New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మనసు చూడ తరమా 💗 – 2

మనసు చూడ తరమా 💗 – 2

కాస్త లేట్ గా వస్తానని చెప్పి సాయంత్రం 4 గంటలకు వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్లిన మృదు… రాత్రి 10 దాటినా ఇంకా హాస్టల్ కి రాకపోవడం తో ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం తో తన ఫ్రెండ్ అపూర్వ కి కాల్ చేసి మృదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది… తను హాస్టల్ కి వచ్చిందా అని అడుగుతుంది హాస్టల్ వార్డెన్ కమలా దేవి… 

ఆఫీస్ లో కోల్లిగ్ బర్త్డే పార్టీ ఉంది వెళ్ళొస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి అని… మృదు  కోసమే వెయిట్ చేస్తున్న అపూర్వ వార్డెన్ కి ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే ఆవిడే కాల్ చేయడం తో… లిఫ్ట్ చేసి ఏంటి మామ్ ఈ టైమ్ లో కాల్ చేశారు అని అడుగుతుంది… 
ఈవెనింగ్ అనగా బయటకు వెళ్లిన మృదు ఇంకా హాస్టల్ కి రాలేదు… ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది… ఎక్కడికి వెళ్లిందో ఎప్పుడొస్తుందో నీకేమైనా చెప్పిందా అని అడుగుతారు వార్డెన్… 
కోల్లిగ్ బర్త్డే అంటే తిట్టిపొస్తుందేమో అని… తన కోల్లిగ్ కి బాగోలేదంటే చూసి రావడానికి వెళ్ళింది మామ్… ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందట… వచ్చేస్తుంది మామ్ అని చెప్పి అప్పటికి వార్డెన్ నుంచి కవర్ చేస్తుంది అపూర్వ మృదు ని… 
మృదు నేచర్ ఏంటో తెలిసిన కమలా దేవి గారు ఈజీగా నమ్మేస్తారు అపూర్వ మాటలని… ఎందుకంటే తనకు తెలిసిన వారికీ ఎవరికీ ఏం జరిగినా తను ముందుంటుందని మృదు మీద ఎక్కువ కోపం చూపలేరు ఆమె గురించి తెలిసిన వారు ఎవరైనా… అందుకు హాస్టల్ వార్డెన్ కూడా అతీతం కాదు… 
సరే తను వస్తే ఒకసారి నన్ను కలవమను… అని ఆవిడ రూమ్ కి వెళ్తూ… 
మృదు వస్తే రిజిస్టర్ లో ఎంట్రీ రాయించి పంపు అని నైట్ వాచ్ మెన్ కి కూడా చెప్తారు… ఆయన సరే అని తన డ్యూటీ కి సిద్దమైతే… 
రూమ్ ముందు పచార్లు చేస్తూ ఉంటుంది అపూర్వ…  ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడొస్తుందా అని… చిన్న ఇంఫర్మేషన్ కూడా లేదు వెళ్లిన దగ్గరి నుంచి అని టెన్షన్ పడుతూ…
❤️
ఈ లోపు బ్లడ్ క్లాట్ అవ్వడం తో… రిస్ట్ వాచ్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టి… నర్స్ తో ఆమెకు హాస్పిటల్ డ్రెస్ వేయించి… గాయాన్ని చెక్ చేసి… ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్తాడు… 
ముందు ఆమెకు ఏంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ రెడీ అయ్యే లోపు… 
దాదాపు గంట సేపు బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లీడింగ్ జరగడం వలన బాడీ లో బ్లడ్ చాలా మొత్తంలో లాస్ అవ్వడం వలన బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యూలేషన్ జరగడం ఆగిపోయి కోమా స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉండటం తో… వెంటనే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేస్తే… ఆ టైమ్ కి ఆ గ్రూప్ బ్లడ్ లేదని… తెప్పించడానికి టైమ్ పడుతుందని చెప్తారు … 
వెంటనే అదే బ్లడ్ గ్రూప్ ఉన్న తన ఫ్రెండ్ ఉజ్వల్ కి కాల్ చేసి విషయం చెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పొజిబుల్… నువ్వు నా హాస్పిటల్ లో ఉండాలని అనగానే… అర్ధ రాత్రి 2 గంటల సమయంలో వచ్చిన ఎమర్జెన్సీ కాల్ కి… తన గుండెల మీద ఆదమరచి నిద్రపోతున్న తన భార్యను మెల్లగా దిండు మీదకు షిఫ్ట్ చేసి… డ్రెస్ చేంజ్ చేసే టైమ్ లేక పోవడంతో షార్ట్ అండ్ టీ షర్ట్ లోనే పది నిమిషాల్లో  అనిర్వాణ్ హాస్పిటల్ లో ఉంటాడు ఉజ్వల్… 
అతను రావడమే బ్లడ్ టెస్ట్ చేయించి… అతను ఆరోగ్యాంగా ఉన్నాడని నిర్ధారణ అయ్యాకే అతని నుంచి 450ఏం ఎల్ బ్లడ్తీ యించి పేషేంట్ కి ఎక్కిస్తాడు… అయినా అది ఆమెకు సరిపోదు… అతనిది ఎక్కిద్దామంటే అతనిది బి పాజిటివ్ కావడంతో అది అసాధ్యమని… మళ్ళీ హాస్పిటల్ లో పేషేంట్స్ కాకుండా ఇంకెవరైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తాడు… ఎందుకంటే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికీ ఇంకా వేరే ఏ బ్లడ్ గ్రూప్ సరిపోదు కాబట్టి ఓ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఇవ్వాలి… ఓ నెగటివ్ దొరికినా పర్వాలేదు కానీ అది కూడా రేర్ గ్రూప్ అవ్వడం తో అది కూడా దొరకదు ఆ సమయానికి…
మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కి కాల్ చేస్తే…  ఓ పాజిటివ్ బ్లడ్ రెండు ప్యాకెట్స్ ఉన్నాయని చెప్పడం తో త్వరగా పంపించమని… హాస్పిటల్ అడ్రెస్ చెప్పడంతో వెంటనే వాళ్ళు వచ్చి ఆ బ్లడ్ ఇచ్చి వెళ్తారు… వెంటనే అది ఆమెకు ఎక్కించి 48 అవర్స్ అబ్సర్వేషన్ లో పెడతాడు డాక్టర్ అనిర్వాణ్ న్యూరో సర్జన్…
అరగంట కొకసారి ఆమె పల్స్ చెక్ చేయమని చెప్పి తన రూమ్ కి వెళ్లి కళ్ళు మూసుకొని చైర్ లో కూర్చున్న అనిర్వాణ్ దగ్గరికి వచ్చి ఎవరురా తను అంత కంగారు పడుతూ అర్జెంట్ గా నన్ను రమ్మన్నావ్…  అని అడుగుతాడు ఉజ్వల్… 
ఉజ్వల్ గొంతు విని కళ్ళు తెరిచిన అనిర్వాణ్ ఎదురుగా కూర్చుంటూ… గత నాలుగేళ్లుగా నీలో ఎలాంటి ఎమోషన్ చూడని నేను… ఇవాళ బాధ, భయం, కంగారు లాంటి చాలా ఎమోషన్స్ నీలో చూసాను… వీటన్నిటికీ తనే కారణమైతే… చలనం మర్చిపోయిన నీలో ఇంత మార్పు… ఇన్ని ఎమోషన్స్ తీసుకువచ్చిన తనకి నేను నిజంగా థాంక్స్ చెప్పాలి… అంటాడు ఉజ్వల్… అయినా మౌనంగానే ఉన్న అనిర్వాణ్ ని చూస్తూ…
ఆ టైమ్ లో ఫోన్ రావడం నాకు టెన్షన్ గా అనిపించినా… నీ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది అనగానే చురుకుగా చూస్తాడు అనిర్వాణ్… ఇలా మాట్లాడటం తప్పేమో… కానీ నీతో ఏ విషయం దాచుకోలేని బలహీనత నాది… అని అనిర్వాణ్ కళ్ళలోకే చూస్తాడు ఉజ్వల్… 
నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా అని ఉజ్వల్ అనగానే వెంటనే చూపు తిప్పేస్తాడు అనిర్వాణ్… 
వీళ్ళు ఎందుకు మాట్లాడుకోవట్లేదు…? 
అనిర్వాణ్ నాలుగేళ్లుగా అందరికి దూరంగా ఎందుకు ఉంటున్నాడు…? 
ముందు ముందు తెలుసుకుందాం… 
మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ❤️