మజిలీ – 1
ఉదయం ఆరు గంటలకు అప్పుడే సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తూ ఉన్నాడు, వెలుగులు క్రమంగా పరుచుకుంటున్నాయి.
నగరంలోని సంపన్నులు ఉంటున్న ఏరియాలో సూర్యకిరణాలు పడుతుండగా, జాగింగ్ ముగించుకుని తిరిగి వస్తున్నాడు ఒక అబ్బాయి.
అతని ఎత్తు అయిదు అడుగుల తొమ్మిది అంగుళాలు. తెల్లని రంగులో, ఫిట్, స్టైలిష్, కట్టుదిట్టమైన బాడీని ప్రదర్శిస్తున్నాడు.
స్లిమ్ ఫిట్ టీ-షర్ట్, జిమ్ షార్ట్, స్పోర్ట్స్ షూస్ ధరించి ఉన్నాడు. అతని ప్రతి కదలికలోనూ భుజాలు, బైసిప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫ్యాషన్‌తో పాటు శక్తి, డిసిప్లిన్ అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి.తను ఇంటికి రావడం చూసిన వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేసి,
గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంటే గుడ్ మార్నింగ్.అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు.అక్కడ హాల్లో సోఫాలో కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చున్న రాజశేఖర్ గారిని,
హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అని పలకరిస్తాడు. దానికి ఆయన కూడా గుడ్ మార్నింగ్ అర్జున్ అంటారు.
తను రావడం చూసిన మేడ్ ప్రోటీన్ షేక్ పట్టుకొచ్చి ఇస్తుంది. అది తీసుకుని తాగుతూ మమ్మీ ఏది డాడ్, కనిపించలేదు అని అడుగుతాడు.
అమ్మ పూజ చేసుకుంటుంది రా అని ఆయన అంటుండగానే, అప్పుడే పూజ గది నుంచి బయటికి వస్తారు సుజాత గారు…
గుడ్ మార్నింగ్ మామ్ అని చెప్పేసి, ప్రోటీన్ షేక్ తాగడం పూర్తవడంతో, ఫ్రెష్ అయి వస్తాను అమ్మ, నేను త్వరగా ఆఫీస్‌కి వెళ్ళాలి.అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు.
కొడుకు ఆఫీస్‌కి త్వరగా వెళ్ళాలని అనడంతో సుజాత గారు పూజ పూర్తి చేసుకుని టిఫిన్ ఏర్పాట్లు చేయడం కోసం కిచెన్‌లోకి వెళ్తారు….
@@@@@@@@
అది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియా. ఉదయం ఎనిమిది అవుతుండగా అక్కడ వచ్చిపోయే వాహనాల రద్దీతో రోడ్డు హడావిడిగా ఉంది.
ఆ ఏరియాలో ఒక బిల్డింగ్, ఒక చిన్న గేట్ ఉంది. అది ఓపెన్ చేస్తే అటు ఇటు మొక్కలు ఉండి, ప్రధాన ఇంటి వైపు నడవడానికి దారి ఉంది.
తలుపు ఓపెన్ చేయగానే హాల్లో నలభై సంవత్సరాల ఒక మధ్య వయసురాలు ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.
ఒక పది నిమిషాలకి ఆలోచన నుంచి తేరుకుని,మాన్వితా ఏంటి ఎంత టైం అయినా ఇంకా కిందకి రాలేదు అనుకుంటూ వంటగదికి వెళ్లి కాఫీ చేసుకుని తీసుకుని పైకి వెళ్తుంది.
పైకి వెళ్లి కనిపిస్తున్న గది దగ్గరికి వెళ్తూ, మాన్వి అంటూ తలుపు తీస్తుంది. ఆ గదిలో ఒక అమ్మాయి లాప్‌టాప్, స్కెచ్ బుక్కులతో కూర్చుని కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది.
విండో ద్వారా సూర్య కిరణాలు ఆమె పైన పడుతుంటే, ఆ పక్కన టేబుల్ పైన ఉన్న మోడరన్ డెకర్ పుస్తకాలు, ఆర్కిటెక్ట్ మోడల్స్ ఇవన్నీ చల్లాచెదురుగా పడి ఉన్నాయి…
అది చూసిన అనురాధ గారు అమ్మ మాన్వి ఏంటి పొద్దున్నే కనీసం కిందకి కూడా రాలేదు అంటూ ఆ టేబుల్ మీద చల్లాచెదురుగా పడిన బుక్స్ ఇవన్నీ సర్దుతూ ఉంటుంది….
ఈలోపు మాన్వి అమ్మ నేను సర్దుకుంటానులే ఏంటో నిద్ర పట్టలేదు రాత్రి అంతా, పొద్దున్నే ఇక ప్రాజెక్ట్ కూడా దగ్గర పడుతుంది, క్లయంట్ రోజు ఫోన్ చేస్తున్నాడు.
ఇంకా ప్లాన్ ఏదో గీసేసి క్లయింట్‌కి అప్పచెప్పేస్తే ఆ పని అయిపోతుంది కదా, తర్వాత మిగిలింది మెల్లగా మొదలు పెడదామని ఇక్కడే కూర్చున్నా అని చెప్తుంది మాన్విత.
ఆ పక్కన పేపర్స్, బుక్స్ సర్దుతున్న ఆవిడకి ఒక ఫోటో కనిపించి దాన్ని చూసి కన్నీళ్లు తెచ్చుకుంటుంది.
అది చూసిన మాన్విత.అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు అలా అయిపోతే నేనేం చేయను, అన్నయ్యతో నాకు బాండింగ్ ఎక్కువే కదా….
నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేను చిన్నగా ఉన్నపుడే నాన్న చనిపోయారు. కానీ నాకు ఏ లోటు లేకుండా, నాన్న లేరు అని ఎప్పుడు గుర్తు రాకుండా చేసేవాడు.
కానీ సడన్‌గా అన్నయ్య కూడా నాకు దూరం అయిపోయాడు.అప్పుడే అన్నయ్య మన నుంచి దూరమైన నెల రోజులు అయిపోయింది.
ప్లీజ్ అమ్మ ఏడవకు అని మాన్విత కూడా వాళ్ళ అమ్మగారిని పట్టుకుని కంటతడి పెట్టుకుంటుంది.
మాన్విత కూడా ఏడవడంతో అనురాధ గారు, సరే నేను ఏడవనులే, నువ్వు కూడా ఏడవకు అని చెప్పి మాన్విత కళ్ళు తుడిచి, కాఫీ చల్లారిపోద్ది, కాఫీ తీసుకో..
నేను ఇవి సర్దుతాను అని చెప్పి అన్నీ సర్దుతారు అనురాధ గారు. ఈలోపు మాన్వికి ఫోన్ రావడంతో ఆ ఫోన్ వైపు చూస్తుంది….
కొనసాగుతుంది…..
హాయ్ అందరికీ నమస్కారం.
నేను ఈ యాప్‌కి కొత్తగా పరిచయమైన రైటర్‌ని, ఇది నేను రాస్తున్న మొదటి కథా ప్రయత్నం.
ఒక వైపు సంపన్న కుటుంబంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న అర్జున్… మరోవైపు కష్టాలతో పోరాడుతూ బాధ్యతలను మోస్తున్న మాన్విత జీవితాలు ఎలా ముడిపడబోతున్నాయి?
వీరిద్దరి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ చదవాల్సిందే,
ఈ మొదటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది?
కథలో ఎమోషన్స్ మీకు కనెక్ట్ అయ్యాయా? మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి.
మీ స్పందనే నాకు తదుపరి ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా రాయడానికి పెద్ద బలం అవుతుంది.
తప్పకుండా కథను చదివి మీ విలువైన రివ్యూస్ ఇవ్వండి,థాంక్యూ సో మచ్…
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…
Swipe left/right or tap the sides to turn pages