మజిలీ – 2
ta
..మాన్విత ఫోన్ రింగ్ కావడంతో, అనురాధ గారు తెచ్చిన కాఫీ తాగుతూ ఆ ఫోన్ వంక చూస్తుంది.
ఫోన్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కావడంతో, కాఫీ పక్కన పెట్టి, హలో గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా తెలిసిందా ఆక్సిడెంట్ గురించి? ప్లీజ్ సార్ అని అడుగుతుంది.
అవతల నుంచి పోలీస్ ఆఫీసర్, నేను అది చెప్పడానికే చేశానమ్మా ఎటువంటి ఆధారం కూడా దొరకలేదు.
కనీసం సీసీటీవీ కూడా ఆ టైమ్‌లో పనిచేయలేదు. దేనివల్ల అనేది కూడా అర్థం కావడం లేదు. బట్ ట్రై చేస్తాం, కానీ కష్టమే ఆక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోవడం.
అలాగని నేను ట్రై చేయననట్లేదు, కచ్చితంగా తెలుసుకుంటాను సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
మాన్విత ఎప్పుడైతే ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టిందో, అప్పుడే అనురాధ గారు మాన్విత పక్కకొచ్చి కూర్చుని ఏం చెబుతుందా అని చూస్తున్నారు.
కానీ మాన్విత డల్ అవ్వడం చూసి, ఏమైందమ్మా, ఏమైనా తెలిసిందా అని అడుగుతారు.
లేదమ్మా, అసలు ఎలాంటి క్లూ కూడా దొరకలేదంటమ్మా. సీసీటీవీ కూడా పనిచేయలేదంట ఆ టైమ్‌లో ట్రై చేస్తాం కానీ, ఎవరు చేశారో తెలియడం కష్టమనేసి అంటున్నారు అని అనడంతో, ఆవిడ కూడా డల్ అవుతారు.
సరే నువ్వేం డల్ అవ్వకు, నేను ఎలాగైనా సరే తెలుసుకుంటాను సరేనా అని చెప్పి కప్పు వాళ్ళ అమ్మగారికి ఇచ్చి, నేను ఫ్రెష్ అయి వస్తానమ్మా, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం సరేనా…
నేను క్లైంట్ దగ్గరికి కూడా వెళ్ళాలి, ఈరోజు ఇది సబ్మిట్ చేస్తే ఇంకోటి ఏమైనా చూసుకోవాలి కదా మళ్ళీ అంటుంది.
సరేనమ్మా, నువ్వు త్వరగా రెడీ అయి వచ్చేయ్, నేను బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి ఉంచుతాను అని చెప్పి అనురాధ గారు కిందకి వెళ్ళిపోతారు. మాన్విత ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తుంది…
అర్జున్ ఫ్రెష్ అయి కిందకి వచ్చి, అమ్మా బ్రేక్ ఫాస్ట్ పెట్టు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అనడంతో, సుజాత గారు, హా నాన్న, బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోయింది.
డాడీ కూడా వచ్చేస్తే ఇద్దరికీ కలిపి పెట్టేస్తాను అని అంటూ ఉండగా, రాజశేఖర్ గారు కూడా అప్పుడే రెడీ అయి కిందకు వస్తారు….
రండి డాడ్ ఫాస్ట్ గా, నేను మీటింగ్ కి వెళ్ళాలి అనటంతో, ఒక ఐదు నిమిషాలు ఉండరా, మాట్లాడాలి అంటారు రాజశేఖర్ గారు…
ఏం మాట్లాడాలి డాడ్ ఆని అర్జున్ అడగగా ఏమీ లేదురా, నా కంపెనీ చూసుకోమంటే నువ్వు సొంతంగా పెట్టుకున్నావ్,
ఆది కూడా బాగానే ఇంప్రూవ్ చేశావ్, సెకండ్ ప్లేస్‌లో ఉంది. నువ్వు ఇంకా అన్ని కంపెనీలు కలిపి హ్యాండిల్ చేయొచ్చు కదా నేను అన్నీ చూసుకోవాలి అంటే కష్టం అవుతుందిరా అని అంటాడు.
డాడీ న ఆఫీస్లో ప్రాజెక్ట్న డుస్తుంది. నాకు ఒక ఫోర్ డేస్‌లో అది పూర్తవుతుంది. అది అయిపోయాక నా అభిప్రాయం మీకు చెప్తాను, ఓకేనా అని చెప్తాడు అర్జున్…
దానికి రాజశేఖర్ గారు, సరే రా కానీ మంచి నిర్ణయం తీసుకోరా, నాకు మాత్రం ఇంకెవరు, నువ్వు ఒక్కడివే అని అనడంతో, సరే డాడ్అంటాడు అర్జున్.
అవును డాడ్, దామోదరం అంకుల్ అసలు కనిపించట్లేదు ఈమధ్యన. ఆయన కూడా పార్ట్‌నరే కదా ఆయనకు కొన్ని అప్పచెప్పండి, మొత్తం స్ట్రెస్ అంతా మీరు తీసుకుంటే ఎలాగా అని అంటాడు.
దానికి రాజశేఖర్ గారు, పేరుకి పార్టనర్ అన్న మాటే కానీ ఆఫీసుకు మాత్రం రాడు. నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఇక్కడ పని ఉంది అని చెప్తాడంతే తప్ప రాడు.
నేనేమో చూసుకోలేకపోతున్నాను,అందుకే నువ్వు ఏ నిర్ణయం చెప్తే దానితోపాటు మొత్తం పార్ట్‌నర్షిప్ క్యాన్సిల్ చేసి, మొత్తం మన హ్యాండే చేసేసుకుందాం రా ఆఫీసులన్నీ అంటాడు.
ఓకే డాడ్, నేను ఆలోచించి నీకు అన్ని వివరంగా చెప్తాను సరేనా అంటాడు. హా డాడ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నా ఆఫీస్‌లో పైఫ్లోర్ రీమోడలింగ్ చేద్దామనుకుంటున్నాను.
మంచి ఆర్కిటెక్ట్ కోసం చూస్తుంటే, మొన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ ఒకటి చూశాను, అది నాకు బాగా నచ్చింది డాడీ.
ఆ ఆఫీస్ మోడల్ గీసిన ఆర్కిటెక్ట్ గురించి తెలుసుకున్నా ఆ నెంబర్ తీసుకుని మాట్లాడి, నాకు ఎలా కావాలో వివరంగా చెప్పి అలా చేయాలనుకుంటున్నాను అంటాడు.
సరేరా నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్ అనటంతో, సరే డాడ్ నా బ్రేక్ ఫాస్ట్ అయింది. బాయ్ డాడ్, బాయ్ మమ్ అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు…
అర్జున్ లంచ్ కి వస్తావా, డ్రైవర్ చేత పంపనా అని అడుగుతారు సుజాత గారు. మామ్ ఫోన్ చేస్తాను.
నాకు బయట ఇంకో మీటింగ్ ఉంది లంచ్ టైంకి, దాన్ని బట్టి నేను ఫోన్ చేసి చెప్తాను ఓకేనా, నువ్వు అయితే ఏం పంపకు అని చెప్పి వెళ్ళిపోతాడు.
కొనసాగుతుంది……..
రేపు హీరో హీరోయిన్ ఫ్యామిలీ గురించి కొంచెం క్లారిటీగా చెప్తాను.
Swipe left/right or tap the sides to turn pages