New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వివాహం -1 – 1

వివాహం -1 – 1

అదొక పెద్ద కళ్యాణ మండపం . అభిరామ్ వెడ్స్ ధరణి అని అందమైన అక్షరాలతో రాసి ఉంది. 

          అమ్మాయి మెూహం కళకళలాడుతూ ఉంది కానీ పెళ్లి కొడుకు మోహం మాత్రము ఏలాంటి కళా లేదు. 
       కేవలం తన కుటుంబం కోసమే చేసుకుంటున్నాడు అని అర్ధం అవుతుంది. అభి వాళ్ళ అమ్మ  ఆవిడ పేరు జానకి, తండ్రి పేరు రాజారావు. తనకి ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. తమ్ముడు పేరు ఆకాశ్,చెల్లి పేరు నీరజ. చెల్లికి అంతకుముందే పెళ్లి అయింది 6 మంత్స్ అవుతుంది. మంచి వ్యక్తి చాలా బాగా చూసుకుంటాడు నీరజని.
జానకి గారు :- రేయ్ , అభి కాస్త సరదాగా ఉండరా అలా ఉంటే చూసిన వాళ్లు ఏమని అనుకుంటారు. నువ్వు ఇలా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అని అంటుంది. 
అభి:- అమ్మ ప్లిస్ నువ్వు బాధ పడకు నాకు ఇష్టము లేకుండ నేను ఎలా సంతోషము గా ఉంటాను అని అంటాడు. 
అమ్మ:- తప్పు అభి ఎప్పుడో జరిగిన దానిని ఇంకా అదే గుర్తుచేసుకుంటూ ఉంటే ఎలా చెప్పు అని అంటుంది ఈ లోపు అభి వాళ్ళ నాన్న గారు వస్తారు. 
నాన్న:- ఎంటి తల్లి కొడుకు లు ఏవో మాటలాడు కుంటున్నారు అని అంటారు . 
అమ్మ :- అబ్బే అదేం లేదండి ఏదో సరదాగా అని చెప్పింది. 
ఈలోపు ఎవరో వస్తే ఆయన వెళ్లి పోతారు. అభి కి నచ్చజెప్పుతుంది. 
           అభి నవ్వి ఊరుకుంటాడు  కాని తన మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నవి. 
అప్పుడే అభి ఫెండ్స్ ఎంట్రీ ఇచ్చారు. అభి కి బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇద్దరు మంచి ఫెండ్స్. తనతో అన్ని విషయాలు చెప్పు కుంటాడు. 
మనోజ్:- రేయ్, బావ ఎందుకురా అలా ఉంటావు జరిగిపోయినదాని గురించి ఆలోచించడం, అని అంటాడు. 
అభి:- నువ్వు కూడా మెుదలు పెట్టావ ఎందుకురా ….. 
మనోజ్:- అది కాదురా , అమ్మ వాళ్ళు బాధపడతారు కదా… 
అభి:- అందుకేగా , పెళ్లి చేసుకుంటున్న కదా 
మనోజ్:- అంటే మరి….. 
ఈలోపు మిగతా వాళ్ళు కూడా వస్తారు… వాళ్ల డిస్కషన్ ఇంకా ఆపేసారు….. 
రవి :- మన అభి గాడికి పెళ్ళి అంటే ఎంతో హడవూడి  ఉంటుంది అనుకుంటే ఎంట్రా ఇంత డల్ గా ఉంది. 
మనోజ్:- నీకు ఏం తక్కువ అయింది రా అంతా బాగానే ఉంది గా. 
రవి:- అంతా బాగానే ఉంది కానీ పెళ్లి కొడుకు ముఖం డల్ గా ఉన్నట్టు ఉందే. 
అభి:- పంచ్ ఇచ్చాడు కడుపులో. 
రవి:- నువ్వు మారవు రా బాబు……. 
మనోజ్:- వాడిని ఎందుకురా రెచ్చగొట్టి, తన్నులు తింటావు అని  నవ్వు తాడు. 
     ఆకాశ్ వస్తాడు . 
ఆకాశ్:- అన్నయ పిలుస్తున్నారు నిన్ను అని అంటాడు.
      అందరూ మండపంలోకి బయలుదేరుతారు……. 
పంతులు గారు పెళ్లి కొడుకు చేత పూజ చేయిస్తారు. మధ్య లో తెర అడ్డుగా కడతారు…… 
నీరజ , ఆమె భర్త వినోద్ వచ్చి పెళ్లి కొడుకు పక్కన ఉంటారు.. 
ఈలోపు పెళ్లి కూతురు ఎంట్రీ …… 
వినోద్:- బావ నా చెల్లీ వస్తుంది ఒకసారి చూడు…….. 
అభి:- నవ్వలేక నవ్వు తాడు……. 
ధరణి, అభి ఎదురు ఎదురుగా కూర్చునారు. 
ధరణి వాళ్ళ అమ్మ గారు సుజాత, తండ్రి దేవేంద్ర గారు. పేరు ఉన్న వాళ్ళే…… 
ఒక్కగానొక్క కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంటే రెండు కళ్లు చాలడం లేదు. 
ఇంతలో పంతులు గారు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు దేవేంద్ర గారు. 
అభి కాళ్లు కడుగుతారు.
పెళ్లి జరిగింది…….. 
అప్పగింతలు………… 
అప్పగింతలు సమయంలో… 
దేవేంద్ర గారు:- బాబు, నా కూతురు ని బాగా చూసుకో  అని ఎమెాషన్ల్ అవుతారు…. 
అభి:- నవ్వి , అలాగే నండి……. 
సుజాత గారు:- ధరణి జాగ్రత్తగా ఉండు తల్లి… 
దేవేంద్ర గారు:- కూతురు నుదిటి మీద  ముద్దుపెట్టుకొని అత్తగారింటికి సాగనంపుతాడు……. 
ధరణి:- ఏడుస్తూ, వెళ్లోస్తాను  అని  చెప్పి  బయలుదేరుతారు……… 
           అందరూ ధరణి వాళ్ళ అమ్మ వాళ్ళ కి వీడ్కోలు చెప్పి కారులో బయలుదేరుతారు……..  
        ధరణి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నయి…. 
కారులో అభి, ధరణి పక్క పక్కన కూర్చుని ఉంటారు.. 
ధరణి ఎంతో బాధ పడుతుంది. నీరజ, వినోద్ వాళ్ళ తో పాటు వస్తారు. 
నీరజ:- వదిన, బాధ పడకు.  అన్నయ వదిన ని ఊరుకో పెట్టు. 
అభి:- ఎంటి నేనా……. 
వినోద్:- లేకపోతే మేమ…… 
ఏంటి బావ నువ్వు , నా చెల్లీ అంత బాధ పడుతుంటే అలా చూసిన తరువాత కూడా తనని ఊరుకో పెట్టకుండా సైలెంట్ గా ఉన్నావు……. 
అభి ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంతలో ఇళ్లు వస్తుంది. అందరూ కారు దిగుతారు……….. 
ధరణి అత్త గారింటికి వస్తారు……….. 
అభి, ధరణి ఇద్దరు దిగి లోపలికి వెళ్లేలోపు నీరజ ఆపేస్తుంది.
నీరజ:- ఏంటి లోపలికి వచ్చేదమనే  నేనుండగాన. ఇద్దరు పేర్లు చెప్పి అప్పుడు లోనికి రావాలని తెలియద ఏంటి……… 
వినోద్:- బావ, ముందు నువ్వే చెప్పు నా చెల్లీ పేరు. 
నీరజ:- అవును, అన్నయ చెప్పు తొందరగా…… 
ఆకాశ్:- చెప్పు అన్నయ……. 
జానకి గారు:- ఏంటి అప్పుడే, అక్క తమ్ముడు వదిన పార్టీ అయిపోయార……… 
ధరణి:- నవ్వు తుంది….. 
రాజారావు గారు :- రేయ్, తొందరగా కానియ్యండి… 
నీరజ:- చెప్పండి… 
జానకి గారు:- అభి చెప్పు నాన్న….. 
అభి:- చంపుతున్నారు అని అనుకొని, 
      నేను ,తను వచ్చాం…. 
నీరజ, వినోద్:- తను అంటే ఎవరు బాబు……. 
       అందరూ నవ్వుతారు……. 
అభి:- కోపం వచ్చిన మనసులో దాచుకొని, పైకి నేను ధరణి వచ్చాం…. ఒకే 
ధరణి పెదవులపై తన పేరు పలికేసరికి చిరు నవ్వు వస్తుంది…….. 
నీరజ:- వదిన నువ్వే చెప్పు….. 
ధరణి:- నేను మా వారు అభిరామ్ గారు వచ్చాం……… 
వినోద్:- చూడు బావ, నా చెల్లీ ఎంత బాగా చెప్పిందో…. 
నీరజ:- సరే, లోపలికి రండి. అని హరతీ ఇచ్చి లోపలికి తీసుకు వస్తారు….. 
జానకి గారు:- ధరణి రా, దేవుని దగ్గర దీపం వెలిగించాలి ……. 
ధరణి:- అలాగే నండి……… 
దంపతులు దేవుని దగ్గర దండం పెట్టుకుంటారు…… 
అభి:- అమ్మ, నేను రెస్ట్ తీసుకోవాలి అని తన రూమ్ కి వెళ్లి పోతాడు……… 
జానకి గారు:- ధరణి నువ్వు ఈ గదిలో రెస్ట్ తీసుకో తల్లి అని చెప్పుతుంది…….. 
ధరణి:- అలాగే నండి. 
జానకి గారు:- అండి ఎందుకమ్మ, అత్తయ్య అని పిలువు……. 
ధరణి:- అలాగే అత్తయ్య….. 
జానకి గారు:- నవ్వి, నీరజ వదిన తో పాటు వెళ్లు….. 
నీరజ:- అలాగే అమ్మ….. 
        ఇద్దరు గదిలోనికి వెళ్లి పోతారు……. 
అభి గదిలో….. 
అభి:- మెడలోని దండను విసిరి కొడతాడు. ఎంతకీ కోపం తగ్గడం లేదు. తన మీద తనకే కోపం వచ్చేస్తుంది.
  కాసేపటికి సాన్నం చేసి వస్తాడు.. తరువాత వర్క్ చేసుకుంటాడు. 
     అభి దగ్గరకు జానకి గారు వస్తారు….. 
         ఇంకా ఉంది….