New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందని జాబిల్లి – 1

అందని జాబిల్లి – 1

మహారాష్ట్ర సరిహద్దుల ప్రాంగణం

మహారాష్ట్రలో  చెలరేగుతున్న తుఫాన్ కారణంగా అక్కడ కొండ ప్రదేశంలో ఉన్న శివాలయాలు, శక్తి పీఠాలు, అమ్మవారి గర్భగుడులు మూతపడ్డాయి 
అదంతా సరిహద్దుల ప్రాంగణం కావడంతో గిరిజనులు ఎక్కువ నివసిస్తారు అయితే సరైన సదుపాయాలు లేక  తలదాచుకునే ఇల్లులు కూడా లేక ఎంతో సాహసం చేస్తున్న గిరిజనులందరినీ ప్రభుత్వం ఒక చెంతకు చేరుస్తుంది సురక్షితంగా ఉండటానికి 
కానీ అదే ప్రాంగణంలో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన గోదావరి ఒడ్డున చేపలు పట్టడానికి వెళ్ళిన జాలరెలు కొంతమంది ఆ ఒడ్డుని ఉండిపోవాల్సి వస్తుంది తిరిగి వచ్చే దారి లేక 
సుమారు 10 నుండి 15 మంది ఉంటారు మీద నుంచి కొండపోతగా కురుస్తున్న వర్షం… వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉరుములు శబ్దాలు… కనీసం తల దాచుకోవడానికి చిన్న చెట్టు నీడ కూడా లేని ప్రదేశం… వాళ్లందరికీ ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తోచక బిక్కు బిక్కు బంటు ఆ వడ్డున కూర్చున్న వారిలో ఒకరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దమవుతాయి 
వెంటనే తను చూస్తుంది నిజమా కాదా అని ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి చూస్తాడు మళ్లీ అదే దృశ్యం ఇంతకుముందు ఏదైతే అతని కంటపడ్డాదో అదే దృశ్యం ఇప్పుడు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంటే అదెలా సాధ్యం అన్నట్లు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోతాడు 
బీభత్సంగా పుడుతున్న చలిలో వాళ్లకి వేచ్చదనం దొరక్క ఎవరి అవస్థలు వాళ్ళు పడుతున్న వేళ మిగిలిన వారి దృష్టి అతని మీద పడలేదు 
ఒకసారి అటుచూడండీ అని నెమ్మదిగా గొంతు పెగల్చుకొని మొదట చూసిన వ్యక్తి మిగిలిన వారితో అనగానే అందరూ అటువైపు చూస్తారు 
ఇదేలా సాధ్యం రా !! అని ఒకరంటే ఇంకొకరు ఇదేదో భయంకరమైన సన్నివేశంల కనిపిస్తుంది రా !! అది నిజమేనా లేకపోతే ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎవరు వస్తారు అసలు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా 
అలా అయితే అది దెయ్యం ఏమైనా కావచ్చు ఏమో అని ఇంకొకడు భయపడుతూ అంటాడు… లేదురా అది దెయ్యం కాదు చిన్న పాప చూడు ఇప్పుడే పుట్టిన పసికందు ఆ పసికందు నీ పట్టుకొని అలా అంటావేంటి ఎలాంటి ఆపదలో ఉంటే తనవాళ్లు తనని ఇక్కడ వదిలేసారో ఏమో మనం కాపాడుదాం అని అంటూ వాళ్లలో ఉన్న ఒక ధైర్యవంతుడు మీదకు లెగుస్తాడు 
రేయ్ రాజయ్య !! నేను చెప్పింది వినరా ఇప్పుడు మనం ఈ వర్షానికి కొట్టుకుపోయేలా ఉన్నాం ఇదంతా బురద ఈ బురదలో అడగు వేస్తే జారి కింద పడటం ఖాయం 
ఇలాంటి పరిస్థితులో మనం ఆ గోదావరిలో దిగితే మన ప్రాణం పోతుంది…. ప్రాణాలకు తెగించి మరి ఇలాంటి సాహసం చేయడం అవసరమా అని ఇంకొకరు అంటారు ఆ వెళ్తున్న వాడి చేయి పట్టుకొని ఆపుతూ 
లేదురా నేను అలా వదిలేయలేను అని అంటూ రెండు అడుగులు ముందుకు వేసాడో లేదో వాళ్ళందరూ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి ఎందుకంటే కురుస్తున్న కొండపోత వర్షానికి గాలి తోడై ఆ నీరు ప్రవాహం మరింత ఉద్రిక్తంగా మారి కొన్ని క్షణాల్లోనే అక్కడ అదృశ్యమైన పాప మాయమవుతుంది 
వాళ్లు కళ్ళని దృష్టిసారించి ఎటు చూసినా ఆ పాప కనిపించలేదు… ఇది ఏదో మాయ శక్తి లా ఉంది అని అనుకుంటారు వాళ్ళందరూ ఆ క్షణం
అవును అది ఒక శక్తి ” అదృశ్య శక్తి ” ఆ శక్తిని ఎవరు ముట్టుకునే సాహసం చేయలేరు ఒకవేళ చేసినా అది వారి ప్రాణానికి ప్రమాదకరం ఆ విషయం వారికి తెలియకపోయినా తృటిలో ప్రమాదంలో నుంచి తప్పించుకున్నారు వాళ్ళందరూ 
సరిగ్గా ఆ క్షణాన అదే మహారాష్ట్ర కొండపై నివసిస్తున్న మహాలక్ష్మి దేవి చిరునవ్వులు చిందిస్తుంది…. అప్పటికి తన బాధ్యత తీరింది అన్నట్లుగా గర్భగుడి గోపురం మీద కూర్చొని ఆ దృశ్యాన్ని తన శక్తివంతమైన కళ్ళతో చూస్తున్నా ఆ మహాలక్ష్మి దేవి ఆ పాప చేరవలసిన ప్రాంతం దిశగా ప్రయాణం కొనసాగించిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి విశ్రాంతిని ఆశయిస్తుంది
                   @@@@@
ఉత్తర ప్రదేశ్ – జార్ఖండ్
రాత్రి వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం… 
కారుచీకటి…..ఆకాశం ఊగిపోతోంది…. వడగళ్లతో కూడిన భారీ వర్షం పడుతోంది…. 
నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది…. ఆ నదీ ప్రవాహంలో ఒక చిన్న వెదురు బుట్ట కొట్టుకుంటూ వస్తోంది 
ఆశ్చర్యకరంగా… చుట్టూ అంత బీభత్సం ఉన్నా, ఆ బుట్టలోకి ఒక్క నీటి చుక్క కూడా పడడం లేదు…. అందులో ఒక ముద్దులొలికే పసిపాప ఏడవకుండా, ప్రశాంతంగా నవ్వుతూ పడుకుని ఉంది
సరిగ్గా అప్పుడే ఆ నది ఒడ్డున నల్లటీ ఆకారంలో ఉన్న  కరుడుగట్టిన దొంగలు ఇద్దరు అక్కడికి వస్తారు
ఇద్దరూ అక్కడే ఉన్నా తెప్ప మీద కూర్చొని ఆ నదిని దాటి పక్క ఊరికి ప్రవేశించే మార్గాన్ని అనుసరిస్తూ సిద్ధమవుతారు 
కానీ వారి ప్రయత్నం విఫలం అవుతుంది అంత వర్షపు హోరులో పిల్ల గాలి కాస్త పెను తుఫానుల చెలరేగి నీటి అలలు వచ్చి వారి తెప్పను కిందకి దొర్లించి అందులో ఉన్న ఒకడు అటుగా వస్తున్న వెదురు బుట్ట మీద పడేటట్లు చేస్తుంది 
ఆ తెప్ప నీ నడుపుతున్న మరొకడు ఆ నీటిలో తనని తాను సంరక్షించుకొనే సమయం కూడా లేనంతగా నీరు వచ్చి ముఖాన్ని బలంగా తాకడంతో ఉక్కిరిబిక్కిరి అయి కొట్టుకుపోతాడు
వెదురు బుట్ట మీద పడిన వాడు కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోతూ ఆ పాపను చేతుల్లోకి తీసుకొని లోపే మేఘావృతమై ఉరుములలోని మెరుపు మెరిసి ఆ కాంతి అతని కళ్ళకి బలంగా తాకడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు…
ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసిన అతనికి అతని ఎదురుగా ఉన్న బుట్ట కనిపించదు… ఆలోచించే లోపే మళ్లీ ఈదురు గాలితో బలంగా వచ్చిన అల అతని ముఖాన్ని తాకి నీటిలో మునిగిపోతాడు
                 @@@@@
అదొక అందమైన ప్రకృతి రమణీయతతో కూడిన పల్లెటూరు… ఆ ఊరి పేరు “అమ్మవారి పాడు” తెల్లవారుజామున నది ఒడ్డున ఇసుక తోడేందుకు వెళ్లిన ఒక గ్రామస్థుడు నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ వెదురు బుట్టను చూస్తాడు
అందులో పాపను చూసి ఆశ్చర్యపోతాడు… వెంటనే ఆ పాపను ఎత్తుకుని, ఊరిలో అందరూ గౌరవించే పంతులు గారి ఇంటికి పరిగెడతాడు
అదే ఊరి చివరలో ఉన్న ఇంటికి తీసుకు వెళ్ళి ” అయ్యోరూ… అయ్యోరూ… నది ఒడ్డున ఈ పాప దొరికింది” అని అంటూ ఆ పాపని పంతులు గారు చేతికి అందిస్తాడు 
నడివయస్కుడు, ముఖంలో దైవకళ ఉట్టిపడే వ్యక్తి సుమారు 50 ఏళ్లు వయసు ఉన్న పంతులు గారు ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుంటారు
ఆ క్షణంలో ఊరి గుడిలోని అమ్మవారి గంటలు ఒక్కసారిగా గట్టిగా మోగుతాయి… గుడికి ప్రాంగణం చుట్టూ బలమైన ఈదురు గాలులు వీచి దుమ్ము ధూళి రేకెత్తుతుంది పంతులు గారు ఆశ్చర్యంతో పాపను చూస్తుండగా, పాప తన చిన్నారి గుప్పిట తెరుస్తుంది
ఆ గుప్పిట్లో మెరిసిపోతున్న ఒక ” దివ్యమైన ముక్కుపుడక ” ఉంటుంది
పంతులు గారు ఆశ్చర్యంతో, కళ్లలో నీళ్లతో ” శివ శివ! ఇది సాక్షాత్తు మన ఊరి అమ్మవారి ముక్కుపుడక ! నిన్న రాత్రి గుడిలో దొంగతనం జరిగిందని ఊరంతా వెతుకుతుంటే… అమ్మవారే ఇలా చిన్న పాప రూపంలో ఈ ఊరికి తిరిగి వచ్చి పోయిన తన శక్తిని తిరిగి రప్పించుకుంది ?! ” అని అంటూ మనసులోని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు
” చూస్తుంటే కొన్ని గంటల క్రితమే జన్మించినట్టు ఉంది కదండీ ” అని అంటారు పంతులు గారి భార్య బొడ్డు కూడా కోయలేని పసికందు వైపు చూస్తూ 
అవును రమణి… నువ్వు ఈ పాపని పట్టుకో నేను వెళ్లి ఈ పాప జాతకం చూసి వస్తాను స్వయంగా అమ్మవారే మన దగ్గరికి ఈ బిడ్డని ఎందుకు తీసుకువచ్చిందో అని అనుకుంటూ పంతులు గారు వెంటనే తన గదిలోకి వెళ్లి తాళపత్ర గ్రంథాలు, జాతక చక్రాలు తీసి, ఆ పాప పుట్టిన తిథి, నక్షత్రాల ఆధారంగా జాతకం రాయడం మొదలు పెడతారు జాతకం పూర్తవగానే ఆయన చేతులు వణుకుతాయి
ఆయన ముఖంలో భయం, భక్తి ఒకేసారి కనిపిస్తాయి
” ఇది సామాన్యమైన జాతకం కాదు… సాక్షాత్తు ఆ జగన్మాత జాతకంతో ప్రతి అక్షరం, ప్రతి గ్రహాల స్థానం సరిగ్గా సరిపోలింది… ఈమె ” మహత్ జాతకురాలు ” ఈ ఊరిని రక్షించడానికి వచ్చిన దేవత ! “
కానీ, అదే జాతకంలో ఒక మలుపును చూసి ఆయన కళ్లు పెద్దవవుతాయి….
వెంటనే బయటికి వచ్చి ఆ పాపని తీసుకువచ్చిన ఆయన వైపు చూస్తూ !! బసవయ్య ఈ పాప ఈ ఊరిలోకి అడుగుపెట్టినట్లుగా నీకు కనిపిస్తే నువ్వు తీసుకు వచ్చినట్లుగా ఎవరికి తెలియకూడదు 
ఈ పాప జన్మ రహస్యం కేవలం మన ముగ్గురి మధ్యలోనే ఉండిపోవాలి…. ఎందుకు ఏమిటి అని అడగకుండా దయచేసి నా మాటకి విలువ ఇచ్చి ఈ పాప గురించి కనీసం మీ ఇంట్లో వాళ్లతో కూడా చర్చించకుండా రహస్యంగానే ఉంచు అని అంటారు అయ్యోరు
ఆయన మాటకి తిరస్కరించే సాహసం ఆ ఊరిలో ఎవరూ చేయరు కాబట్టి ఇప్పుడు కూడా అడిగే సాహసం చేయకుండా ….అట్లాగే అయ్యా !! మరి ఇప్పుడు ఈ పసిపాపని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతాడు బసవయ్య 
ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో ఏ రహస్యాన్ని చేదించడానికి పుట్టిందో తెలియదు కానీ అమ్మవారి జాతకం తో పుట్టిన ఈ మహా జాతకురాలు 
పిల్లలు లేని నా నటింట్లో తిరుగుతూ నా దగ్గరే పెరుగుతుంది… ఆ తర్వాత ఎలా జరగాలని ఉందో ఏం జరగబోతుందో కాలమే నిర్ణయిస్తుంది అంతా దైవీచ్చ అని అంటూ ఆ పాపని చేతుల్లోకి తీసుకొని నుదురు మీద ముద్దు పెడతారూ 
స్టోరీ కంటిన్యూస్….
ఏమి ఆలోచించకుండా జస్ట్ ఫాలో అయిపోండి