మనసు చూడ తరమా 💗 – 1
సమయం : అర్ధ రాత్రి 12 గంటల 48 నిముషాలు…
రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటే… అంతే నైరాశ్యాన్ని గుండెల్లో నింపుకొని… అల్లకల్లోలంగా ఉన్న మనసుతో అతి వేగంగా డ్రైవ్ చేస్తూ వస్తున్న తన మెర్సీడెజ్ బెంజ్ కి ఎదురుగా ఎవరో చాలా వేగంగా పరిగేటతుకుంటూ వస్తుంటే తన కార్ స్పీడ్ తగ్గించి అటుగా వస్తున్న వ్యక్తిని గమనిస్తాడు…
పది మంది వస్తాదుల్లాంటి రౌడీల నుండి తప్పించుకొని ప్రాణాలను గుప్పెట్లో బంధించి… గుండెల్లోని రక్తం బయటకు చీమ్ముతుందేమో అన్నంత వేగంగా పరిగెడుతూ వచ్చి కార్ కి అడ్డంగా పాడబోతుంది…
సడన్ బ్రేక్ వేసి కార్ ఆపితే…
ఎదురుగా వస్తున్న కార్ ని చూసి ఆమె వెంట పడటం మానేసి… ఆమె చేతికి దొరక్కపోయినా పర్వాలేదు కానీ… ప్రాణాలతో మాత్రం ఉండకూడదనుకున్న ఆ రౌడీలలో ఒకడు అతని చేతిలో ఉన్న బలమైన ఇనుప రాడ్ ని అంతే బలంగా, వేగంగా ఆమె తలకు గురి చూసి విసురుతాడు…
కార్ ఆక్సిడెంట్ నుంచి తప్పించుకుంటుంది కానీ ఆ రౌడీల నుండి తప్పించుకోలేని ఆమె అక్కడే కుప్పకూలీ పోతుంటే…
కళ్ళముందు క్షణాల్లో జరిగిపోయిన దారుణాన్ని చూస్తూ… అప్పటి వరకు ఉన్న అతని ఆలోచనల నుండి బయటకు వచ్చి… కార్ నుండి దిగి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను పడిపోకుండా పట్టుకొని… చంపేయాలన్నత కసిగా చూస్తాడు ఆ రౌడీలను…
అతని చూపుకు ఆ రౌడీలు ఒక అడుగు వెనుకకు వేస్తే…
అప్పటికే తెల్లగా మెరుస్తున్న ఆమె డ్రెస్ రక్తం తో తడిసి పోతుంటే… స్పృహలో లేని ఆమెను చూసి లేట్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదామని… ఇంకా లేట్ చేయకుండా ఆమెను చేతుల్లోకి తీసుకొని కార్ పాస్సింజర్ సీట్ లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ వేసి… కార్ రివర్స్ చేసి వచ్చిన దారినే వెళ్తాడు అంతే వేగంగా…
హాస్పిటల్ దగ్గరకు రాగానే కార్ ని పార్కింగ్ వరకు తీసుకెళ్లకుండా… హాస్పిటల్ గుమ్మం కి ఎదురుగా ఆపి పరుగున ఆమె వైపుకు వెళ్లి ఆమెను మళ్ళీ చేతిలోకి తీసుకొని పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తూ స్ట్రెచర్ తీసుకు రమ్మని అరుస్తాడు అక్కడ ఉన్న నర్సులను…
ఖంగుమంటున్న అతని వాయిస్ విని గడగడలాడుతూ వెంటనే ఒక స్ట్రెచర్ ని తోసుకుంటూ వచ్చిన నర్స్ ని వెంటనే ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లమని ఆర్డర్ వేస్తాడు అతని చేతుల్లో ఉన్న ఆమెను స్ట్రెచర్ మీద పడుకోబెడుతూ…
అతని మాటే శాసనం అన్నట్టు వెంటనే ఆమెను ఆ నర్స్ ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్తుంటే… వెనక్కు వచ్చి అతని చేతిలో ఉన్న కార్ కీస్ ని వచ్మెన్ వైపు విసిరి కార్ ని పార్కింగ్ ఏరియా లో పార్క్ చేయమని చెప్పి… వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ కి పరుగు తీస్తాడు డా. అనిర్వాణ్…
ఆడపిల్లను ఆమడ దూరం లోనే ఆపేసే ప్రవరఖ్యడు లాంటి మా డాక్టర్ బాబు… అర్ధ రాత్రి వేళ అరచేతుల్లో మోసుకొచ్చిన ఆ అమ్మాయి ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తుంటారు అక్కడి హాస్పిటల్ లో స్టాఫ్ అంతా…
ఎమర్జెన్సీ రూమ్ లోకి వెళ్లిన అనిర్వాణ్ ఆమె తలలో నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తుడుస్తున్న నర్స్ ని పక్కకి జరగమని సైగ చేసి… ఆమె చెయ్యి పట్టుకొని చూస్తే ఎక్కడో కొట్టుకుంటున్న పల్స్ కి… ఆమె ముక్కుకి ఆక్సిజెన్ మాస్క్ పెట్టించి…
బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఇంజక్షన్ చేసి… టైమ్ చూస్తాడు… 1:40 చూపిస్తుంటే… దెబ్బ తగిలి గంట అవుతున్నా బ్లడ్ క్లాట్ అవ్వలేదేంటని అలోచించి… ఆమె బ్లడ్ ని టెస్ట్ కి పంపించి… సేమ్ గ్రూప్ బ్లడ్ ఆరెంజ్ చేయమని బ్లడ్ బ్యాంకు కి ఇన్ఫోర్మ్ చేసి…ఇంకో ఐదు నిముషాలు వెయిట్ చేస్తాడు…
ఈ లోపు బ్లడ్ క్లాట్ అవ్వడం తో… రిస్ట్ వాచ్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టి… నర్స్ తో ఆమెకు హాస్పిటల్ డ్రెస్ వేయించి… గాయాన్ని చెక్ చేసి… ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్తాడు…
………………………………………………..
కసితీరా ఆమెను చంపాలనుకున్న ఆశ తిరకుండానే వారి చేతిలోనుంచి తప్పించుకుందని ఆవేశ పడుతూ… ఎలాగైనా ఆమెను చంపాలి అనుకున్న ఆ రౌడీలు అనిర్వాణ్ కార్ ని ఫాలో చేసి హాస్పిటల్ వరకు అయితే వస్తారు కానీ… అక్కడ ఆమె చుట్టూ ఉన్న డాక్టర్లను నర్స్ లను దాటుకొని ఆమెను చంపడం ఎలాగో తెలియక బయట బయటే తారాడుతున్న వారికీ… ఫోన్ కాల్ రావడం తో… అప్పటివరకూ వేటాడుతున్న కొదమ సింహాల్లా ఉన్న వాళ్ళు కాస్తా… ఆ ఫోన్ కాల్ చేస్తున్న వ్యక్తిని తలచుకొని తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోయే కుందేలు పిల్లల్లా… భయంతో చెమటలు కక్కుతారు…
ఇప్పుడు అతను అడిగే వాటికీ ఏమని సమాధానం చెప్పాలి… ఆమెను చంపేసాం అని చెప్పాక ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అతని కంట పడితే… ఆమె తో పాటు తమను కూడా చంపేస్తాడు…
పోనీ చివరినిమిషంలో తప్పించుకుంది అని చెప్తే… ఈ క్షణమే చంపేస్తాడు… ముందు చూస్తే గొయ్యి… వెనక చూస్తే నుయ్యి అన్నట్లు ఉన్న తమ పరిస్థితికి… ఇప్పుడు ఏం చెయ్యాలి… ఎలా ఈ ఉపధ్రువమ్ నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్న ఆ రౌడీలకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అండర్ గ్రౌండ్ కి వెళ్లడం తప్ప మరో మార్గం కనబడదు…
కానీ అక్కడ కూడా ప్రాణాలతో బతికి బట్ట కడతారనే గారంటీ లేదు… ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాకే అక్కడి నుండి కదలాలి అనుకున్న వాళ్ళకి తెలియదు ఆల్రెడీ వాళ్ళను మృత్యువు వెంటాడుతుందని…
ఆమెను చంపినా… చంపక పోయినా వాళ్లకు మాత్రం చావు తప్పదని…
రెండు సార్లు రింగ్ అయ్యి ఆగిపోయిన ఫోన్ కాల్ కి హమ్మయ్య… అనే ఫీలింగ్ కలుగుతుంటే… ముచ్చటగా మూడో సారి మళ్ళీ రింగ్ అవుతుంది ఫోన్…
ఇక ఏదో ఒకటి చెప్పక తప్పదని అర్ధమై… జరిగిన విషయాన్నీ దాచకుండా నిజం చెప్పి ఆ క్షణం చావు నుంచి తప్పించుకొని… వాళ్ళ చావుకి ఇంకొంచెం టైం పొడిగించుకుంటారు ఆ రౌడీలు…
మళ్ళీ కలుద్దాం ❤️
Swipe left/right or tap the sides to turn pages