! తడి జుట్టును టవల్‌తో తుచుకుంటూ బెడ్‌పై ఇంకా నిద్రపోతున్న భూమిని చూసి తల కొట్టుకుంది……….. !! అబ్బా ఏంటే నువ్వు ఇంకా లేవలేదా నిన్ను నేను స్నానానికి వెళ్ళే ముందు లేపే కదా వెళ్ళాను……….. ?? అయినా ఇంకా లేవకుండా మొద్దులా పడుకున్నావ్ ముందు లేవ్వే ఇక్కడే సగం రోజు అయిపోతోంది అని అను గట్టిగా అరుస్తుంది……… !! 
కానీ ఆ అమ్మాయి మాత్రం అస్సలు లేచే ఉద్దేశం లేనట్టు మళ్లీ అటు వైపు తిరిగి మొహానికి పిల్లో అడ్డం పెట్టుకుని హాయిగా పడుకుంది……… !! 
అది చూసిన అను నవ్వుకుంటూ భూమి దగ్గరగా వచ్చి బెడ్‌పై కూర్చుంది………. !! భూమి భుజం తడుతూ ప్లీజ్ భూమి లేవే టైమ్ ఆల్రెడీ 9:30 అవుతోంది……… !! రేపే కదా ప్రియేష్ బర్త్‌డే నైట్ ప్లాన్స్ అన్నీ చెప్పావ్ కదా అప్పుడే మర్చిపోయావా ఏంటి ………..??ఆ మాట వినగానే మన భూమి చటుక్కున కళ్ళు తెరిచి నిద్ర మత్తులో ఉన్న కళ్ళను తుడుచుకుంటూ పైకి లేచి కూర్చుంది……….. !! వెంటనే తన బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న స్మార్ట్‌ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసింది……….. !! స్క్రీన్ పైన కనిపిస్తున్న వాల్‌పేపర్ చూసి భూమి పెదవులపై ఒక నవ్వు మెరిసింది ………. !! ప్రియేష్, భూమి, అను ముగ్గురూ కలిసి నవ్వుతూ దిగిన అందమైన పిక్ చూసి……….. !! అను నవ్వుతూ భూమి రోజు ఉదయాన్నే ఆ పిక్ చూడందే ఎవరి మొహం చూడవా ఏంటి……..?? అంత సెంటిమెంట్ ఏంటే నీకు ఆ పిక్ అంటే………….?? 
భూమి నెమ్మదిగా ఫోన్ పక్కన పెట్టి అనుని గట్టిగా హగ్ చేసుకుంటూ…………. !! అవును అను నిజంగా నాకు అదో సెంటిమెంట్ అంతే………… !! మీరిద్దరూ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మీరు లేకుండా నా లైఫ్ ఇమాజిన్ కూడా చేసుకోలేను………… !! అందుకే డెయిలీ లేవగానే మార్నింగ్ ఈ పిక్ చూస్తే రోజంతా చాలా పాజిటివ్‌గా ఉంటుంది ………… !! అని చెప్పి గుడ్ మార్నింగ్ అను అంటూ అప్పటికే టైమ్ 10 అవ్వడం తో ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్‌కి పరిగెడుతుంది………. !! 
అను నవ్వుకుంటూ పిచ్చి పిల్ల అని వెళ్ళిన భూమి వైపే చూస్తూ రూమ్‌లోని బెడ్స్ సర్దుతూ ………… !! మాల్ కి వెళ్ళడానికి డ్రెస్ సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది……….. !! 
కాసేపటికి భూమి కూడా ఫ్రెష్ అయి వచ్చి ఒక క్లాసీ డ్రెస్ వేసుకుని ఫాస్ట్ గా రెడీ అవుతుంది………. !! ఇద్దరూ రెడీ అయ్యాక కింద ఉన్న మెస్‌కి వెళ్లి వేడి వేడి గా బ్రేక్ఫాస్ట్ చేసి ప్రియేష్ కోసం గిఫ్ట్స్ కొనడానికి దగ్గర్లోని పెద్ద షాపింగ్ మాల్‌కి బయలుదేరారు……….. !! 
బస్ లో వెళ్తుండగా భూమి విండో సీటు దగ్గర కూర్చుని బయటకు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోతుంది ……….. !! నిజం చెప్పాలంటే భూమి జీవితం చిన్నప్పటి నుంచీ ఒక కన్నీటి కావ్యమే……… !! భూమికి 4 ఇయర్స్ ఉన్నప్పుడే తన పేరెంట్స్ ఒక ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయారు…………… !! అప్పటి నుండి భూమికి నా ‘ అని చెప్పుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు……….. !! బంధువులు అందరూ భూమి ను దూరం పెట్టినా భూమి తల్లికి అన్నయ్య అయిన శంకర్ మాత్రం భూమి బాధ్యతను తీసుకున్నాడు……….. !! శంకర్‌కి చెల్లెలంటే ప్రాణం అందుకే చెల్లెలి కూతురైన భూమిని తన సొంత కూతురిలా చూసుకోవాలని ఇంటికి తీసుకువచ్చాడు………. !! కానీ శంకర్ భార్య అరుణ మాత్రం భూమిని మొదటి రోజే ద్వేషించడం మొదలుపెట్టింది…………. !! తన ఇంటికి వచ్చిన ఒక అనాథగా భూమిని చూసేది శంకర్ భూమిని ప్రేమగా చూసుకోవడం అరుణకి అస్సలు నచ్చేది కాదు………. !! భూమి పెరుగుతున్న కొద్దీ అరుణ క్రూరత్వం కూడా పెరిగింది………… !! 
 చిన్న వయసు నుంచే భూమితో ఇంటి పనులన్నీ చేయించేది……….. !! పొద్దున్నే లేచి ఇల్లు తుడవటం, గిన్నెలు తోమటం, కుకింగ్ లో హెల్ప్ చేయడం ఇలా ప్రతీ పని భూమి పైనే వేసేది………. !! అయినా భూమి చిన్నప్పటి నుంచే చాలా ఓర్పు, సహనం ఉన్న అమ్మాయి………. !! తన మావయ్య శంకర్ పడే కష్టాన్ని చూసి, అత్తయ్య పెడుతున్న టార్చర్‌ను నోరుమెదపకుండా భరించేది……….. !! ఎప్పుడూ మావయ్యకి అత్తయ్య వల్ల ప్రాబ్లమ్స్ రాకూడదని ఆలోచించేది……….. !! కానీ రోజు రోజుకు అరుణ వేధింపులు హద్దులు దాటిపోయాయి………….. !! భూమి తన స్టడీస్ ఫినిష్ పూర్తి చేసుకునే టైమ్ కి అరుణ భూమి ను మరింత ఘోరంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది…………. !! ఒకరోజు శంకర్ ఇంటికి వచ్చేసరికి అరుణ భూమిపై చెయ్యి చేసుకోవడం చూసేశాడు………… !! 
అది సహించలేని శంకర్ ఇక్కడే ఉంటే భూమి ఫ్యూచర్ నాశనం అయిపోతుందని భయపడ్డాడు……… !! దాంతో బాగా ఆలోచించి భూమి ను దగ్గరకు తీసుకుని భూమి ఇక్కడ ఉంటే నువ్వు నీ చదువును కంటిన్యూ చేయలేవు………. !! నిన్ను హైదరాబాద్‌లోని ఒక మంచి లేడీస్ హాస్టల్‌లో జాయిన్ చేస్తాను………. !! అక్కడే ఉండి చదువుకో నిన్ను చూడాలనిపించినప్పుడు నేను వచ్చి చూసి వెళ్తాను సరేనా……….. !! భూమికి తన మావయ్యను విడిచి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇంట్లో రోజూ జరిగే గొడవల వల్ల మావయ్య పడుతున్న వేదన చూడలేక అయిష్టంగానే ఒప్పుకుంది………… !! అప్పటి నుండి భూమి హాస్టల్‌లోనే ఉంటూ తన చదువు ఫినిష్ చేసింది……….. !! హాలిడేస్ లో అప్పుడప్పుడు ఊరికి వెళ్లేది కానీ అక్కడ కూడా వాళ్ళ అత్త అరుణ ఏదో ఒక రకంగా భూమిని మాటలతో బాధపెడుతూనే ఉండేది………… !! 
కష్టపడి చదివిన భూమికి త్వరలోనే హైదరాబాద్‌లోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో (MNC) సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది………… !! జాబ్ వచ్చాక భూమి financially independent గా ఉండేది…….. !! తను జాబ్ లో జాయిన్ అయ్యాక తనకు అవసరమైనంత మనీ ఉంచుకుని మిగిలిన సాలరీ అంతా తన మావయ్య శంకర్ ఎకౌంట్‌కే పంపించేది……….. !! శంకర్‌కి పిల్లలు లేకపోవడం వల్ల భూమిని తన కంటికి రెప్పలా చూసుకునేవాడు……….. !! భూమి పంపిన డబ్బును శంకర్ తను యూస్ చేసుకోకుండా అరుణకి తెలియకుండా సీక్రెట్ గా భూమి పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ ఎకౌంట్‌లో వేసేవాడు………… !! భూమి కష్టపడి సంపాదించిన రూపాయి రేపు తన పెళ్ళికి ఉపయోగపడుతుంది అని శంకర్ అనుకునేవాడు………!! 
భూమి జాబ్ లో జాయిన్ అయిన కొత్తలోనే తనకు అక్కడ అను మరియు ప్రియేష్ పరిచయమయ్యారు………. !! 
భూమి అంటున్న అను వాయిస్ విని భూమి తన ఆలోచనల నుంచి బయటకు వచ్చింది………… !! ఏయ్ నిన్నేనే ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్ సరే మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది దిగు అంటూ ఇద్దరూ బస్ దిగి నవ్వుకుంటూ మాల్‌లోకి అడుగుపెట్టారు……….. !! 
హలో రీడర్స్ ♥️………!!
నా కొత్త స్టోరీ నా జత నీవని తో మీ ముందుకు మళ్ళీ వచ్చేశాను………!! 🥰✨
మన ఫస్ట్ పార్ట్‌లో హీరోయిన్ భూమిని మీకు పరిచయం చేశాను………!! 
చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన మావయ్య ప్రేమను గుండెల్లో దాచుకుని………!! తన కాళ్లపై తాను నిలబడిన భూమి మీకు ఎలా అనిపించింది………?? 🥺❤️
అలాగే భూమి–అను–ప్రియేష్ ముగ్గురి friendship మీకు ఎలా అనిపించింది………??
భూమి జీవితంలో ఇంతవరకు జరిగిన విషయాలు చదివిన తర్వాత……….. !! ఆమె future ఎలా ఉండబోతుందో మీకు ఏమైనా guesses ఉన్నాయా…….?? 
ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే Next Part‌లో మన హీరోని మీకు పరిచయం చేయబోతున్నాను……..!! 😍🔥
హీరో ఎలాంటి వాడై ఉంటాడని అనుకుంటున్నారు……….??
భూమి జీవితంలోకి అతను ఎలా వస్తాడు………?? 
మరి చెప్పండి…….!! 
నా జత నీవని First Part మీకు ఎలా అనిపించింది……….?? ❤️
మీకు నచ్చిన సీన్ ఏది? భూమి క్యారెక్టర్ ఎలా అనిపించింది……..??
మీ comments చదవడం నాకు ఎప్పుడూ చాలా special…………!! 🥰
కాబట్టి మీ opinion ఏదైనా సరే open గా comment చేయండి………. !! 
మీ ఒక్క comment కూడా నాకు next part రాయడానికి చాలా motivation ఇస్తుంది………. !! So please comment guys………!!❤️✨
Continues ❣️