మజిలీ – 3
మాన్విత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి, వాళ్ళ నాన్న, అన్నయ్య ఫోటో దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుని, వాళ్ళ అమ్మ కిచెన్ లో ఉంటే అక్కడికి వెళుతుంది.
వచ్చేసావా మాన్వి ఇదిగో రెడీ అయిపోయింది పట్టుకొచ్చేస్తున్నాను, కూర్చో అని అనడంతో నేను పట్టుకొస్తాను పదమ్మ, నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మని పంపేసి,
తను మిగతాది పూర్తి చేసి మొత్తం అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పట్టుకుని వెళ్తుంది.అప్పుడు అనురాధ గారు ప్లేట్లోకి సర్వ్ చేసి, నేను తినిపిస్తాను రా అని మాన్వికి తినిపిస్తారు.
ఇక్కడ మాన్విత గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మాన్విత పేరెంట్స్ అయిన విజయ్ గారు, అనురాధ గారు ఇంట్లో వాళ్ళ కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆ పెళ్లి అటు విజయ్ ఫ్యామిలీకి, ఇటు అనురాధ గారి ఫ్యామిలీకి కూడా ఇష్టం లేకపోవడంతో ఇద్దరూ కూడా వచ్చి దూరంగా ఉంటున్నారు. ఎన్ని సార్లు వెళ్ళినా వాళ్ళని అసలు చేరదీయలేదు.
విజయ్ గారు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, ముందు విజయ్ గారికి, అనురాధ గారికి కలిపి ఒక అబ్బాయి పుట్టాడు, మోహన్.
తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత మాన్విత పుట్టింది. మాన్విత పుట్టిన ఫైవ్ మంత్స్ కే విజయ్ గారు క్యాన్సర్ వల్ల చనిపోయారు.
ఇక అప్పటినుంచి అనురాధ గారు చదువుకోవడం వాళ్ళ జాబ్ చేస్తూ పిల్లలు ఇద్దరినీ పెంచుకుంటూ వచ్చారు….
మోహన్ కరెక్ట్ గా జాబ్ వచ్చి సెటిల్ అయ్యేసరికి వన్ మంత్ బ్యాక్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు.
మాన్విత చదువు పూర్తి చేసి సివిల్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంది.
కాకపోతే ఎవరి కింద పని చేయడం తనకి ఇష్టం లేక, తన ఫ్రెండ్ అయిన స్వాతితో కలిసి కన్సల్టెన్సీ కింద ఒక చిన్న వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుని,
దాంట్లో తనకు వచ్చిన ఆఫర్స్ అంటే ఆఫీసులు, హౌసెస్, స్కూల్స్, కాలేజెస్ ఇలా ప్లానింగ్ చేసి ఇస్తారు.
ప్రత్యేకంగా ఆఫీస్ అంటూ ఏమీ లేదు, తను తన ఫ్రెండ్ అయితే మాన్వి ఇంట్లో, లేకపోతే స్వాతి ఇంట్లో అలా కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు.
ఇలా హ్యాపీగా గడిచిపోతున్న వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ అన్నయ్య చనిపోవడం వల్ల మాన్విత కొంచెం డల్ అయింది. ఇక మిగిలింది ముందు ముందు తెలుస్తుంది.
మాన్వి టిఫిన్ పూర్తి చేసేసరికి స్వాతి వస్తుంది. రామ్మా స్వాతి టిఫిన్ చేద్దువు గాని అని పిలుస్తారు రాధా గారు. వద్దు ఆంటీ..
నేను ఇంటిదగ్గరే చేసి వచ్చాను. మాన్వి అయింద,క్లయింట్ వెయిట్ చేస్తూ ఉంటారు, మనం వెళ్ళాలి అనటంతో,
సరే అమ్మ నేను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని వాళ్ళ అమ్మకి చెప్పి స్వాతి, మాన్వి వెళ్ళిపోతారు….
అర్జున్ ఆఫీస్‌కి వెళ్లేసరికి తన పీఏ సురేష్ సార్ మీటింగ్‌కి టైమ్ అయింది, అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పడంతో అర్జున్ మీటింగ్ కోసం మీటింగ్ రూమ్‌కి వెళ్తాడు….
ఒక రెండు గంటల తర్వాత మీటింగ్ పూర్తవుతుండగా, అందరికీ కూడా ఇంకో ఫోర్ డేస్‌లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.
అన్ని ప్రాజెక్ట్‌లాగా ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే మన కంపెనీ ఒక మెట్టు పైకి వెళ్తుంది. అందువల్ల అందరూ కూడా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా పని చేయండి.
ఓకేనా ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఊరుకోను, ఫోర్ డేస్‌లో మాత్రం ఇది పూర్తవ్వాల్సిందే అని అందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు.
అర్జున్ గురించి స్టాఫ్ అందరికీ తెలియడంతో అందరూ ఒకేసారి ఓకే సార్ అని చెప్పి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు.
ఇప్పుడు మన అర్జున్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. రాజశేఖర్, సుజాత గారికి ఒక్కగానొక సంతానం ఈ అర్జున్ బాబు.
రాజశేఖర్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, దామోదర్ రాజశేఖర్, దామోదర్ ఇద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
దానివల్ల ఇద్దరూ కలిపి కంపెనీ స్టార్ట్ చేస్తారు.వాళ్ళకంటూ సంఘంలో ఒక మంచి పేరుని, గుర్తింపుని తెచ్చుకున్నారు.
రాజశేఖర్ గారు మంచి వారే కానీ, దామోదర్ అంత మంచివాడు కాదు. దామోదర్ గురించి రాజశేఖర్‌కి ఏవీ కూడా పూర్తిగా తెలియవు.
రాజశేఖర్ వెనకాల దామోదర్ చాలా చేస్తుంటాడు, కాకపోతే రాజశేఖర్‌కి అవేమీ తెలియక, దామోదర్ కూడా తనలాగే మంచివాడు అనుకుంటాడు.
రాజశేఖర్ గారికి సొంతంగా కంపెనీ ఉన్నా అవి చూసుకోమన్నా అర్జున్ నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలి అని స్టేట్స్‌లో చదువు పూర్తి చేసుకుని వచ్చి,
రాగానే స్టార్ట్-అప్ కంపెనీ కింద ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. కంపెనీ పెట్టి టూ ఇయర్స్ అయినప్పటికీ తను తను చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు.
టూ ఇయర్స్ లోనే తన కంపెనీని రెండో స్థానంలో నిలబెట్టాడు.
కొనసాగుతుంది……
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…
ఇది రొటీన్ స్టోరీలా కాకుండా న్యూ కాన్సెప్ట్ లా ఉంటుంది. మీకు కచ్చితంగా నచ్చుతుంది.ఒకసారి చదివి మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి….
Swipe left/right or tap the sides to turn pages